పులివెందుల మున్సిపాలిటీలో పోటీ ఇలా…!

వైఎస్సార్ క‌డ‌ప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా జ‌ర‌గ‌నున్నాయి

వైఎస్సార్ క‌డ‌ప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా జ‌ర‌గ‌నున్నాయి. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అడ్డాలో అన్నీ ఏకగ్రీవం చేసుకోవాల‌ని టీడీపీ త‌పించింది.

పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని , క‌నీసం స‌గం స్థానాల్లో నామినేష‌న్లు వేయ‌కుండా వైసీపీ అభ్య‌ర్థుల్ని పోలీసులు ఎలా అడ్డుకున్నారో అంద‌రూ చూశారు. చివ‌రికి త‌మ పంతాన్ని పోలీస్ యంత్రాంగం ద్వారా టీడీపీ స‌గం వ‌ర‌కు నెర‌వేర్చుకుంది.

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎవ‌రెవ‌రు బ‌రిలో ఉన్నారో ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు. పులివెందుల‌లో మొత్తం 40 వార్డులున్నాయి. చైర్‌ప‌ర్స‌న్ అభ్య‌ర్థి వైఎస్ ప్ర‌మీల‌మ్మ‌తో పాటు 20 వార్డుల్లో వైసీపీ అభ్య‌ర్థులు పోటీలో ఉండ‌డం విశేషం.

మ‌రో 20 వార్డుల్లో నామినేష‌న్లు ప‌డ‌కుండా, ఏక‌గ్రీవం చేసుకున్నారు. దీంతో స‌గం వార్డుల్లోనే టీడీపీ, వైసీపీ మ‌ధ్య ముఖాముఖి పోటీ జ‌ర‌గ‌నుంది.

20 వార్డులలో రెండు ఓట్లను, మరో 20 వార్డులలో ఒక ఓటు మాత్రమే వేయనున్నారు. ప్ర‌స్తుతం ఇరుపార్టీల చైర్‌ప‌ర్స‌న్ అభ్య‌ర్థుల‌తో పాటు బ‌రిలో నిలిచిన వారు విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు.

స్వేచ్చ‌గా ఎన్నిక‌లు జ‌రిగితే వైసీపీ మున్సిపాలిటీని ఈజీగా ద‌క్కించుకుంటుంది. అయితే నామినేష‌న్లు వేయ‌కుండా అడ్డుకున్నోళ్లు, ఎన్నిక‌ల రోజు ప్ర‌శాంతంగా ఓట‌ర్ల‌ను త‌మ హ‌క్కు వినియోగించుకునేలా చేస్తారా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. అందుకే పులివెందుల మున్సిప‌ల్ ఎన్నిక‌లు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.

3 Replies to “పులివెందుల మున్సిపాలిటీలో పోటీ ఇలా…!”

  1. జగన్ వెళ్లి పవన్ కా,ళ్ళు పట్టుకుంటే పులివెందుల వదిలి పెడతారు 

Comments are closed.