విశాఖలో ప్రస్తుతం సీఐఐ సమ్మిట్ జరుగుతోంది. ఈ సమ్మిట్ వల్ల 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అలాగే రెండున్నర లక్షలకు పైగా ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకుంది కూటమి ప్రభుత్వం. దాదాపుగా 150 దాకా సంస్థలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లుగా వెల్లడించింది.
ఏపీకి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే కనుక అంతా సంతోషిస్తారు అంటున్నారు. గత ఏడాది ఇదే నవంబర్ లో ఇదే విశాఖలో పెట్టుబడుల సదస్సు జరిగిన సంగతిని గుర్తు చేస్తున్నారు.
ఆనాడు కూడా పన్నెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెప్పుకుందని అంటున్నారు. లక్షలలో ఉద్యోగాలు వస్తాయని ఆనాడూ అన్నారని చెబుతున్నారు. మరి ఎన్ని ఉద్యోగాలు ఈ ఏడాది కాలంలో వచ్చాయన్నది కూడా ప్రశ్నలుగా ముందుకు వస్తున్నాయి.
దీని మీద వైసీపీ అయితే కూటమి ప్రభుత్వాన్ని సూటిగానే ప్రశ్నిస్తోంది. ప్రతీ ఏటా సమ్మిట్ పేరుతో పబ్లిసిటీ చేసుకోవడమే తప్ప ఉద్యోగాలు ఎన్ని వచ్చాయో చెప్పగలరా అని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి పెద్దలను నిలదీశారు. ఎన్ని పరిశ్రమలు గత ఏడాది కాలంలో గ్రౌండ్ అయ్యాయో వివరించగలరా అని కూడా ఆయన ప్రశ్నించారు.
ఈ తరహా సదస్సుల వల్ల ఒరిగేది ఏమీ లేదని సాదర జనంతో పాటు యువత కూడా భావిస్తున్నారు అని గుడివాడ అన్నారు. లేకపోతే గత ఏడాది ఒప్పందాల సంగతి చెప్పగలరా అని ఆయన అంటున్నారు. లక్షల ఉద్యోగాలలో ఎన్నో ఈపాటికి రావాలి కదా అని తర్కంతో కూడిన ప్రశ్నలను సంధించారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పెట్టుబడులు ఎన్ని గడచిన రెండున్నరేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వంలో వచ్చాయి, అందులో ఎన్ని గ్రౌండ్ అయ్యాయి, ఎంత మందికి వాటి ద్వారా ఉద్యోగాలు లభించాయి అన్నది శ్వేతపత్రం రిలీజ్ చేయాలని గుడివాడ డిమాండ్ చేశారు.
ప్రభుత్వం సొమ్ముతో కూటమి పెద్దలు ప్రచారం చేసుకుంటున్నారు అని ఆయన ఫైర్ అయ్యారు. ఇది టీడీపీ పెద్దలకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటుగా కూడా గుడివాడ విమర్శించారు.
పబ్లిసిటీ కోసం ఈవెంట్ల మాదిరిగా సమ్మిట్ లను నిర్వహించడం కాదని వాటిని ఫలవంతం చేసేలా యాక్షన్ ప్లాన్ ఉండాలని గుడివాడ సూచించారు.

కోడిగుడ్డుని అడుగు.. నిజాలు చెబుతుంది.. పోరా గుడ్డుగుడి పులకేశి
మనం అయితే గుడ్డు పొదిగే దాకా ఆగాలి అంటావు… అదే ఇప్పుడు వెంటనే పిల్లలు వచ్చేయాలి అంటావు.. అసలు నువ్వు ఎన్ని కంపెనీలు తెచ్చావు.. ఎంతమంది కి ఉద్యోగాలు వచ్చాయి లెక్కలు చెప్పి.. ఇప్పుడు అడుగు..
ఇంక గ్రౌండింగ్ అండ్ క్లియరెన్స్ కంప్లీట్ అయినవి 35-40% దాకా వున్నాయి.. మనం కే
సులు వేయకపోతే ఇంకా బెటర్ గా ఉండేది
నువ్వు ఒక వేలు కూటమి వైపు చూపిస్తే.. నాలుగు వేళ్ళు నీ వైపు చూపిస్తాయి…
మనం అయితే గు.డ్డు పొదిగే దాకా ఆగాలి అంటావు… అదే ఇప్పుడు వెంటనే పిల్లలు వచ్చేయాలి అంటావు.. అసలు నువ్వు ఎన్ని కంపెనీలు తెచ్చావు.. ఎంతమంది కి ఉద్యోగాలు వచ్చాయి లెక్కలు చెప్పి.. ఇప్పుడు అడుగు..
ఇంక గ్రౌండింగ్ అండ్ క్లియరెన్స్ కంప్లీట్ అయినవి ముప్పై శాతం దాకా వున్నాయి.. మనం కే
సులు వేయకపోతే ఇంకా బెటర్ గా ఉండేది
నువ్వు ఒక వేలు కూటమి వైపు చూపిస్తే.. నాలుగు వేళ్ళు నీ వైపు చూపిస్తాయి…