Advertisement

Advertisement


Home > Politics - Andhra

నా పైన కేసు పెట్టుకోండి అంటున్న జేడీ!

నా పైన కేసు పెట్టుకోండి అంటున్న జేడీ!

ఆయనే ఒక సీబీఐ మాజీ అధికారి. చట్టం గురించి ఆయనకు తెలిసినన్ని ఎవరికి తెలుస్తాయి. సీబీఐ అధికారిగా ఒక వెలుగు వెలిగి జేడీనే ఇంటి పేరుగా మార్చుకున్న వీవీ లక్ష్మీనారాయణ విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ.

ఆయన తనను ఎమ్మెల్యేగా గెలిపించండి అని జనాలకు కోరుతూనే వెంట బాండ్ పేపర్ ఒకటి తెస్తున్నారు. దాని మీద ఆయన సంతకం పెడుతూ నేను చెప్పిన హామీలు ఏవైనా నెరవేర్చకపోతే ఈ బాండ్ పేపర్ ఆధారంగా కేసులు వేసి మరీ నా మీద చర్యలు తీసుకోవచ్చు అని ఓటర్లకు భారీ ఆఫర్ ఇస్తున్నారు.

నేను చెప్పిన మాట తప్పను, గ్యారంటీ ఏమిటీ అంటే ఇదే బాండ్ పేపర్ అని వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఇది ఆయనకు విశాఖకూ కొత్త కాదు. విశాఖ ఎంపీగా జనసేన నుంచి పోటీ చేస్తున్నపుడు కూడా బాండ్ పేపర్ మీద రాసి జనాల ముందు పెట్టి ప్రచారం చేశారు.

ఓట్లు బాగానే వచ్చినా సీటు కొట్టలేకపోయారు. అయినా జనాలకు ప్రజా ప్రతినిధుల గురించి బాగా తెలుసు. గెలవనంతవరకూ ఎన్ని అయినా చెబుతారు. తీరా గెలిచాక వారిని పట్టుకోవడం బహు కష్టం. అప్పుడు ఈ కాగితాలు పత్రాలు ఏ కోర్టులో ఎవరు పెడతారు. ఎవరు శిక్షలు వేస్తారు.

జేడీ వరకూ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి నేను దేనికైనా రెడీ అని అంటున్నా ఎమ్మెల్యేలు నిజంగా చేసే పనులు ఏమిటి వారికి ఉన్న అధికారాలు ఏమిటి ఒక పని చేయాలంటే అందులో వారి పాత్ర ఎంత ఇవన్నీ కూడా జనాలకూ తెలుసు.

అందుకే దీనిని ఎంతవరకూ సీరియస్ గా తీసుకుంటారు అన్నది డౌటే అంటున్నారు. . రాజకీయాలు అంటే వాటిని అలాగే చూడమని పెద్దలు ఎపుడో సెలవిచ్చేశారు. జనాలు కూడా డబ్బు తక్కువ అయితే ఓటేయమని బహిష్కరించే రోజులు ఇవి. హామీలు తీరుస్తాను నన్ను నమ్మండి అని ఎవరు అన్నా జనాలు మాకేంటి అని వెంటనే అనేసే రోజులు ఇవి. జేడీ బ్రాండ్ బాండ్ పేపర్లకు విశాఖ ఉత్తరం చెప్పే ప్రత్యుత్తం ఏమిటి అన్నది ఈ నెల 13న తేలనుంది అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?