కర్నూలు జిల్లా ఆలూరులో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి వినోద్‌ను ఎస్ఐ మన్మథ విజయ్ బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 21వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ నాయకులు కుట్రలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు ఇప్పటికే ఎస్ఈసీకి వెళ్లాయి.
వైసీపీ ఆందోళనే నిజమైంది. ఇవాళ ఉదయాన్నే ఆలూరులో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి వినోద్‌ను బలవంతంగా తీసుకెళ్లేందుకు ఎస్ఐ వెళ్లారు. అయితే వినోద్‌ను అక్రమంగా తీసుకెళ్లడానికి కుదరదంటూ మహిళలు అడ్డు పడ్డారు.
ఈ సందర్భంగా ఎస్ఐ, పోలీసులతో వైసీపీ మహిళా కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం జరిగింది. తానే వస్తానని వైసీపీ అభ్యర్థి వేడుకుంటున్నా ఎస్ఐ వినలేదు. కానీ పోలీసులకు అప్పగించడానికి వైసీపీ మహిళా కార్యకర్తలు ససేమిరా అన్నారు. దీంతో ఆలూరులో యుద్ధ వాతావరణం తలపించింది.
ఈ మొత్తం వ్యవహారాన్ని వైసీపీ శ్రేణులు వీడియోలో రికార్డ్ చేశాయి. సోషల్ మీడియాలో సంబంధిత వీడియో వైరల్ అవుతోంది. పోలీసు యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని, భయభ్రాంతులకు గురి చేసి, వైసీపీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించకూడదనే కుట్రలకు టీడీపీ పాల్పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది సరైంది కాదంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా పోలీస్ యంత్రాంగంపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఈసీకి ఇవేవీ పట్టవా? అని వారు నిలదీస్తున్నారు. ఎన్నికల అధికారులు స్పందించి నామినేషన్లు వేయించడానికి సహకరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏపీ పోలీసింగ్..
కర్నూలు జిల్లా ఆలూరులో ఎంపీటీసీ అభ్యర్థిగా వినోద్ వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేస్తున్నాడని మహిళలు, ఊరి జనం వేడుకుంటున్నా, పోలీసు సార్ బట్టలు చించుకుంటూ మరీ ఆయనపై దాడులు
ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇలాంటి ఘటనలే..
ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు బయటకు వస్తున్నా ఏ వ్యవస్థకూ పట్టదు.. తిరిగి బాధితులపైనే కేసులు, దాడులు..
— greatandhra (@greatandhranews) October 20, 2026

జగన్ వేసిన చెడు విత్తనాలు ఇప్పుడు విష వృక్షాలు అయ్యాయి
తెలుగు దండు పాళ్యం అంతా బూడిదె
ఇలాంటి దారుణాలు ఇంతకు ముందు చాలా చూశాం అను కొని ఉంటారు GA
అరాచకం చేసి ఆడోళ్ళు ని అడ్డం పెట్టుకు0టే వదిలెయ్యాలా?