ధనుష్-సాయిపల్లవి కాంబినేషన్ లో వచ్చిన రౌడీ బేబీ సాంగ్ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో యూట్యూబ్ ను షేక్ చేసింది ఈ సాంగ్.
ఇప్పుడు మరోసారి అలాంటి డాన్సింగ్ స్టార్, ధనుష్ కు జోడీగా కుదిరింది. కొత్త సినిమాలో అతడి సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది. దీంతో వీళ్లిద్దరి కాంబోలో సినిమాలో రౌడీ బేబీ లాంటి డాన్స్ నంబర్ ఒకటి ఉందంటూ ప్రచారం మొదలైంది.
ఈ ప్రచారానికి మరింత ఊతం ఇస్తూ, రౌడీ బేబీ సినిమాను ఏఐ టెక్నాలజీతో మార్చి, ధనుష్-శ్రీలీల కలిసి డాన్స్ చేస్తున్న వీడియోల్ని తమిళ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.
తన సినిమాపై లేనిపోని అంచనాలు పెరుగుతున్నాయని గ్రహించిన దర్శకుడు వెంటనే అలర్ట్ అయ్యాడు. ధనుష్ తో చేస్తున్న ఓం ఛాప్టర్-2లో అలాంటి సాంగ్ ఏదీ లేదని స్పష్టం చేశాడు డైరక్టర్ రాజ్ కుమార్ పెరియసామి.
ఈ సినిమా కథ చాలా భావోద్వేగభరితంగా, సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుందని, కథకు అంతరాయం కలిగించేలా ప్రత్యేక డ్యాన్స్ నంబర్లు పెట్టే అవకాశం లేదని దర్శకుడు స్పష్టం చేశాడు.
ధనుశ్, శ్రీలీల కలిసి స్టెప్పులేస్తున్నట్లుగా కొందరు అభిమానులు ఏఐ సాయంతో తయారు చేసిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇవి చూసిన నెటిజన్లు సినిమాలో నిజంగానే ఒక అదిరిపోయే పెప్పీ సాంగ్ ఉందని నమ్మేశారు.
దీంతో ఈ పాటపై రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అందుకే దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఆ మాటకొస్తే, ధనుష్, సాయిపల్లవిపై కూడా అలాంటి పాట లేదని స్పష్టం చేశాడు.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే వారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
