Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

‘పెట్రోభారం’ : పెద్దదోపిడీ చంద్రబాబుదే!

‘పెట్రోభారం’ :  పెద్దదోపిడీ చంద్రబాబుదే!

ఇవాళ మండిపోతున్న పెట్రోధరలకు వ్యతిరేకంగా.. దేశవ్యాప్తంగా బంద్ జరుగుతోంది. కాంగ్రెస్ పిలుపు ఇచ్చిన ఈ బంద్ కార్యక్రమంలో ప్రతిపక్షాలు అన్నీ ఉమ్మడిగా పాల్గొంటున్నాయి. నిరసనలు తెలియజేస్తున్నాయి. అయితే పెట్రోలియం ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా ఉండడం వెనుక.. ఆయా రాష్ట్రాలు విధించే పన్నుల్లో తేడా ఉండడమే కారణం. ఈ రకంగా చూసినప్పుడు ఇరుగు పొరుగు రాష్ట్రాలకంటె ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా వ్యాట్ పన్ను ఉండడం విశేషం.

కేంద్రం పెట్రోలు ధరలు పెంచుతుండగా, చంద్రబాబునాయుడు కూడా వారిని విమర్శిస్తున్నారు. బంద్ కు తెలుగుదేశం మద్దతు  ఇవ్వకపోయినా.. మోడీని తిట్టడానికి మాత్రం ఆయన ఈ అంశాన్ని వాడుకుంటున్నారు. కానీ లోతుగా గమనించినప్పుడు.. దేశంలో మహారాష్ట్ర తప్ప దేశంలో అత్యధిక వ్యాట్ భారం పెట్రోలు మీద మోపుతున్నది చంద్రబాబునాయుడు ప్రభుత్వమే అని మనకు అర్థమవుతుంది.

పైగా.. తన తరఫునుంచి వ్యాట్ తగ్గించి తన రాష్ట్ర ప్రజలకు మేలు చేసే సంగతి తరువాత.. కనీసం.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అదనంగా తాను దోచుకుంటున్న పన్నుభారాన్ని అయినా చంద్రబాబు తగ్గిస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు.

లీటరు పెట్రోలుపై రాష్ట్రాలు వ్యాట్ విధిస్తాయి. రాజస్తాన్ సీఎం వసుంధర రాజె సింధియా తాజాగా బంద్ నేపథ్యంలో తమ రాష్ట్రం విధించే వ్యాట్ లో 4శాతం తగ్గించారు. దీనివల్ల లీటరు పెట్రోలు మీద 2.5 రూపాయి తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఏయే రాష్ట్రాలు ఎలా వ్యాట్ విధిస్తున్నాయో పరిశీలించినప్పుడు.. చంద్రబాబు సర్కారు చేస్తున్న దోపిడీ కళ్లకు కట్టినట్టు అర్థమవుతుంది.

రాజస్తాన్ లో ప్రస్తుతం ఉన్న వ్యాట్ 30.80 శాతం మాత్రమే. ఇందులోనూ వారు 4 శాతం తగ్గించారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర నగరాల్లో 39.12, రాష్ట్రంలో 38.11 శాతం పన్ను ఉంది. ఆ తర్వాత అత్యధిక వ్యాట్ విధిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ 35.77 శాతం వేస్తోంది. తెలంగాణలో అది 33.71 శాతం మాత్రమే. తమిళనాడులో 32.16 మాత్రమే. అంటే తగ్గించగలిగిన దోపిడీ ఎవరిది ఎక్కువో అర్థమవుతూనే ఉంది.

రాజస్థాన్ భాజపా సర్కార్ పన్ను తగ్గించిన తర్వాత.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కర్నాటక, పంజాబ్ కూడా ఇలాంటి ప్రయత్నంలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పంజాబ్ లో 35.12, కర్నాటకలో 30.28 మాత్రమే పన్నులున్నాయి. వాటిని కూడా తగ్గించబోతున్నారు. కనీసం 4శాతం తగ్గించే అవకాశముందని సమాచారం.

వివిధ రాష్ట్రాల్లో పెట్రోలియంపై విధిస్తున్న వ్యాట్ తీరు ఈ రకంగా ఉంది. :

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?