అసలు వారి విడాకులు ఇంకా ఖరారు అయినట్టుగా కూడా వార్తలు రావడం లేదు. జస్ట్ ఆమె తన పేరు పక్కన భర్త పేరును తీసేసి, తండ్రి నుంచి సంక్రమించిన ఇంటి పేరును జోడించుకోవడంతోటే.. అతడి సినిమాలు ఊసులో లేకుండా పోతున్నాయంటే.. హీరోకి అల్లుడు అనే హోదాకు ఉన్న పవరెంతో అర్థం చేసుకోవచ్చు!
కల్యాణ్ దేవ్ కు సంబంధించి ఇటీవల విడుదలైన సినిమా గురించి మాట్లాడే వారు కనిపించడం లేదు. ఇతడి తదుపరి సినిమా కు సంబంధించిన వ్యాపారం కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందనే మాటా వినిపిస్తూ ఉంది. చిరంజీవికి అల్లుడు అయ్యాకా హీరోగా తెరకు పరిచయం అయిన కల్యాణ్ దేవ్, ఇప్పుడు విడాకుల రూమర్ల నేపథ్యంలో అతడి సినిమాల మార్కెట్ దెబ్బతింటూ ఉందనే విశ్లేషణ వినిపిస్తోందిప్పుడు!
కల్యాణ్ దేవ్ తొలి సినిమాను కూడా కామన్ ఆడియన్స్ పెద్దగా పట్టించుకున్నది లేదు. వాళ్లకు చిరంజీవి అల్లుడు నటించిన, మరొకరి కొడుకు నటించినా.. మంచి సినిమా అయితే చూస్తారు. లేదంటే లేదు. అయితే చిరంజీవి చిన్నల్లుడు అంటూ కల్యాణ్ దేవ్ గురించి హడావుడి చేసింది మెగా ఫ్యాన్స్. సోషల్ మీడియాలో, థియేటర్ల వద్ద వీరు తమ అభిమాన హీరో అల్లుడి సినిమా గురించి హడావుడి చేసి పెట్టారు. ఇప్పుడు రూమర్ల నేపథ్యంలో వారు లైట్ తీసుకుంటున్నారని స్పష్టం అవుతోంది. దీంతో కల్యాణ్ దేవ్ సినిమాలకు మినిమం రెస్పాన్స్ కూడా లేకుండా పోతున్నట్టుగా ఉంది!
ఐశ్వర్యతో విడాకుల నేఫథ్యంలో ధనుష్ ను రజనీకాంత్ ఫ్యాన్స్ ఇక లైట్ తీసుకుంటారా అనే చర్చ ఒకవైపు ఉంది. అయితే ధనుష్ కూ కల్యాణ్ దేవ్ కూ.. ఉన్న తేడా ఏమిటో కూడా విశదీకరించనక్కర్లేదు. రజనీకి అల్లుడు కాకముందే ధనుష్ నటుడు. కానీ కల్యాణ్ దేవ్ చిరంజీవికి అల్లుడయ్యాకా హీరో అయ్యాడు. అలా హీరో అయ్యాకా కూడా బీభత్సమైన ప్రదర్శనలుఏమీ లేవు. కాబట్టి వీరికి పోలికే లేదు.
చిత్రపరిశ్రమ నిర్మాతలు మాత్రం ఈ వ్యవహారాలతో ఒక సందేశాన్ని గ్రహించాలి. స్టార్ల అల్లుళ్లపై భారీ పెట్టుబడులు పెట్టేటప్పుడు, సదరు అల్లుళ్ల వివాహబంధాల్లో పటిష్టత ఎంతో కూడా తెలుసుకోవాలేమో!
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు