ఆ హీరోయిన్ పేరు శ్రీదేవి, సీనియర్ రైటర్ పేరు కోన వెంకట్. హీరోయిన్లలో టాలెంట్ ను గుర్తించడంలో, వాళ్లకు అవకాశాలు కల్పించడంలో ఈయన ఎప్పుడూ ముందుంటారు.
ఒకప్పుడు హీరోయిన్ అంజలిని ఇలానే ఎంకరేజ్ చేశారు. అప్పట్లో అంజలి అంటే కోన వెంకటే.. కోన అంటే అంజలి. అలా ఉండేది ఇద్దరి బాండింగ్. కోన తనకు మెంటర్ అనే విషయాన్ని అంజలి ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
ఇప్పుడీ సీనియర్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్, హీరోయిన్ శ్రీదేవిపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఆమెకు అవకాశాలిచ్చిన కోన, ప్రస్తుతం ఆమె కెరీర్ ను దగ్గరుండి చూసుకుంటున్నారు.
కోన తనకు చిన్నప్పట్నుంచి తెలుసంటోంది శ్రీదేవి. అతడి వల్లనే టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటున్నానని, కోన అంకుల్ తనకు గాడ్ ఫాదర్ కంటే ఎక్కువ అని చెబుతోంది.
అటు కోన కూడా శ్రీదేవిపై తన అభిమానాన్ని బయటపెట్టిన సందర్భాలున్నాయి. శ్రీదేవి చిన్నప్పట్నుంచి తనకు తెలుసని, ఆ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని చెబుతున్నారు.
అందుకే శ్రీదేవిపై ప్రత్యేక దృష్టి పెట్టారు కోన. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా కోనకు చెబుతుంది. కోన ఓకే చెప్పిన తర్వాతే సంతకం పెడుతుంది. ఆడిషన్స్ నుంచి శ్రీదేవి కెరీర్ లో కోన ప్రమేయం ఉంటుంది.

Reddy
ankul anthe, jagan anna inthe!!!
గాడ్ ఫాధర్ ….. షుగర్ డాడీ…. ఏంటో ఇవన్నీ …