Advertisement

Advertisement


Home > Articles - Chanakya

హుద్ హుద్..సాయం..హుష్ కాకి

హుద్ హుద్..సాయం..హుష్ కాకి

చంద్రబాబు భలే తెలివైన వారు దేనినైనా పబ్లిసిటీతో మాయ చేయగలరు. తనకు అనుకూలంగా మార్చుకోగలరు. హుద్ హుద్ వ్యవహారం అలాంటిదే. ఎప్పుడూ ఎరగనంత గాలి వచ్చింది. విశాఖ, విశాఖ జిల్లాలో విద్యుత్ శాఖకు, పంటలకు, తోటలకు నష్టం ఏర్పడింది. ఉత్తరాంధ్ర కోస్తా గ్రామాల్లో కాస్త వరద ముంపు వచ్చింది. అన్నింటికి మించి చెట్లుఎక్కువగా విరికి పడి పచ్చటి విశాఖ, బోడిగా మారింది.

ఇప్పుడు ప్రారంభమైంది చంద్రబాబు హడావుడి. తెగ హడావుడి. ఆపై అత్యంత సౌకర్యవంతమైన కేరవాన్ లో నిద్ర. త్వరలో విశాఖ ఎన్నికలు రాబోతున్నాయి. ఇదే తరుణం. పంచేయండి..ఫ్రీగా..పప్పులు, ఉప్పులు..నూనేలు. ఎవరు వద్దంటారు. అవును ఇంతకీ ఎందుకు? గాలి వస్తే ఇంట్లో సామానులుకేమయింది? కరెంటు కదా పోయింది..పాలు, నీళ్లు కదా రానిది. అని ఎవరూ అడగలేదు. ఫ్రీగా వస్తున్నాయి. కదా. అలా ఈ ఫ్రీ ఫ్రీలకే 450 కోట్లు ఖర్చు చేసేసారు. దాతలు ముందు వచ్చి మొక్కలునాటారు. నెల దాటిపాయింది. మోడైన చెట్లు మళ్లీ చిగుర్చాయి, మళ్లీ పచ్చదనం కనిపిస్తోంది.

ఇప్పుడు కేంద్రం అసలు లెక్కలు తేల్చింది. హుద్ హుద్ నష్టం 680కోట్లే అని చెప్పేసింది. ఇప్పటికి నాలుగువందల కోట్లు ఇచ్చాం అంది. కానీ మన బాబు లెక్కేసి, వేరే పథకాలకు వాడుకోవచ్చనుకుని, అడిగిన సాయం అక్షరాలా...21వేల 908 కోట్లు. తక్షణ సాయమే 9,337 కోట్లు. కానీ కేంద్రం అంచనాలు దానికి కిలో మీటరు కాదు..వందల కిలోమీటర్ల  దూరంలో వున్నాయి.

మనం, మన పచ్చపాత పత్రికలు బాకా వూదేస్తే చెల్లిపోతుందా..నిజానికి విశాఖలో ఎంత నష్టం వాటిల్లింది అన్నది విశాఖ వాసులకు మాత్రం తెలియదా..కరెంటు శాఖ అత్యధికంగా నష్టపోయింది. ప్రయివేటు వ్యాపారసంస్థల అద్దాలు, రేకులు ఎగిరిపోయాయి. వాటికి క్లెయిమ్ లు వున్నాయి. ఎయిర్ పోర్టు కేంద్రం వ్యవహారం. చెట్లు చేమలకు ప్రయివేటు ఫండింగ్ వచ్చింది. కేంద్రం ఇచ్చిన నాలుగు వందల కోట్లు పప్పుబెల్లాలు ఓట్ల కోసం పంచేయడానికి సరిపోయింది. కేంద్రం అసలు సంగతి ఇప్పుడు నిగ్గు తేల్చింది. అక్కడ వున్నవాడు..చంద్రబాబును మించిన ఘనుడు..మోడీ మహాశయుడు.​

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?