విడాకులే లేని దేశాలు.. స్వేచ్ఛ ఎక్కడ?

ఇక వాటికన్ సిటీలో కాథలిక్ మతపరమైన చట్టం ప్రకారం చెల్లుబాటైన, సంపూర్ణమైన వివాహ బంధం విడదీయరానిదిగా పరిగణిస్తారు.

ఒక వివాహం విఫలమైతే ఏం చేయాలి? భార్యాభర్తలు కలిసి జీవించలేని పరిస్థితి వస్తే జీవితాంతం ఒకరినొకరు భరిస్తూ బతకాల్సిందేనా? ఆ బంధం నుంచి బయటపడే హక్కు మహిళకు లేదా? అసలు ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడమే ఒకప్పుడు భారతదేశంలో సంప్రదాయాలకు విరుద్ధమైన వ్యవహారంగా భావించేవారు. కానీ నాగరిక సమాజం ముందుకు సాగాలంటే ఇలాంటి ప్రశ్నలు తప్పనిసరి!

స్వతంత్ర భారతదేశంలో జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం హిందూ వివాహ చట్టం తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు సంప్రదాయవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. హిందూ కోడ్ బిల్లులో విడాకులు, ఏకపత్నీత్వం, మహిళలకు ఆస్తి హక్కులు వంటి అంశాలు ఉండటమే వారి ఆగ్రహానికి కారణం.

అసలు భార్యాభర్తలు విడిపోవడానికి చట్టం ఏమిటి? పెళ్లి అనేది పవిత్రమైన బంధం కదా! ఒకసారి తాళి కడితే జీవితాంతం ఆ భర్తతోనే ఉండాలి కదా! మధ్యలో విడాకులు అనే కొత్త పద్ధతులు ఏమిటి? అంటూ వ్యతిరేకించారు.

వారి దృష్టిలో వివాహం అంటే మహిళకు జీవితకాల బంధనం. మగాడు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా పెద్దగా అభ్యంతరం ఉండేది కాదు. భార్యతో పడకపోతే మరో పెళ్లి చేసుకోవడం, మొదటి భార్యను పుట్టింట్లో వదిలేయడం, ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు భార్యలతో కాపురం చేయడం.. ఇవన్నీ సమాజం సహజంగా అంగీకరించిన వ్యవహారాలే! మగాడి కోరికలు, నిర్ణయాలు, సౌకర్యాలే ముఖ్యం. మహిళ మాత్రం భర్త ఎలా ఉన్నా భరించాల్సిందే!

ఇలాంటి పరిస్థితుల్లో విడాకుల హక్కు గురించి మాట్లాడటం కూడా ఒక విప్లవాత్మక ఆలోచనే. హిందూ కోడ్ బిల్లును సంప్రదాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. చివరకు ఆ బిల్లును విడగొట్టి వేర్వేరు చట్టాలుగా తీసుకురావాల్సి వచ్చింది.

1955లో హిందూ వివాహ చట్టం అమల్లోకి వచ్చింది. వివాహానికి సంబంధించిన నిబంధనలతో పాటు న్యాయపరమైన విడాకులకు మార్గం ఏర్పడింది. బహుభార్యాత్వానికి అడ్డుకట్ట పడింది. భార్యాభర్తల మధ్య వివాహ బంధం కొనసాగించలేని పరిస్థితులు ఏర్పడితే చట్టబద్ధంగా విడిపోయే అవకాశం కలిగింది.

అయితే చట్టం వచ్చినంత మాత్రాన సమాజం ఒక్కరోజులో మారిపోలేదు. దశాబ్దాల పాటు పాత ఆలోచనలే కొనసాగాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎన్నో అవమానాలు, అన్యాయాలు భరిస్తూ జీవితాలను వెళ్లదీశారు.

భర్త వదిలేసినా, మరో పెళ్లి చేసుకున్నా, కుటుంబాన్ని పట్టించుకోకపోయినా మహిళ మాత్రం ఆ వివాహ బంధం నుంచి బయటపడలేని పరిస్థితులు ఉండేవి. చట్టం ఇచ్చిన హక్కును ఉపయోగించుకోవడానికి కూడా సామాజిక, ఆర్థిక స్వేచ్ఛ అవసరం. ఆ స్వేచ్ఛ మహిళలకు అందడానికి మరికొన్ని దశాబ్దాలు పట్టింది.

