అక్కడున్నది మోహన్‌లాల్ కాదంట.. డూప్ అంట!

జైలర్ 2 చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ స్క్రీన్ టైమ్ తగ్గిపోవడం, కొన్ని సీన్లు కట్ చేయడంపై అభిమానుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

జైలర్ 2 చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ స్క్రీన్ టైమ్ తగ్గిపోవడం, కొన్ని సీన్లు కట్ చేయడంపై అభిమానుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

మరీ ముఖ్యంగా క్లైమాక్స్ కార్ సీన్ లో మోహన్ లాల్ స్వయంగా నటించారా లేదా డూప్ ను వాడుకున్నారా అనే విషయంపై కామెంట్స్ పడుతున్నాయి.

ఈ కామెంట్స్‌పై జైలర్‌ 2 యాక్షన్ డైరెక్టర్ స్పందించాడు. క్లైమాక్స్‌లోని కారు సీన్‌లో డూప్ వాడలేదని, స్వయంగా మోహన్ లాల్ నటించారని క్లారిటీ ఇచ్చాడు. అయితే మోహన్ లాల్ ఇంట్రో సీన్లు ఎందుకు తొలగించారనే మరో ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.

ఈ చిత్రంలో మోహన్ లాల్ కోసం ప్రత్యేకంగా 3 డిఫరెంట్ లుక్స్ డిజైన్ చేశారు. వాటిని ఫైనల్ వెర్షన్‌ నుంచి కట్ చేశారు. దీనిపై ఇప్పటికే ఆయన అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి టైమ్‌లో క్లైమాక్స్‌లో డూప్‌ను వాడారనే కథనాలు వాళ్లను మరింత నిరాశకు గురిచేస్తున్నాయి.

ఈ మొత్తం రచ్చకు కారణం, మోహన్‌లాల్ డూప్. మోహన్‌లాల్‌కు బాడీ డబుల్‌గా నటించే జోబీ, జైలర్-2 సెట్స్ నుంచి కొన్ని ఫొటోలు పెట్టాడు. దీంతో క్లైమాక్స్ కారు సీన్‌లో డూప్ నటించారనే ప్రచారం జరిగింది.

అటు హృతిక్ రోషన్ అభిమానులు కూడా జైలర్-2పై గుర్రుగా ఉన్నారు. హృతిక్‌కు సంబంధించి దాదాపు 10 నిమిషాల నిడివి గల సన్నివేశాలు కట్ చేశారని, కేవలం 4-5 నిమిషాలు మాత్రమే ఉంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి హృతిక్ రోషన్ నటించిన సన్నివేశాలు దాదాపు 15 నిమిషాలు వచ్చాయని ప్రచారంలో భాగంగా వెల్లడించిన విషయం తెలిసిందే. కట్ చేస్తే, సినిమాలో హృతిక్ స్క్రీన్ టైమ్‌ చాలా తక్కువగా ఉంది.

6 Replies to “అక్కడున్నది మోహన్‌లాల్ కాదంట.. డూప్ అంట!”

Comments are closed.