ప్రస్తుతం ఆదర్శ దంపతులుగా కొనసాగుతున్నారు కియరా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా. వీళ్ల మధ్య ఎలాంటి పొరపొచ్చాల్లేవు. అయితే పెళ్లికి ముందే విడిపోవాలని అనుకున్నారు.
ఎవరిదారి వాళ్లు చూసుకొని, కెరీర్ లో ముందుకు సాగాలని భావించారు. ఈ విషయాన్ని స్వయంగా కియరా అద్వానీ బయటపెట్టింది.
రిలేషన్ షిప్ మొదలుపెట్టే విషయంలో చాలా క్లారిటీతో ఉంది కియరా. ప్రేమలో ఊగిసలాటలు, హాట్ అండ్ కోల్డ్ వైఖరి తనకు నచ్చవని, ఉంటే పూర్తిగా ప్రేమలో ఉండాలి లేదా అసలు వద్దని సిద్ధార్థ్‌కు తెగేసి చెప్పింది.
ఆ టైమ్ లో సిద్ధార్థ్ కూడా పూర్తిగా కెరీర్ పై దృష్టి పెట్టాడు. అలాంటి టైమ్ లో ప్రేమలు వద్దనుకున్నాడు. దీంతో రిలేషన్షిప్ ముందుకు సాగడం కష్టమని భావించి ఒక దశలో వీరిద్దరూ సైలెంట్ అయిపోయారు. కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఈ దూరం సిద్ధార్థ్ ను తీవ్రంగా కలిచివేసింది. కియారాతో బంధం తెగిపోవడంతో అతను ఎంతో వేదనకు గురయ్యాడు. విడిపోవాలనుకున్నప్పటికీ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ వీరిని ఎక్కువ కాలం దూరంగా ఉండనివ్వలేదు.
‘జగ్ జగ్ జీయో’ సినిమా షూటింగ్ లో ఉంది. ఆ టైమ్ లో నేరుగా పూలు పట్టుకొని ఆమె క్యారవాన్ లోకి వెళ్లాడు సిద్దార్థ్. అప్పటికే అతడు తీవ్రమైన జ్వరం, నీరసంతో బాధపడుతున్నాడు. కానీ కియరాను తిరిగి తనదాన్ని చేసుకోవడం అతడికి ముఖ్యం. అందుకే ఆ పని చేశాడు.
ఆరోజు క్యారవాన్ లో కలయికతో ఇద్దరి మధ్య ఉన్న అభిప్రాయభేదాలు తొలగిపోయాయి. అలా బ్రేకప్ దశను దాటుకొని వచ్చాం కాబట్టే ప్రస్తుతం తమ మధ్య బంధం దృఢంగా ఉందంటోంది కియరా.
ఇద్దరి మధ్య అంత అవగాహన ఉంది కాబట్టే, టాక్సిక్ లో తన రొమాంటిక్ సీన్స్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగినా, సిద్దార్థ్ తనను ఒక్క మాట కూడా అడగలేదంటోంది కియరా.

Seven zero nine five three zero five eight two eight
బాగా దెబ్బలు వేసుకొని విడిపోవడానికి