ఇలా ఓడిపోవాలి.!

గెలవడమెలాగో చెప్పడానికి అనేక పాఠాలున్నాయి. ఓటమికి ప్రత్యేకంగా పాఠాలు అక్కర్లేదు. చాలా ఓటముల వెనుక స్వయంకృతాపరాధం ప్రధాన కారణంగా వుంటుంది. క్రికెట్‌లో అయితే మరీ ఎక్కువగా స్వయంకృతాపరాధాలే ఓటమికి కారణమవుతుంటాయి. ఆస్ట్రేలియా, భారత క్రికెట్‌…

గెలవడమెలాగో చెప్పడానికి అనేక పాఠాలున్నాయి. ఓటమికి ప్రత్యేకంగా పాఠాలు అక్కర్లేదు. చాలా ఓటముల వెనుక స్వయంకృతాపరాధం ప్రధాన కారణంగా వుంటుంది. క్రికెట్‌లో అయితే మరీ ఎక్కువగా స్వయంకృతాపరాధాలే ఓటమికి కారణమవుతుంటాయి. ఆస్ట్రేలియా, భారత క్రికెట్‌ జట్ల మధ్య టెస్ట్‌ సిరీస్‌.. అదీ ఆస్ట్రేలియాలో జరుగుతోందంటే, భారత్‌కి విజయావకాశాలు చాలా తక్కువ. అందునా యంగ్‌ క్రికెటర్లతో కూడిన జట్టు కాబట్టి, సహజంగానే అనుభవ లేమి పరాజయం వైపు పరుగులు పెట్టిస్తుంది టీమిండియాని.

గెలుపు వాకిట నిలబడి మరీ ఓటమి కోరల్లోకి వెళ్ళింది టీమిండియా, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో. 99 పరుగుల వద్ద మంచి ఫామ్‌లో వున్న విజయ్‌ ఔటయ్యాడు. కెప్టెన్‌ కోహ్లీ సెంచరీ చేశాడు. 364 పరుగుల టార్గెట్‌.. 200 పరుగులకు రెండు వికెట్లే పడ్డాయి. క్రీజ్‌లో విజయ్‌, కోహ్లీ వుండడంతో, టీమిండియా ఎలాగైనా సంచలన విజయం సాధిస్తుందని భారత క్రికెట్‌ అభిమానులు భావించారు. కానీ, టీమిండియా పరాజయం పాలయ్యింది.

షాకింగ్‌ న్యూసే ఇది.. మధ్యలో కాస్సేపు మ్యాచ్‌ మిస్‌ అయినవారికి. ఎలాగైనా గెలిచేస్తుందిలే.. అని అప్పటిదాకా ఉత్కంఠగా ఎదురు చూసి, కాస్సేపు బయటకు వెళ్ళినవారు షాక్‌కి గురయ్యారు మరి. 48 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలయ్యింది. ఆజింక్య రహానే.. ఎలా క్రీజ్‌లోకి వచ్చాడో, ఎలా వెళ్ళాడో కూడా తెలియని పరిస్థితి. జస్ట్‌ వచ్చి వెళ్ళాడంతే. రోహిత్‌ శర్మ అయితే అసలు బ్యాటింగ్‌ చేయాలనే ఇంట్రెస్ట్‌తో క్రీజ్‌లోకి వచ్చాడా? అనిపించింది.

క్రికెట్‌లో పొరపాట్లు సహజం. గెలుపోటములూ సహజమేగానీ.. నిర్లక్ష్యం కారణంగా మ్యాచ్‌ కోల్పోతే, అదీ చేజేతులా పాడుచేసుకుంటే.. అదీ ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో.. అంటే బాధాకరమైన విషయమే. ఇంకోసారి టీమిండియాకి ఇలాంటి ఛాన్స్‌ వస్తుందా.? ఏమో మరి.!