Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఎర్ర బస్సెక్కిన అయ్యన్న!

ఎర్ర బస్సెక్కిన అయ్యన్న!

ఎన్నికలు అంటేనే ఎన్నో చేయాలి. ఎన్నో చూడాలి. అందలం కోసం ఎంత కిందకు అయిన రావాలి. ఎంతమందితో అయినా బాతాఖానీ చేయాలి. పదవ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ టీడీపీ లీడర్ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకు గత ఎన్నికల సంగతి ఏమో కానీ ఈసారి ఎన్నికలు ఎన్నో రకాలైన అనుభవాలను అందిస్తున్నాయి అని అంటున్నారు.

నర్శీపట్నంలో టీడీపీ గెలుపు అంత ఈజీ కాదు అని సర్వే అంచనాలు చెబుతున్నాయి. పోటా పోటీగా భీకర పోరు సాగనుంది అని నివేదికలు అంటున్నాయి. దాంతో ఎన్నికల ప్రకటన రావడం ఏంటి గెలుపు లాంచనమే అని భావించిన అయ్యన్న అండ్ కో ఇప్పుడు గెలుపు కోసం జనాల వద్దకు వస్తున్నారు అని అంటున్నారు.

అయ్యన్న అయితే తన జీవితంలో చేయని రాజకీయ ప్రయోగాలు చేస్తున్నారు. ఆయన ఉన్నట్టుండి ఎర్ర బస్సు ఆపేసి అందులో ఎక్కేశారు. అతి సామాన్యుడిగా మారి టికెట్ తీసుకున్నారు. బస్సులోని ప్రయాణీకులతో ముచ్చటిస్తూ ఓట్లు టీడీపీకి వేయమని అభ్యర్ధించారు. అంతే కాదు ఒక చిన్న టిఫిన్ సెంటర్ లో దూరి అక్కడ టిఫిన్ చేయడమే కాదు చుట్టుపక్కల వారిని కలసి టీడీపీని గెలిపించాలని కోరుతున్నారు.

ఇలా చేపల మార్కెట్ అని కాదు ఆ వీధీ ఈ వీధి అని కాదు ఎక్కడ నలుగురు పోగు అయితే అక్కడికి వెళ్ళి ఓటు వేయండని కోరుతున్నారు. మొదట్లో టీడీపీకి కాస్తా మొగ్గు ఉంది అనిపించిన నర్శీపట్నం ఇపుడు టఫ్ గా మారిపోయింది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ ప్రచారంలో దూసుకునిపోతున్నారు. యువకుడు కావడంతో పాటు ఆయన రాజకీయ వ్యూహాలు కూడా కొత్త తరానికి కావడంతో ఆయన ప్రచారం హోరెత్తుతోంది.

టీడీపీ బలాన్ని ఒక వైపు తగ్గిస్తూ మరో వైపు తన గ్రాఫ్ పెంచుకుంటూ ముందుకు పోతున్న వైసీపీ అభ్యర్ధిని ఢీ కొట్టేందుకు దాదాపు ఏడు పదుల వయసులో అయ్యన్న మండుటెండల్లో జనం దారి పడుతున్నారు. ఈ ఇద్ద్దరిలో ఎవరు విజేత అన్నది జనానికి తెలుసు. అది మే 13న ఈవీఎం మీట నొక్కి చెబుతారు. నర్శీపట్నంలో ఈసారి కూడా అనూహ్య ఫలితాలే వస్తాయని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?