సుమోటోగా ఎస్ఈసీ ఎందుకు తీసుకోలేదు?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అరాచ‌కాల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజాన్ని ఎక్క‌డికి తీసుకెళ్లాల‌ని అనుకుంటున్నార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అరాచ‌కాల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజాన్ని ఎక్క‌డికి తీసుకెళ్లాల‌ని అనుకుంటున్నార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

పోలీసులు, రౌడీలు జ‌త‌క‌ట్టి, ప్ర‌తిప‌క్ష అభ్య‌ర్థుల నామినేష‌న్ల‌ను లాక్కుని చింపేస్తున్నారు. వాళ్ల‌పై య‌థేచ్ఛ‌గా దాడులు సాగిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో వైసీపీ అభ్య‌ర్థులంద‌రి నామినేష‌న్ల‌ను టీడీపీ కార్య‌క‌ర్త‌లు చింపేయ‌డంతో మైదుకూరు మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్టు ఎస్ఈసీ అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు.

మ‌రి మిగిలిన చోట్ల ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌నే మీడియా ప్ర‌తినిధుల ప్ర‌శ్న‌ల‌కు… ఇంకా అధికారుల నుంచి నివేదిక‌లు రాలేద‌ని పునేఠా స‌మాధానం ఇచ్చారు.

అయితే దౌర్జ‌న్యాలు, భౌతిక దాడులు, నామినేష‌న్ ప‌త్రాల చింప‌డాల‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.

నిజంగా ఎన్నిక‌ల‌ను పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించాల‌నే చిత్త‌శుద్ధి, నిబ‌ద్ధ‌త పునేఠాకు వుంటే, సుమోటోగా తీసుకోవ‌చ్చు. కానీ ఆ దిశ‌గా ఆయ‌న ఆలోచ‌న‌లు అస‌లే లేవు. అందుకే ఆయ‌న సాకులు మాత్ర‌మే చెబుతున్నార‌నే విమ‌ర్శ‌లొస్తున్నాయి.

ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు పునేఠా చెప్పారు. త‌న కార్యాల‌యంలో కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా అస‌లేం జ‌రుగుతున్న‌దో ఆయ‌న తెలుసుకోవ‌చ్చు.

ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌, ప్ర‌కాశం జిల్లాల్లో వైసీపీ అభ్య‌ర్థుల‌పై విచ్చ‌ల‌విడిగా భౌతిక‌దాడులు జ‌రిగాయి. నామినేష‌న్ల‌ను వేయ‌కుండా ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియోల్ని ఎస్ఈసీ పునేఠా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌చ్చు. సుమోటోగా తీసుకుని ఎన్నిక‌లను వాయిదా వేసి, పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు తీసుకుని వుంటే ప్ర‌శంస‌లు అందుకునే వారు. అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతోనే ఎస్ఈసీ తీవ్ర ఆరోప‌ణ‌ల‌కు గుర‌వుతోంది.

7 Replies to “సుమోటోగా ఎస్ఈసీ ఎందుకు తీసుకోలేదు?”

  1. ///ఎన్నిక‌లను వాయిదా వేసి, పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు ///

    .

    ఎన్నికలు వాయిదా వెయ్యలా? అప్పట్లొ కరొనా వచ్చి లాక్ డౌన్ లొ ఎన్నికలు వాయిదా వెస్తె నె నానా యాగి చెసారు!

    ఎకంగా EC పదవీ కాలాన్నె తగ్గించి తమిలనాడు రెటైర్డ్ జర్జ్ కనకరాజు ని వెసుకునారు! మరిచిపొతె ఎలా గురివిందా?

  2. “2020లో పుంగనూరు అంజిరెడ్డితాత నామినేషన్ వేయడానికి పోతే ఏం. చేశారు? ఈరోజు మా తాత మీసం మేలేస్తున్నాడు.. ఇదీ ప్రజాస్వామ్యం అంటే..

Comments are closed.