దేవర సినిమా అడియో ఫంక్షన్ కు అటు రాజమౌళి, ఇటు ప్రశాంత్ నీల్.. మధ్యలో త్రివిక్రమ్ అన్నట్లు ప్లాన్ చేసారు. రాజమౌళి వస్తారు సందేహం లేదు. ప్రశాంత్ నీల్ రెడీ, త్రివిక్రమ్ కూడా రావాల్సిందే. ఫంక్షన్ అలాంటిది. హీరో ఎన్టీఆర్ పిలిచాక రాకుండా ఎలా వుండాలి? కానీ ఒకటే సమస్య. ఈ మధ్యనే పూనమ్ కౌర్ వివాదం మీడియాకు ఎక్కింది.
దర్శకుడు త్రివిక్రమ్ తనకు అన్యాయం చేసారంటూ అలనాటి హీరోయిన్ పూనమ్ కౌర్ సినిమా పెద్దలకు ఫిర్యాదు చేసింది. అదేం అన్యాయమో, ఎలాంటి అన్యాయమో ఎవరికీ తెలియదు. అది వేరే సంగతి. ప్రస్తుతం సినిమా పెద్దల కోర్టులో వుందీ విషయం.
ఇలాంటి నేపథ్యంలో త్రివిక్రమ్ పబ్లిక్ ఫంక్షన్ కు రావాలి. కానీ వచ్చినా సమస్య ఏమీ లేదు. ఇదే రాజకీయ నాయకులు అయితే మన చానెళ్ల యాంకర్లు వాళ్ల కార్లలోకి దూరిపోయి మరీ మైకులు పెట్టి, చెప్పండి.. చెప్పండి అంటూ నానా యాగీ చేస్తారు. కానీ సినిమా జనాలు కదా ఎవరూ అడగరు. అడిగే అవకాశం ఇవ్వరు. బౌన్సర్ల మధ్య వచ్చి, వెళ్తారు. మీడియా జనాలు దగ్గరకు వెళ్లే చాన్స్ వుండదు. ఎలాగూ క్యూ అండ్ ఎ అనే కార్యక్రమం కూడా వుండదు. అందువల్ల త్రివిక్రమ్ కు ఏ ఎంబ్రాసింగ్ సిట్యువేషన్ వుండదు.
అందువల్ల త్రివిక్రమ్ హ్యాపీ గా వచ్చి తన స్టయిల్ సందేశాత్మక ప్రసంగం ఇచ్చి వెళ్లొచ్చు. ఇదిలావుంటే పూనమ్ కౌర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఝాన్సీ, తమ్మారెడ్డి భరద్వాజ కమిటీ అమెను తన దగ్గర వున్న సాక్ష్యలతో వచ్చి వెళ్లమని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ టైమ్ ఫిక్స్ చేసారు. కానీ మరి ఇటు వైపు నుంచో, అటు వైపు నుంచో మూడు రోజులు టైమ్ కావాలని పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది.
రాజమౌళి , త్రివిక్రమ్ , ప్రశాంత్ నిల్ ముగ్గురు రావట్లేదు , బినామీ ప్రొడ్యూసర్ అయినా బూ!తు కొడాలి, బూ!తు వంశి , బూ!తు పేర్ని వస్తున్నారు
వచ్చినా, రాకున్నా మేం థియేటర్లో చూడం