రీమేక్ చేయడం తప్పు ఏమీకాదు. కానీ అలాంటి సినిమాలు చేసే దర్శకులు తాము చేసేపని తప్పు అయినట్టుగా జనాలను కన్వీన్స్ చేయడానికి ఏవేవో థియరీలు చెబుతూ ఉంటారు. ఈ మధ్యనే 'రాక్షసుడు' సినిమాను రీమేక్ చేసిన దర్శకుడు.. రీమేక్ చేయడం సులభంకాదని, శంకర్ వంటి దర్శకుడు ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడంటూ ఏదేదో చెప్పుకొచ్చాడు. రీమేక్ చేయడం చాలాకష్టం అనేది ఆ దర్శకుడి ఫీలింగ్. అలాంటి కష్టాన్ని తను పడినట్టుగా చెప్పుకొచ్చాడు. అంటే రీమేక్ చేయడమే అంత కష్టం అయితే.. ఒరిజినల్ సినిమాను చేయడం ఎంతకష్టమో ఆయనే చెప్పాలి.
ఇక 'జిగర్తాండా'ను రీమేక్ చేసిన హరీష్ శంకర్ అయితే ఇప్పుడు మరో థియరీ చెప్పేస్తున్నారు. అదేమిటంటే.. ప్రతి సినిమా కూడా రీమేకేనట! ఒరిజినల్ అంటూ ఏదీ ఉండదట. ప్రతి ఒక్కటీ రీమేకనేట. ప్రతి సినిమానూ ఏదో ఒక కథ నుంచినో, నవల నుంచినో, సంఘటన నుంచి స్ఫూర్తిపొందో రూపొందిస్తారో కాబట్టి.. ప్రతిదీ రీమేకే అని ఈయన చెప్పుకొచ్చాడు! ఇదంతా ఎందుకు? అంటే.. ఈయన రీమేక్ చేశాడు కాబట్టి.
'ఔను రీమేక్ చేశాం..' అంటూ ఈ దర్శకుడు ఒకే మాటతో ఎందుకు ముగించలేకపోతున్నారో! తాము చేసిన పని విషయంలో అందరినీ కన్వీన్స్ చేయడానికి వీరు తాపత్రయపడుతూ.. అంతుబట్టని థియరీలు చెబుతూ ఉన్నారు. దీంతో.. వీరు రీమేక్ చేశారనే విషయం మరింత స్ట్రెస్ అవుతూ ఉంది.
ఇక ఒరిజినల్ తమిళ వెర్షన్ తో పోలిస్తే తెలుగు వెర్షన్లో భారీ మార్పులు లేవని హరీష్ శంకర్ అంటున్నాడు. తెలుగు వెర్షన్లో నితిన్, బ్రహ్మానందం, సుకుమార్ లు గెస్ట్ అప్పీరియన్స్ ఉంటుందన్నాడు.