ఒక వర్గంలోని కొంత మంది ఉన్మాదం వచ్చిన వాళ్ళలా మానవత్వం మరిచి, వైఎస్సార్ కుక్క చావు చచ్చాడు అని అనడం మనం విన్నాము. ఆయన చనిపోయినప్పుడు తెలుగు ప్రజలంతా గుండెలవిసేలా ఏడుస్తుంటే మనకున్న అడ్డు తొలిగాడని పార్టీలు చేసుకున్నవారిని చూసాం. అస్సలు దిక్కుమాలిన చావు అంటే ఏంటి? చనిపోయే ముందు “నా” అనే వాళ్ళు లేక, ఏ దిక్కు లేని అనాధ ప్రేతంలా పడివుండి, తల కొరివి పెట్టే వారు లేక, పిండ ప్రదానం చేసేవారు లేక, కాటి కాపరికి అప్పచెప్పిన ఏ వ్యక్తి మరణాన్నైనా దిక్కులేని చావు అని, కుక్క చావు అని అంటారు.
ఈ వ్యత్యాసంలో మీకు వైఎస్సార్, ఎన్టీఆర్‌ల లో ఎవరు దిక్కులేని చావు పొందారో మీరే ఊహించుకోండి. కుక్క అనేది ఒక విశ్వాసమైన జీవి, ఆ మంచి జీవిని ఒక్క మన భారతదేశంలోనే చనిపోయాక గోడవతల పడేస్తారు. అదే కుళ్ళి, వాసనతో, మట్టిలో కలిసిపోతుంది. అందుకే అంటారు “కుక్క చచ్చింది గోడవతల పడేయ్యమని”. ఇలా వాడుకగా వచ్చిన మాటల్ని నేడు కక్ష్య సాదింపు చర్యగా వైఎస్సార్ మీద ఒక వర్గం వాడుతున్న పరిభాష. ఏడ్చి ఏడ్చి ప్రాణాలు వదిలిన ప్రజలకి చెప్పండి ఆయన కుక్కచావు చచ్చాడు అని. ఎచేయ్యయితే తెగిపదిందని మురిసిపోయ్యారో, ఆ చెయ్యే ఈరోజు ప్రతి పల్లెలో, ప్రతి బజార్లో ఉంది ఆయన కోసం విలపించే ప్రజలమధ్యన.
మరణించిన విధానాన్ని బట్టి కుక్క చావు అని అనరు. సుభాష్ చంద్రబోస్ విమానమెక్కి గాలిలో కలిసి పోయారు, ఆయన శరీరం కూడా దొరకలేదు, ఆ మహానుభావుడు ఏ చావు పొందినట్టు? ఎందరో వీర జవాన్లు దేశంకోసం తుత్తునియలు అవుతారు. వారిది కుక్కచావా? నిత్యం ఎందరో ప్రమాదాల్లో చిద్రమై మరణిస్తారు, అంతమాత్రాన వాళ్ళది దిక్కులేని చావు కాదు. చావు పుట్టుకుల వ్యత్యాసం కూడా తెలియని కుహానా మేధావులకి ఈ విషయం ఎప్పుడు అర్ధం అవుతుందో?
ఎనిమిది మంది కొడుకులు, నలుగురు కూతుళ్ళు వుండి, వందల కోట్ల రూపాయల ఆస్తులు పంచి, ఆత్మగౌరవ నినాదంతో తెలుగువారిని తట్టిలేపిన ఎన్టీఆర్ “ఆత్మగౌరవం” చివరి రోజులలో ఏమైంది, ఎవరు చెప్పులు వేసారు, ఎవరు ఆయనని పదవిలోనుంచి దించారు? కడుపున పుట్టిన బిడ్డలు ఎందుకు దూరమయి ఆయనకి వ్యతిరేకంగా పనిచేసారు? ఆ మనక్షోభతో, తనవారందర్నీ అనరాని మాటలు అంటూ తనువు చాలించిన ఎన్టీఆర్ గారిదే చావు?
వైఎస్సార్ ఒక గొప్ప కుటుంబ వ్యక్తి. ఎప్పుడు తన భార్య, పిల్లలతో తీరిక సమయాన్ని గడిపిన విషయం మనందరికి తెలుసు. ఆయన పోయాక తల్లడిల్లి పూయిన భార్య విజయలక్ష్మి గారిని అందరం చూసాము, కానీ ఎన్టీఆర్ పోయాక సూట్ కేసుల్లో డబ్బులు సర్ది, తలో దిక్కుకు పారిపోయిన కుటుంబ సభ్యులను మనందరం చూసాము. వైఎస్సార్ చావులో కూడా ఆ దేవుడు మనందరికీ ఆయన పార్థివ శరీరాన్ని, ఆ చెరిగిపోయిన నవ్వుని చూపించకుండా ఆయన గుర్తొచ్చినప్పుడు ఆ నవ్వే మారాజునే మిగిల్చాడు.
ఆ మనిషి పోయేటప్పుడు కూడా త్ర్రునధాన్య శాస్త్రజ్ఞులకి ఇచ్చిన మాట ప్రకారం కోర్రన్నం తన భోజనంగా తీసికెళ్ళిన మాట తప్పని జననేత ఆయన. కాకిలా వందేళ్ళు బ్రతికేకంటే వైఎస్సార్‌లా అరవయ్యేళ్ళు బ్రతికితే చాలదా?
వైఎస్సార్ ధన్యజీవి. ప్రజలకోసం పుట్టి ప్రజల మధ్య జీవించి ప్రజల కోసం రచ్చబండకి వెళ్తూ ప్రమాదంలో చనిపోయిన వైఎస్సార్ జన్మ సార్ధకం. ఆయనని అమితంగా ప్రేమించే కోట్లాది మందికి, జీవితంలో ఒకసారి ఆయన్ని కలవడమే వరంలా భావించేవాల్లకి ఆయన ఒక కర్మయోగి, ఒక కారణజన్ముడు, ఒక స్థితప్రజ్ఞుడు.
-గురవా రెడ్డి, అట్లాంటా (కన్వీనర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అమెరికా)