పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులతో నామినేషన్లు వేయనివ్వరా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
గతంలో వాయిదా పడిన పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఈ క్రమంలో నరసరావుపేట మున్సిపాలిటీకి నామినేషన్లు వేసేందుకు వైసీపీ సిద్ధమైంది. అభ్యర్థులతో కలిసి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్లు వేయడానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు.
అయితే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేయడంపై వైసీపీ మండిపడుతోంది. ఆయన ఇంటి చుట్టూ పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.
ఇంటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ను బయటికి రానివ్వమని పోలీసులు తేల్చి చెప్పారు. మరోవైపు వైసీపీ అభ్యర్థుల్ని నామినేషన్లు వేయకుండా అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో టీడీపీ రౌడీ మూకలు సిద్ధంగా ఉన్నట్టు ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తోంది.
పరిషత్ ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, ఆ ఎన్నికలను గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి బహిష్కరించిన సంగతి తెలిసిందే.
అలాగే పల్నాడులో మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులతో నామినేషన్లు వేయకుండా అడ్డుకుని ఏకగ్రీవం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అయినప్పటికీ పాలక పార్టీ పట్టించుకోకుండా, దౌర్జన్యాలను కొనసాగిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి పోలీసులు ఎంత మాత్రం సహకరిస్తారో చూడాలి.

కూటమి కీ లోకేష్ కీ పోయే కాలం వచ్చింది కాబట్టి ఎగిరి పడుతున్నారు