ఏపీలో అమ్మ‌కానికి స్థానిక సంస్థ‌ల ప‌ద‌వులు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఎంత దారుణంగా జ‌రుగుతున్నాయో దేశ‌మంతా మాట్లాడుకుంటున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఎంత దారుణంగా జ‌రుగుతున్నాయో దేశ‌మంతా మాట్లాడుకుంటున్నారు.

విప‌క్ష పార్టీల అభ్య‌ర్థులు కనీసం నామినేష‌న్లు కూడా వేయ‌లేని ద‌య‌నీయ స్థితిని యావ‌త్ దేశ‌మంతా చూసి నివ్వెర‌పోయింది.

ఔరా, ఎన్డీఏ పాల‌న‌లో ఎన్నిక‌లు ఇంత దారుణంగా దిగ‌జారిపోయాయా? అనే ప్ర‌శ్న భార‌త జాతి ప్ర‌శ్నిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల మాఫియా రాజ్య‌మేలుతోంద‌ని తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి ట్వీట్ చేశారు.

అధికారంలో ఉన్న పార్టీ త‌న‌కు అనుకూలంగా ప‌ద‌వుల్ని ద‌క్కించుకునేందుకు అధికారులు, పోలీసుల‌కు భారీ మొత్తంలో డ‌బ్బు ముట్ట చెబుతున్న‌ట్టు ఆరోప‌ణ‌లు గుప్పించారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించేందుకు పోలీసులు, ఎన్నికల అధికారులు టీడీపీ నాయకులతో కుమ్మక్కయ్యారని ఆయ‌న ఆరోపించారు.

ఈ ముఠా, పోటీ లేకుండా విజయం సాధించేందుకు ప్రతి టీడీపీ అభ్యర్థి నుంచి రూ.40 ల‌క్ష‌ల నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేస్తూ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఎన్నికల ప్రక్రియను ఒక డబ్బు సంపాదించే సాధనంగా మార్చేశార‌ని చేసిన ఆరోప‌ణ‌లు జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి.

వీరి కుతంత్రం ఆందోళన కలిగిస్తోంద‌ని ఆయ‌న వాపోయారు. అలాగే త‌మ అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేయ‌కుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారని ఎంపీ తెలిపారు. వారిని బెదిరించి, శారీరకంగా దాడి చేశారని ఆరోపించారు.

రిటర్నింగ్ ఆఫీసర్ల ఛాంబర్లలోనే నామినేషన్ పత్రాలను చించివేశారని స‌మాజం దృష్టికి ఆయ‌న తీసుకెళ్లారు. ఎన్నికల అధికారులు చిన్నపాటి సాంకేతిక కారణాలతో, ప్రతిపక్ష అభ్య‌ర్థుల నామినేషన్లను తిరస్కరిస్తుంటే పోలీసులు నిశ్శబ్ద ప్రేక్షకులుగా నిలబడ్డారని విరుచుకుప‌డ్డారు.

ఎన్నికల పోటీని తొలగించి, టీడీపీ అభ్యర్థులకు పోటీ లేని విజయాన్ని అందించడమే దీని లక్ష్యమ‌ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. ఎన్నికల్లో విజయాలను డబ్బుకు అమ్ముకుంటున్న ఒక వ్యవస్థీకృత అవినీతి దందా తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

One Reply to “ఏపీలో అమ్మ‌కానికి స్థానిక సంస్థ‌ల ప‌ద‌వులు!”

  1. మరి వీడికి ja*** గాడు చేసిన 42kcrores అవినీతి, వాడు చేసిన క్రి*మినల్ పనులు తెలియదా, తెలిసినా ఈ పొట్టి*నా*డాష్ గాడు నటిస్తున్నాడా? వీడు అంత శుద్ధ పూస ఐతే వైచీపీ లో ఎందుకున్నాడు? వాడి ఎలక్షన్స్ లో పెద్దిరెడ్డి గాడితో కలిసి రిగ్గింగ్ ఎందుకు చేసాడు?

Comments are closed.