టాలీవుడ్ లో మరో సినిమా వాయిదా?

‘రణబాలి’, ‘మైసా’ చిత్రాల మధ్య ఎక్కువ గ్యాప్ ఉండట్లేదని, రష్మికతో పాటు యూనిట్ కూడా భావిస్తోందంట.

ఇప్పటికే ఆదర్శ కుటుంబం, ఫౌజీ, స్పిరిట్, విశ్వంభర లాంటి ఎన్నో పెద్ద సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో మోస్ట్ వాంటెండ్ సినిమా కూడా చేరిపోయింది.

రష్మిక నటిస్తున్న ‘మైసా’ సినిమా మరింత ఆలస్యం కావొచ్చు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను నవంబర్ 27న విడుదల చేయబోతున్నట్టు గతంలో ప్రకటించింది యూనిట్. అయితే ఇప్పుడీ సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయి.

‘రణబాలి’, ‘మైసా’ చిత్రాల మధ్య ఎక్కువ గ్యాప్ ఉండట్లేదని, రష్మికతో పాటు యూనిట్ కూడా భావిస్తోందంట. దీంతో మైసా సినిమాను వాయిదా వేసి, 2027 జనవరి చివరి వారంలో విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

రష్మిక పూర్తిస్థాయిలో నటించిన తొలి యాక్షన్ సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే ఆమె గాయపడింది. కొన్నాళ్ల పాటు ఇంటికే పరిమితమైంది.

సినిమాలో గోండు గిరిజన మహిళగా కనిపించనుంది రష్మిక. ఇప్పటివరకు ఎక్కువగా ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాలతో అలరించిన ఈ హీరోయిన్, ఇప్పుడు యాక్షన్ జానర్ లోనూ సత్తా చాటాలని చూస్తోంది. రవీంద్ర పుల్లె ఈ సినిమాకు దర్శకుడు.