ఎంత భార్యాభర్తలు అయినా, లేదా రిలేషన్ షిప్ లో ఉన్నా.. అన్ని వేళలా అతుక్కుని ఉండటం అనేది ఆ బంధాన్ని బలోపేతం చేయడం కన్నా, మనుషుల మధ్యన దూరాన్ని పెంచగలదు అని అంటారు రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్. అది దంపతుల మధ్యన అయినా సరే.. కాస్త దూరం ఉండటం చాలా మంచిదనేది వారు చెప్పే మాట! దూరం అంటే.. చెరో చోట స్టే చేయమని కాదు, అలా చేసినా చేయకపోయినా.. మనుషులు తమతో తాము గడుపుకునేందుకు ఒక సమయం ఉండాలనేది బాంధవ్యంలో ఉన్న వారు అర్థం చేసుకోవాల్సిన విషయం.
భార్యపై అయినా, భర్తపై అయినా అతి ప్రేమతో.. ఒక నిమిషం తాము పక్కన లేకపోయినా వారేమైపోతారో అనేంత ప్రేమ తీరు పనికిరాదు. చెరో ఆఫీసులో పని చేసుకునే వారికి ఇలాంటి ఇబ్బందులు ఉండవు. లేదా ఇంట్లో ఒకరు, ఆఫీసుకు మరొకరు వెళ్లిపోయి.. రోజుకు పది గంటల పాటు దూరదూరంగా ఉండే వారికీ ఇబ్బంది లేదు. అయితే వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ బాగా లైఫ్ లో భాగం అయిపోయిన తరుణం ఇది. ఇలాంటి సమయంలో.. పగలంతా ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటూ గడపడం లేనిపోని ఇబ్బందులనే తెచ్చి పెట్టగలదు.
కేవలం ఇంట్లో కూర్చుని పని చేసుకుంటూ.. 24 గంటలూ ఒకరి పక్కన ఒకరు ఉంటే అది ఏ హనీమూన్ పిరియడ్ లోనో బాగా ఉండొచ్చు. అయితే హనీమూన్ పిరియడ్ లాంగ్ టైమ్ కొనసాగదు ఎవరికీ. ఒకవేళ ఎవరైనా ఆ ఆటిట్యూడ్ తో ఉన్నా, పార్ట్ నర్ పక్కనే ఉండాలనే తపనతో ఉన్నా.. మరొకరు అలానే ఫీల్ కావాలని ఏమీ లేదు. ప్రైవసీని కోరుకునే వాళ్లు ఉంటారు. ప్రైవసీ అంటే దంపతులు ఇద్దరే ఉండటం కాదు, ఆ దంపతుల్లో కూడా ఒక్కరే గడిపే సమయం ఉంటుంది! ఆ సమయాన్ని ఒక్కోరు ఒక్కోలా వెచ్చించవచ్చు. ఆ కాసేపు ఎవ్వరూ డిస్ట్రబ్ చేయకూడదని వారు కోరుకోవచ్చు!
ఇద్దరూ కలిసి సినిమా చూసే అలవాటు ఉంటే ఫర్వాలేదు. ఒకరికి ఇంట్రస్ట్ లేనప్పుడు మరొకరు డిస్ట్రబ్ చేసే పద్ధతి ఉండకూడదు! నేనేం చేస్తే నువ్వూ అదే చేయాలనే తత్వం కూడదు! ఒకరికి రూమ్ లో కూర్చుని ఏ పుస్తకమో చదుకోవాలనే ఆసక్తి ఉండవచ్చు, మరొకరికి అలా బయటకు వెళ్లి వాకింగ్ చేసి వీధి చివర ఉన్న హోటల్లో టీ తాగి వచ్చే ఆసక్తి ఉండవచ్చు. ఈ రెండు పూర్తి భిన్నం. ఒకవేళ ఇద్దరికీ ఒకే ఆసక్తి ఉంటే అదో ముచ్చట. లేదంటే ఎవరికి నచ్చింది వారు చేసుకోవడం చాలా ఉత్తమమైన జీవన విధానం. దంపతులం కాబట్టి, రిలేషన్ షిప్ లో ఉన్నాం కాబట్టి.. ఇద్దరూ ఒకటే చేయాలి, ఒకేలా చేయాలనుకోవడం మాత్రం సబబు కాదు అనేది బంధంలో ఉన్న వారికి ఇచ్చే సూచన!
ఈ సబ్జెక్టులో మరికాస్త డీప్ కు వెళితే కొందరికి జీవితంలో కొన్ని టార్గెట్స్ ఉంటాయి. గోల్స్ ఉంటాయి. వాటి కోసం ప్రతి రోజులోనూ కొంత సమయాన్ని కేటాయించే ప్రణాళికలు ఉంటాయి. పెళ్లి చేసుకున్నా.. అలాంటి గోల్స్ ను వారు వదులుకోలేకపోవచ్చు.
ఆడ అయినా మగ అయినా అలాంటి లాంగ్ టర్మ్ ప్లాన్స్ లో ఉన్నప్పుడు దానికంటూ కొంత సమయాన్ని కేటాయించాల్సి వచ్చినప్పుడు వారి మానాన వారి సమయాన్ని వారికే వదిలేయడం వల్ల మీపై వారికి గౌరవం పెరుగుతుంది. వారు ఎంతసేపూ సమయాన్ని అంతా మీతోనే వెచ్చించాలని కోరుకోవడం, వారికంటూ ఇక వేరే లక్ష్యాలు కావొచ్చు, హాబీలు కావొచ్చు ఉండకుండా.. బంధంలో ఉన్నారు కాబట్టి.. సమయాన్నంతా రాసిచ్చినట్టుగా ఫీల్ కావడం సమంజసం కాదు. అలా వారి లక్ష్యాలకు అనుగుణంగా మీరు కూడా సహకారం అందిస్తే వారు మీ పట్ల మరింత కృతజ్ఞతా భావాన్ని కూడా పెంపొందించుకునే అవకాశం ఉంది.
వారి సమయాన్ని గడపడానికి వారికే అవకాశం ఇవ్వడం అంటే పరస్పరం గౌరవించుకున్నట్టే! భార్యభర్తల బంధంలో అంత కన్నా గౌరవం ఇంకోటి ఉండదు. దీని వల్ల ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్ కూడా పెంపొందుతుంది. రెగ్యులర్ కుటుంబ డ్యూటీలను పంచుకోవడం, ఒక్కొక్కరుగా ఒక్కో పని పూర్తి చేసుకోవడం, అన్ని పనులకూ ఇద్దరూ కలిసే వెళ్లాలనే ధోరణిని తగ్గించుకోవడం జీవితంలో సౌలభ్యమే తప్ప దూరం పెంచేవి ఏమీ కావు. అలాంటి దూరం అనేది బంధంలో ఉన్న వారిని దగ్గరే చేస్తుంది తప్ప నష్టం ఏమీ చేయదనేది నిపుణుల మాట!
కూసింత స్పేస్ ఉంటే తప్పు లేదు కానీ ఎక్కువ ఉంటే మస్క్ గాళ్ళు ఎంటర్ అవుతారు
16 out of 17 comments removed, wow
Space unte kondal madhav laantollu dooripotaru
అంటే విశాలమైన ఇళ్లు ఉండాలి అన్నమాట. Already 12.5% CG టాక్స్. అంత pedda ఇళ్లు అంటే కష్టమే.