ఒకవేళ అప్పట్లో నెహ్రూ ప్రభుత్వం, అంబేడ్కర్ వంటి సంస్కరణవాదులు సంప్రదాయవాదుల ఒత్తిడికి తలొగ్గి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? మహిళలకు విడాకుల హక్కు కల్పించే చట్టం ఇప్పటికీ చర్చకు కూడా వచ్చేదా? ఈరోజు సనాతన సంప్రదాయాల పేరుతో వెనక్కి లాగే ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితుల్లో అలాంటి సంస్కరణలు తీసుకురావడానికి ఎవరైనా ధైర్యం చేసేవారా? చరిత్రలో కొన్ని సంస్కరణలు ఎంతటి ప్రతిఘటన మధ్య వచ్చాయో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇంతకీ ప్రపంచం మొత్తం ఇలాంటి ఆలోచనల నుంచి బయటపడిందా అంటే అదీ లేదు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో సాధారణ పౌరులకు విడాకుల చట్టబద్ధమైన అవకాశం లేదు. ఫిలిప్పీన్స్ ఇందుకు ఒక ఉదాహరణ. అక్కడ ముస్లింలకు ప్రత్యేక వ్యక్తిగత చట్టం కింద విడాకుల అవకాశం ఉన్నప్పటికీ, ముస్లిమేతరులైన మెజారిటీ ప్రజలకు సాధారణ విడాకుల చట్టం లేదు.

వివాహం చట్టబద్ధంగా ముగియాలంటే రద్దు ప్రక్రియ, వివాహం మొదటి నుంచే చెల్లనిదిగా ప్రకటించే ప్రక్రియ వంటి పరిమిత మార్గాలపై ఆధారపడాల్సి వస్తుంది. చట్టబద్ధమైన విడాకులు లేకపోవడం వల్ల ఎన్నో జంటలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

ఇక వాటికన్ సిటీలో కాథలిక్ మతపరమైన చట్టం ప్రకారం చెల్లుబాటైన, సంపూర్ణమైన వివాహ బంధం విడదీయరానిదిగా పరిగణిస్తారు. వివాహం మొదటి నుంచే చెల్లనిదని నిరూపిస్తేనే చర్చికి సంబంధించిన రద్దు ప్రక్రియకు అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు విడిగా జీవించవచ్చుగానీ, ఆ మతపరమైన వివాహ బంధం ముగిసినట్టుగా పరిగణించరు.

అసలు ఇక్కడ ఆలోచించాల్సింది ఒక్కటే. వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం. ఇద్దరికీ ఇష్టమున్నంతకాలం కలిసి జీవించవచ్చు. ఆ బంధంలో ప్రేమ, గౌరవం, పరస్పర అవగాహన ఉంటే జీవితాంతం కలిసి ఉండటంలో తప్పేముంది? కానీ అవే లేకుండా పోయినప్పుడు, హింస, అవమానాలు, వేధింపులు ఎదురైనప్పుడు కూడా విడిపోవడానికి అవకాశం లేకపోతే అది వివాహ వ్యవస్థ గొప్పతనమా? లేక ఒక వ్యక్తి స్వేచ్ఛను మరొకరి చేతుల్లో బంధించడమా?

విడాకులు పెరగడం సమాజం పతనమవుతోందనడానికి నిదర్శనం కాదు. వివాహ బంధంలో ఇద్దరికీ సమాన హక్కులు ఉన్నాయని, ఎవరికీ మరొకరిపై జీవితకాల అధికారం లేదని గుర్తించడం నాగరికతలో భాగం. విడాకులు తీసుకోకుండా కలిసి జీవించడం గొప్ప విషయం కావచ్చు. కానీ విడిపోవాలనుకున్న వ్యక్తిని బలవంతంగా అదే బంధంలో ఉంచడం మాత్రం గొప్పతనం కాదు.

11 Replies to “విడాకులే లేని దేశాలు.. స్వేచ్ఛ ఎక్కడ?”

  1. వివాహ బంధంలో శారీరక లేదా మానసిక హింస ప్రవేశించిన సందర్భంలో ఖచ్చితంగా విడాకులు తీసుకునే హక్కు ఉండాలి, స్రీలకైనా, పురుషులకైనా. కానీ కేవలం ఇగోలు, అపోహలు వంటి సర్దుకుపోగలిగిన సమస్యలకు కూడా విడాకులే పరిష్కారం అనే పరిస్థితి వస్తే మాత్రం వివాహ వ్యవస్థ కుప్పకూలుతుంది. పాశ్చాత్య దేశాలలో జరుగుతున్నది అదే! ఆ జాడ్యం మనం కూడా అంది పుచ్చుకుంటున్నాము.

