వైసీపీకి మ‌ళ్లీ పుంగ‌నూరు టెన్ష‌న్‌

ధైర్యంగా నామినేష‌న్లు వేయాల‌ని, గెలుపు బాధ్య‌త‌ను తాను తీసుకుంటాన‌ని పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు.

వైసీపీకి మ‌ళ్లీ పుంగ‌నూరు టెన్ష‌న్ ప‌ట్టుకుంది. అక్క‌డి నుంచి వైసీపీ పెద్దాయ‌న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. అలాగే ఆయ‌న కుమారుడైన మిథున్‌రెడ్డి రాజంపేట ఎంపీగా అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌లో వైసీపీ నుంచి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో భాగంగా ఈ నెల 16న పుంగ‌నూరు మున్సిపాల్టీలో త‌మ అభ్య‌ర్థుల‌తో నామినేష‌న్లు వేయించేందుకు మిథున్‌రెడ్డి స్వ‌యంగా వారిని తీసుకెళ్లారు.

అయితే ఎన్నిక‌ల అధికారులు నామినేష‌న్ ప‌త్రాల్ని స్వీక‌రించ‌డానికి స‌సేమిరా అన్నారు. ఉన్న‌తాధికారుల ఆదేశాల‌తోనే నామినేష‌న్లు తీసుకోవ‌డం లేద‌ని ఎంపీతో ఎన్నిక‌ల అధికారులు తేల్చి చెప్పారు.

ఇదే సంద‌ర్భంలో మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై టీడీపీ రౌడీ మూక‌ల దాడి జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పుంగ‌నూరులో యుద్ధ వాతావ‌ర‌ణం త‌ల‌పించింది. చివ‌రికి నామినేష‌న్లు వేయ‌కుండానే ఎంపీ తిరిగి రావాల్సి వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో 21 నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్ల ప్ర‌క్రియ మొద‌లుకానుంది. ఈ సంద‌ర్భంగా పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌తో నామినేష‌న్లు వేయించేందుకు ఇవాళ చౌడేప‌ల్లిలో కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ స‌మావేశంలో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న త‌న‌యుడు మిథున్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. వైసీపీ నేత‌ల్లో ధైర్యాన్ని నింపి, ముందుకు వెళ్లేలా స్ఫూర్తిని ర‌గిల్చేందుకు ప్ర‌య‌త్నించారు.

ధైర్యంగా నామినేష‌న్లు వేయాల‌ని, గెలుపు బాధ్య‌త‌ను తాను తీసుకుంటాన‌ని పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు. ఒక్కో పంచాయ‌తీ నుంచి వంద మంది రావాల‌ని, పిల్ల రౌడీల‌కు భ‌య‌ప‌డొద్ద‌ని ఆయ‌న సూచించారు. ఇవాళ భ‌య‌ప‌డితే, రేపు అధికారం వ‌చ్చినా ఇదే ప‌రిస్థితి వుంటుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ఈ క‌ష్ట‌కాలంలో నిల‌బ‌డిన వాళ్ల‌నే రేపు త‌న భుజాల‌పై మోసుకుని కాపాడుకుంటానన్నారు. మీ భ‌యాన్ని పెట్టుబ‌డిగా పెట్టి, వాళ్లు రాజ‌కీయం చేయాల‌ని అనుకుంటున్నార‌ని త‌న పార్టీ నాయ‌కుల్ని ఉద్దేశించి మిథున్‌రెడ్డి అన్నారు.

భ‌య‌ప‌డితే రాజ‌కీయం చేయ‌లేమ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. నామినేష‌న్ వేసేందుకు తానే ముందు వెళ్లాన‌ని ఆయ‌న గుర్తు చేశారు. టీడీపీ వాళ్లే భ‌య‌ప‌డి అడ్ర‌స్ లేకుండా పోయార‌ని ఆయ‌న అన్నారు.

మర్డర్లు, మానభంగాలు చేయలేదని, భయప‌డొద్ద‌ని ఆయ‌న అన్నారు. త‌ప్పుడు కేసులు పెడితే, ఏమీ కాద‌న్నారు. ఎవ‌రికేం జ‌రిగినా త‌న‌దే బాధ్య‌త అని మిథున్‌రెడ్డి అన్నారు. నామినేష‌న్ వేయ‌కుండా రాజ‌కీయం చేయ‌లేమ‌ని మిథున్‌రెడ్డి అన్నారు.

తామే అన్ని విధాలా అండ‌గా వుంటామ‌ని మిథున్‌రెడ్డి చెప్పిన నేప‌థ్యంలో పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప‌రిష‌త్ ఎన్నికల్లో ఎంత వ‌ర‌కు నామినేష‌న్లు వేయ‌డానికి ముందుకొస్తారో అనే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది.

ప్ర‌స్తుతం ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో సైతం వైసీపీ అభ్య‌ర్థుల నామినేష‌న్ల‌ను అడ్డుకోవాల‌ని టీడీపీ ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే పుంగనూరు వైపు అంద‌రి దృష్టి మ‌ళ్లింది. అక్క‌డేం జ‌రుగుతుందో అనే ఉత్కంఠ నెల‌కుంది.

5 Replies to “వైసీపీకి మ‌ళ్లీ పుంగ‌నూరు టెన్ష‌న్‌”

  1. ఒకప్పుడు కుప్పం లో వోడపోడుస్తా అన్నాడు…ఇప్పుడు సొంత నియోజకవర్గం లో సొంత పార్టీ వారిని నామినేషన్ కోసం బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి 

  2. లంగాగాడి అడ్డాలో గెలుస్తాం అనే నమ్మకంలేక పోటీ చెయ్యడానికి ఎవ్వరూ ముందుకు రాక 22wards ఏకగ్రీవం అయ్యాయి.

    ఆ బావా మరదళ్ళు

    సింహం (పులివెందుల MLA) సీటు చించేశారట.. !

  3. “2020లో పుంగనూరు అంజిరెడ్డితాత నామినేషన్ వేయడానికి పోతే ఏం. చేశారు? ఈరోజు మా తాత మీసం మేలేస్తున్నాడు.. ఇదీ ప్రజాస్వామ్యం అంటే..

  4. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న కార్యకర్తలకి నాయకుడు ఫీల్డ్ లోకిదిగి తన ప్రాణం అడ్డుపెట్టి కాపాడి, వాళ్లకి అండగా నిలవాల్సింది పోయి ప్యాలెస్ లో పండి, ప్రజాస్వామ్య సుద్దులు చెప్పి తుర్రున పక్క రాష్ట్రానికి పారిపోయి దాక్కున్నాడు..లంగాగాడు ఈడు నాయకుడా? ఈడికంటే నాయకుడిగా మా గుంటూరు రా0బాబు చాలా బెటర్

  5. సింగిల్ సింహం మగదైతే..తన మాట మీద నిలబడి, మడమ తిప్పకుండా, పుంగనూరు టీడీపీకి ఏకగ్రీవం చేయించిన పెద్రెడ్డి సీటు చించెయ్యాలా.. లేదంటే ఆడు సింహం కాదు.. లంగాగాడు అంటాం..

Comments are closed.