ది ప్యారడైజ్ రివ్యూ… రేటింగ్ 1/5

ఈ రేటింగ్ మాది కాదు. మహేశ్ కొడుకు గౌతమ్ ఘట్టమనేని ఇచ్చిన రేటింగ్. అవును.. నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ సినిమాకు సింగిల్ స్టార్ ఇచ్చాడు గౌతమ్.

ఈ రేటింగ్ మాది కాదు. మహేశ్ కొడుకు గౌతమ్ ఘట్టమనేని ఇచ్చిన రేటింగ్. అవును.. నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ సినిమాకు సింగిల్ స్టార్ ఇచ్చాడు గౌతమ్.

కేవలం సింగిల్ స్టార్ ఇచ్చి ఊరుకోలేదు. సినిమాకు రివ్యూ కూడా రాశాడు. తన కామెంట్స్‌లో ఘాటు విమర్శలు చేశాడు.

తన లెటర్‌బాక్స్ ఖాతా ద్వారా సినిమాపై నిష్పక్షపాతంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఇటీవల యశ్ నటించిన టాక్సిక్ సినిమాకు కూడా రివ్యూ ఇచ్చాడు గౌతమ్. ఆ సినిమాకు అర స్టార్ (0.5 స్టార్) రేటింగ్ మాత్రమే ఇచ్చిన గౌతమ్, తాజాగా నాని సినిమాను ఒకే ఒక స్టార్‌ రేటింగ్ ఇచ్చి నెట్టింట హాట్ టాపిక్‌గా మారాడు.

ఈ సినిమా గురించి చిన్న రివ్యూ కూడా రాశాడు గౌతమ్. సినిమాటోగ్రఫీ, ఎమోషనల్ సీన్లలో నటన మినహా మరేమీ తనకు నచ్చలేదని, ఎడిటింగ్ అత్యంత చెత్తగా ఉందని తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.

తన లెటర్‌బాక్స్ ప్రొఫైల్ వైరల్ అయిన తర్వాత మొదట, ఇనస్టాగ్రామ్ బయో నుంచి లింక్ తొలగించిన గౌతమ్, ఈసారి మాత్రం ‘జాతీయ వార్తగా మారిన ఈ పేజీకి స్వాగతం, ఆ అంచనాలను అందుకోవడానికి ప్రయత్నిస్తాను’ అంటూ క్యాప్షన్ పెట్టి మరీ ఇనస్టాగ్రామ్‌ బయోలో లింక్ పోస్టు చేశాడు.

ది ప్యారడైజ్ సినిమా చూసిన రోజునే ఆపరేషన్ సఫేద్ సాగర్ సినిమా కూడా చూశాడు గౌతమ్. ప్యారడైజ్‌కు సింగిల్ స్టార్ ఇచ్చిన మహేశ్ తనయుడు, ఈ సినిమాకు మాత్రం 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు.

3 Replies to “ది ప్యారడైజ్ రివ్యూ… రేటింగ్ 1/5”

  1. మహేష్ సినిమా కి కూడా అంతే నిష్పక్షపాతంగా రేటింగ్ ఇస్తే మంచిది

  2. చదువుకోరా అని విదేశాలకి పంపితే అది మానేసి అన్నీ సినిమా రివ్యూలు రాస్తున్నాడా.

Comments are closed.