  2. ఒరే, ఇక్కడ చదివేవాళ్ళకు హిస్టరీ తెలియదని నోటికి వచ్చినట్లు రాయకురా సన్నాసి.

    హిందూ కోడ్ బిల్లు ను వ్యతిరేకించలేదు. ఒక్క హిందు కోడ్ మాత్రమే దేనికి, ఇస్లాం క్రైస్తవులకు వేరే చట్టాలు దేనికి, అందరికీ కలిపి ఒకే సివిల్ కోడ్ తెమ్మని మాత్రమే డిమాండ్ చేసారు. అలా చేసినవారిలో సర్ధార్ పటేల్ కూడా ఉన్నారు.

    కానీ సెక్యులరిజమ్ పేరుతో ఇతరమతాలను నెత్తిన పెట్టుకునే నెహ్రూ, పటేల్ పోయిన తర్వాత మాత్రమే కేవలం ఒక్క హిందువులకు మాత్రమే అమలయ్యే హిందూ కోడ్ బిల్లు తీసుకు వచ్చాడు. ముస్లింలకు కిరస్థానీలకు అనుకూలంగా బ్రిటీష్ వారు చేసిన ప్రత్యేక చట్టాలు ను అలాగే కొనసాగించాడు.

    ముస్లింలలో తండ్రి చచ్చిపోతే లీగల్ గార్డియన్ తల్లికాబోదు. ట్రిపిల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చెయ్యవచ్చు. నాలుగుపెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఇవన్నీ ముస్లింలకు బ్రిటీష్ వారు కల్పించిన ప్రత్యేక చట్టాలు

    ఏమి జన్మలురా . అన్నీ అబద్దాలు చెప్పటానికి ఏ పద్దతిలో పుట్టారురా

  3. నోటికి వచ్చింది వాగావు కదరా

    మరి

    ముస్లింలలో ముమ్మారు తలాక్ చెప్పి పెళ్లాలను వదిలించుకోవటమూ, ఒక పెళ్ళాము ఉండగా మరో ముగ్గురిని తెచ్చి నెత్తి మీద పెట్టటమూ, తండ్రి చచ్చిపోతే, తల్లి లీగల్ గార్డియన్ కాకుండా పోవటం గురించి కూడా చెప్పు దమ్ముంటే. రాస్తానికి చెయ్యి పడిపోయిందా ?

  4. ఒక అభిప్రాయం ప్రకారం భారత సమాజం లో అవినీతి, బంధుప్రీతి కి వివాహ వ్యవస్థ, కుల వ్యవస్ధ కారణాలు. ఇక్కడనుంచే మిగిలియన అవలక్షణాలు విచ్చుకుంటాయి. 

    పైన కష్టాలు అన్ని ఆడాళ్ళవే అన్నట్టు రాసావు, మగాడికి మాట్లాడే దిక్కు కూడా లేకుండా చేస్తే పారిపోక ఇంకేమి చేస్తాడు? లింగ వివక్ష లేదంటూనే అందరూ కలిసి ఓట్ల కోసం మగ మనషిని 1950 నుంచే తొక్కెయ్యటం మొదలెట్టే, ఇప్పుడు చూస్తుంది కందిపప్పు బద్దంత – ఇప్పటి కుర్రాళ్లు పెళ్లి లేదు బల్లి లేదు అవతల్కి దే0గ0d అంటున్నారు.

    చాలా మంది నన్ను తిట్టచ్చు కానీ నాకైతే ఇదే సరైన దారి అనిపిస్తుంది.   

  5. ఒక అభిప్రాయం ప్రకారం భారత సమాజం లో అవినీతి, బంధుప్రీతి కి వివాహ వ్యవస్థ, కుల వ్యవస్ధ కారణాలు. ఇక్కడనుంచే మిగిలియన అవలక్షణాలు విచ్చుకుంటాయి. 

  6. people forget one thing. Congress do acts on divorce & monogamy but in recent times supreme Court given verdicts on extra marital affairs but our our sanatani party not pass ordinance on this this is major highlight….🤣🤣🤣

Comments are closed.