లైఫ్ టైం అచివ్ మెంట్ అవార్డు గెలుచుకున్న వంశీ రెడ్డి

తెలంగాణ లోని ఉమ్మడి వరంగల్ జిల్లా ముగ్దంపురం లో జన్మించిన వంశీరెడ్డి కంచర కుంట్ల ఆజిల్లా నీటి వాడకమో, గాలి వాటమో కాని చిన్నప్పటి నుండే తెగువ, సాహసాన్ని అలవరించుకుని, విద్యాభ్యాసం పూర్తి కాగానే,…

తెలంగాణ లోని ఉమ్మడి వరంగల్ జిల్లా ముగ్దంపురం లో జన్మించిన వంశీరెడ్డి కంచర కుంట్ల ఆజిల్లా నీటి వాడకమో, గాలి వాటమో కాని చిన్నప్పటి నుండే తెగువ, సాహసాన్ని అలవరించుకుని, విద్యాభ్యాసం పూర్తి కాగానే, అమెరికాకి వెళ్ళి మైక్రో సాఫ్ట్ వంటి పెద్ద కంపెనిలో పని చేస్తూ, పెద్ద జీతాలు తీసుకున్న, సమాజంలో తనదైన ముద్ర వుండాలని, తను ఒక ఉద్యోగి గా మిగల కుండ, ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక వ్యాసార వేత్తగా ఎదగాలని మైక్రోసాఫ్ట్ ను వదలాలనే ఒక సాహసొపేతమైన  నిర్ణయం తీసుకుని, తన మిత్రులతో కలిసి Quadrant Technologies, అనే కంపినిని Redmond నగరంలో ప్రారంభించారు.

తన పుట్టిన గడ్డకి ఏదైన చేయాలని నిత్యం తహతహ లాడే వంశిరెడ్డి అవకాశం దొరకగానే హైదరాబాద్ వరంగల్ ల లో సైతం  జాబ్ మేళా లు నిర్వహించి యువతకు ఉద్యోగ అవకాశాలు  కల్పించడమే కాకుండా, అనేక మంది విద్యార్థులకు, నిరుద్యోగులకు శిక్షణ కల్సిస్తూ ఒక దారి చూపిస్తున్న నిత్య కృషి వలుడు. కష్టం లో ఉన్న ప్రతి ఒక్కరికీ సహాయం చేయడం జీవితంలో ఒక భాగంగా అలవర్చుకున్న ఆయన చేసే గుప్త దనాలకు అంతులేదు…హన్మకొండ వికలాంగుల ఆశ్రమానికి ఇటీవలే అక్ష్యరాల లక్ష్య రూపాయలు అందించి తన దాతృత్వన్ని చాటుకున్నారు..మహబూబ్ నగర్లో విధి వంచనకు గురై విద్యుద్ఘాతం తో రెండు చేతులు రెండు కాళ్ళు పోగొట్టుకున్న చిన్నారికి తనకు జీవిత కాలం అయ్యే పూర్తి కర్చు భరిస్తామని హామీ ఇచ్చారు…వికలాంగులకు ట్రై సైకిల్ పంపిణీ, ప్రభుత్వ స్కూల్ లకు డిజిటల్ క్లాస్ రూం లు ఏర్పాటుసర్వసాధారణ విషయం…ఆయనకు…టాలెంట్ ఎక్కడున్నా ప్రోత్సహించే వంశీ రెడ్డి యువతలో అవిత్సహికులను ప్రతి సంవత్సరం 10కే రన్ లు నిర్వహించి వారి టాలెంట్ గుర్తించి ప్రోత్సహిస్తారు…

వ్యాపారంతో ఎంత ఎత్తు ఎదిగిన, తను భారత దేశాన్ని వీడిన, ఎదో సామెత చెప్పినట్లు, వంశీ రెడ్డి నుండి భారతీయాన్ని విడదీయలేదు. భారత దేశం అన్న, దానీ సంస్కృతి అన్న ఎన లేని  గౌరవాన్ని చాటే వంశీ రెడ్డి ఆ సాంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు. అమెరికాలో సైతం నిత్యం పరిడ విల్లాలని తపించి, వాషింగ్టన్ రాష్ట్రం లో washington telugu samithi ,  Washington Telangana Association, Indian Community Center లాంటి అనేక సాంస్కృతిక, ధార్మిక సంస్థలు స్థాపించి. నూతన తరానికి మన పండగలు, ఆచారాలు, మన కళలు వైశిష్టాన్ని  ప్రబోదిస్తూ, అవి అంతరించకుండ తన వంతు సహయాన్ని చేస్తున్నారు.

అమెరికాలో ఎవరికి కష్టం వచ్చిన, ఎవరికి సాయం కావాలన్న నేనున్నంటు మందుకు వచ్చే అతి కొద్ది మందిలో ప్రదముడు వంశీ రెడ్డి. వంశీరెడ్డి పని తీరు మెచ్చి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ లాంటి జాతీయ సంస్థలు అధ్యక్ష పదవినిచ్చి, వంశీరెడ్డి సేవలను అమెరికా అంతట వ్యాపింప జేశాయి.

TTA అద్యక్ష పదవిలో, అమెరికా అంతట దసరా, దీపావళి, సంక్రాంతి, బతుకమ్మ, బోనాలతో పాటు కూచిపూడి, జానపదాలను ప్రోత్సహిస్తూ, పేదలకు అన్న వస్త్ర , రక్త దానాలను చేస్తూ .. తనతో పాటు అనేక మందిని ప్రోత్సహిస్తూ, భారతదేశంలో   విద్య, వైద్య, ఉద్యోగ,  ఉపాధి రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు వంశీ రెడ్డి గారు.

అతని త్యాగ నిరతిని, వాలంటిర్ సర్సీసు ను మెచ్చుకుని అమెరికా అద్యక్షుడు సైతం స్వర్ణ పతకం అందజేసారు .వంశీ రెడ్డిని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన FORBES కౌన్సిల్ తన మెంబెర్ గా చేర్చుకుని మురిసి పోయింది…

ప్రజలకు సేవచేయాలని నిత్యం తహతహ లాడే వంశీ, వంశీరెడ్డి ఫౌండేషన్ స్థాపించి. తెలంగాణలోని అనేక గ్రామాల్లో తన సేవా  కార్యక్రమాలను చేస్తున్న ఈ నవ యువకుడు కుంటుంబ, వ్యాపార, సేవారంగాల్లో ఎందరికో ఆదర్శప్రాయుడు.

ఈయన సేవా నిరతిని గుర్తించిన WATS సంస్థ President's Volunteer Service Award (PVSA)…Lifetime Achievement Award ను స్వర్ణ పథకం తో సన్మానించేందుకు సిద్ధమైంది.. ఈ అవార్డు ను WATS & Consulate General of India, Seattle Prakash Gupta గారు sankranthi and Republic Day 2024 event లో అందించారు.