ఆర్ఆర్ఆర్ కంటే 6 రెట్లు పెద్దది, కానీ త్వరగా పూర్తి

అదే టైమ్ లో ఆర్ఆర్ఆర్ కంటే తొందరగా షూటింగ్ పూర్తయిందని కూడా చెబుతున్నాడు

‘వారణాసి’ గురించి మరిన్ని వివరాలు వెల్లడించాడు దర్శకుడు రాజమౌళి. ఈ సినిమా స్కేల్ పరంగా తన గత చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కంటే ఏకంగా 6 రెట్లు పెద్దదిగా ఉంటుందని చెబుతున్నాడు.

అదే టైమ్ లో ఆర్ఆర్ఆర్ కంటే తొందరగా షూటింగ్ పూర్తయిందని కూడా చెబుతున్నాడు.’ఆర్ఆర్ఆర్’తో పోలిస్తే ఈ ప్రాజెక్ట్ కోసం చాలా ఎక్కువ హోమ్‌ వర్క్, పేపర్ వర్క్ చేశాడట రాజమౌళి. అలా పకడ్బందీ ప్రిపరేషన్‌ తో షూటింగ్‌ లోకి అడుగుపెట్టడంతో, షూటింగ్ డేస్ తగ్గాయని చెబుతున్నాడు.

‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి కావడానికి 315 రోజులు పట్టింది. కానీ, అంతకంటే 6 రెట్లు పెద్దదైన ‘వారణాసి’ చిత్రాన్ని 275 రోజుల్లోనే పూర్తి చేశానంటున్నాడు జక్కన్న. పక్కా ప్రీ ప్రొడక్షన్, ప్లానింగ్ తో ఇది సాధ్యమైందని చెబుతున్నాడు.

కేవలం స్కేల్, షూటింగ్ పనిదినాల పరంగానే కాకుండా, బడ్జెట్ విషయంలోనూ ఈ సినిమా సరికొత్త రికార్డుల వైపు అడుగులు వేస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఆర్ఆర్ఆర్ బడ్జెట్ కు రెట్టింపు ఖర్చు అయిందంట వారణాసి సినిమా మేకింగ్‌కు.

ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచ ప్రేక్షకులు ఎక్కువమంది నెట్ ఫ్లిక్స్‌ లో చూశారని, అలాంటి వాళ్లకు థియేట్రికల్ అనుభూతిని అందించేందుకు.. వారణాసి సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాల్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు రాజమౌళి.

తన సినిమాను ఎక్కువమంది థియేటర్లలో చూడాలనే తపన తప్ప, గ్లోబల్ రిలీజ్ వెనక మరే ఇతర ఉద్దేశం లేదంటున్నాడు. వచ్చే ఏడాది వేసవి కానుకగా థియేటర్లలోకి వస్తోంది వారణాసి సినిమా.

4 Replies to “ఆర్ఆర్ఆర్ కంటే 6 రెట్లు పెద్దది, కానీ త్వరగా పూర్తి”

Comments are closed.