ఒకటి రెండు ఫ్లాపులు వచ్చినా, ఎన్టీఆర్ కు ఇంతో అంతో మాస్ చరిష్మా వుంది. మరి అలాంపుడు ప్రాజెక్టులు క్యూ లో ఎందుకు లేవు? ఒక్క సుకుమార్ ప్రాజెక్టు మినహా మరేదీ ఎందుకు ఓకె చేయలేదు? నిర్మాతలు రాకనా? దర్శకులు లేకనా? ఇలాంటి ప్రశ్నలకు టాలీవుడ్లో ఓ సమాధానం చక్కర్లు కొడుతోంది.
తనకు ఇష్టమైన ఇద్దరు ముగ్గురు దర్శకులను దృష్టి లో వుంచుకుని ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్టు లకు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఎన్టీఆర్ దృష్టిలో రాజమౌళి, వివి వినాయక్ లు కీలకంగా వున్నారని వినికిడి. వీరిద్దరు ఇప్పుడు రెండుప్రాజెక్టు్ల్లో నిమగ్నమై వున్నారు. వినాయక్ ఈ ఏడాది చివరకు ఖాళీ అవుతారు. అలాగే రాజమౌళి కూడా అప్పటికి దాదాపుగా ఫ్రీ అవుతారు.
అందువల్ల వారు సై అనడం చూసి, కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నది ఎన్టీఆర్ ఆలోచన అని తెలుస్తోంది. కొరటాల శివ పై కూడా ఆయన ఆలోచన వుంది. అందువల్ల ఎన్టీఆర్ తరువాతి సినిమా వివి వినాయక్ లేదా కొరటాల శివ ఈ ఇద్దరిలో ఒకరిది అవుతుందని టాక్. రాజమౌళి మాత్రం అనుమానమే.
ఎందుకంటే రాజమౌళి గడచిన రెండు మూడేళ్లుగా ఊపిరి సలపకుండా పనిచేస్తున్నారు. ఈ పరిస్థితి ఇంకా మరో ఏడాది వుండే అవకాశం వుంది. అలాగే తనకు మిర్చి లాంటి సినిమా ఇచ్చిన కొరటాల శివతో మరో సినిమా చేస్తే ఎలా వుంటుదని ప్రభాస్ కూడా అనుకుంటున్నారట. అందువల్ల వినాయక్ కు ఎక్కువ చాన్స్ వుండొచ్చు.