రాజమౌళి-మహేష్ కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా కథపై చాలా చర్చ నడుస్తోంది. ఇదే కథ అంటూ చాలా స్టోరీలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే మరోవైపు ఈ సినిమా వాయిదా పడిందనే ఊహాగానాలు కూడా అదే స్థాయిలో వినిపిస్తున్నాయి.
అవును.. వారణాసి సినిమా చెప్పిన తేదీకి రాదంటున్నారు. రిలీజ్ వాయిదా అంటూ పుకార్లు వచ్చిన తర్వాత ఓసారి ప్రియాంక చోప్రా క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ లో పక్కా అంటూ ప్రకటించింది. అదేంటో ఆమె ప్రకటించిన తర్వాత కూడా పుకార్లు ఆగట్లేదు.
ఐమ్యాక్స్ తో పాటు ఇతర ప్రీమియం థియేట్రికల్ ఫార్మాట్ల కోసం సినిమాను సిద్ధం చేయడంలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందుల వల్ల సినిమాను కొన్ని నెలలు వాయిదా వేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 18 ఎగ్జిబిషన్ ఫార్మాట్లలో ఈ సినిమాను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే దీనికి సంబంధించిన కంటెంట్‌ను విడుదలకు 40 రోజుల ముందే అందించాల్సి ఉంది. ఈ కారణంగా సినిమా విడుదల కష్టం అంటున్నారు చాలామంది.
సినిమాలోని భారీ విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా, ఏప్రిల్ 7 రిలీజ్ డేట్ ను అందుకోవడం కష్టంగా మారిందని తెలుస్తోంది. అయితే, మేకర్స్ మాత్రం దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కేవలం స్క్రీన్ సైజులకు తగ్గట్లుగా ఎక్స్‌పోర్ట్ చేయడమే కాకుండా, ఐమ్యాక్స్ కోసం ప్రత్యేకంగా ఇమేజ్, సౌండ్ మాస్టరింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక డాల్బీ సినిమా కోసం ప్రత్యేకంగా కలర్-గ్రేడింగ్ చేయాలి. అటు స్క్రీన్-ఎక్స్ ఫార్మాట్ కోసం అదనంగా రేషియోలు పెంచాలి.
ఇక 4డీఎక్స్ ఫార్మాట్ కోసం యాక్షన్‌కు తగ్గట్లుగా సీట్ల కదలికలను ప్రోగ్రామింగ్ చేయాల్సి ఉంది. వీటికి తోడు డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్ చేస్తూ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం వివిధ ప్రొజెక్షన్ సిస్టమ్ ల వెర్షన్లను రెడీ చేయాలి. ఆ తర్వాత క్వాలిటీ చెక్ చేయాలి.
ఇలా 18 ఫార్మాట్లలో వారణాసి సినిమాను సిద్ధం చేయాల్సి ఉంది. ఈ 18 ఫార్మాట్ల పూర్తి జాబితాను ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ, పని మాత్రం పెద్దదే. అందుకే వారణాసి విడుదలపై ఇన్ని అనుమానాలు.
ప్రస్తుతం ఈ ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చే పరిస్థితిలో యూనిట్ లేదు. సినిమాను సకాలంలో సిద్ధం చేసేందుకు వీళ్లు రాత్రిపగలు పనిచేస్తున్నారు. మరోవైపు కాలభైరవ పెళ్లి పెట్టుకున్నారు.

పెద్ద పెద్ద ఆస్కార్ రేంజ్ మోవిశే 6 నెలలు లేదా వన్ ఇయర్ లో తీస్తారు.. ఈ bok gaadu ఏందో ఏళ్ల తరబడి తీస్తాడు…
మహేష్ బాబు అంటే డైరెక్టర్స్ అందరికి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటా
అంత భారీ చిత్రం…పైగా 18 ఫార్మట్స్ అంటే ఆలోచిందండి
Ee time lo babu ki emi pani?
He can work on next project but he doesn’t, one of laziest heroes of TFI. Kunti saakhulu
Inka enti, babu take more trips and rest.
290 crores for theatre rights ani rasav. Inka grandness ela expect cheyyali?