అఖిల‌ప్రియ‌తో రాజీ… గంగుల‌పై జ‌గ‌న్ సీరియ‌స్‌!

ఆళ్ల‌గ‌డ్డ‌లో త‌మ వాళ్ల‌తో వైసీపీ నేత‌లు రాజీ అయ్యార‌ని స్వ‌యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వెట‌క‌రించిన సంగ‌తి తెలిసిందే.

నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల‌ప్రియ‌తో రాజీ కావ‌డంపై అక్క‌డి వైసీపీ సీనియ‌ర్ నేత‌లు గంగుల ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు గంగుల బ్రిజేంద్ర‌రెడ్డిపై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యిన‌ట్టు స‌మాచారం.

ఆళ్ల‌గ‌డ్డ‌లో త‌మ వాళ్ల‌తో వైసీపీ నేత‌లు రాజీ అయ్యార‌ని స్వ‌యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వెట‌క‌రించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఆళ్ల‌గ‌డ్డతో పాటు ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అస‌లేం జ‌రుగుతున్న‌దో వైఎస్ జ‌గ‌న్ ఆరా తీసిన‌ట్టు తెలిసింది. ఆళ్ల‌గ‌డ్డ‌లో 32 వార్డులున్నాయి. వీటిలో 25 సీట్లు వార్డులు తీసుకుని ఎమ్మెల్యేతో గంగుల కుటుంబం రాజీప‌డింది.

ఆళ్ల‌గ‌డ్డ‌లో 8 వార్డులు వైసీపీకి, రెండింటిని జ‌న‌సేన‌కు టీడీపీ ఇచ్చింది. మిగిల‌న‌వ‌న్నీ టీడీపీ తీసుకుంది. మున్సిప‌ల్ చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ ప‌ద‌వులు టీడీపీ ఖాతాలో ప‌డ్డాయి.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో నామినేష‌న్లు వేసేందుకు వైసీపీ, ఇత‌ర విప‌క్షాలు యుద్ధం చేయాల్సిన ప‌రిస్థితి. ఇలాంటి క్లిష్ట స‌మ‌యంలోనూ ఆళ్ల‌గ‌డ్డ‌లో వైసీపీ అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేశారు.

అయితే ముందే అఖిల‌ప్రియ‌తో గంగుల కుటుంబం లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయి. అందుకే అభ్య‌ర్థుల‌కు బీ ఫారాలు ఇవ్వ‌కుండా మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర‌రెడ్డి అలియాస్ నాని నాట‌కం ఆడారు.

దీంతో వైసీపీ అభ్య‌ర్థుల్లో అనుమానాలు త‌లెత్తాయి. చివ‌రికి వారి అనుమానాలే నిజం అయ్యాయి. 8 మంది అభ్య‌ర్థులు మిన‌హాయించి, అంద‌రితో విత్ డ్రా చేయించారు.

నిజానికి ఇక్క‌డ వైసీపీ గ‌ట్టిగా నిల‌బ‌డి వుంటే త‌ప్ప‌క గెలిచేది. కానీ గంగుల కుటుంబం చిన్న రిస్క్ తీసుకోడానికి కూడా ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు గంగుల ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఎమ్మెల్సీగా, ఆయ‌న కుమారుడు ఎమ్మెల్యేగా అధికారాన్ని చెలాయించారు.

ఇప్పుడేమో ఇలా లోపాయికారి ఒప్పందాల‌తో కేడ‌ర్‌లో తీవ్ర నిరాశ‌, ఆగ్ర‌హాన్ని మిగిల్చార‌నే మాట వినిపిస్తోంది. అందుకే గంగుల తండ్రీత‌న‌యుల‌పై వైఎస్ జ‌గ‌న్ ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెప్పాయి.

8 Replies to “అఖిల‌ప్రియ‌తో రాజీ… గంగుల‌పై జ‌గ‌న్ సీరియ‌స్‌!”

  1. సింహం సొంత అడ్డా పులివెందులలో స్వాతంత్రం వచ్చినప్పటినుండీ ఎప్పుడూ లేనివిధంగా 22 వార్డులు ఏకగ్రీవ0 అయ్యాయి.. మరి గంగుల కూడా మన 11లంగామీద ఉల్టా సీరియస్ అయితే పరిస్థితి ఏంటీ అరికట్లా?

  2. మన 11మోహన పులివెందులలో,  బీటెక్ రవితో ర0కు సంబంధం వల్ల 22వార్డులు ఏకగ్రీవం అయ్యాయా అని ఉల్టా ప్రశ్నిస్తున్న గంగుల..

  3. అన్నియ పైసా తీయడు… ఇక్కడ డబ్బులు ఎవరు ఖర్చుపెట్టాలి? తీరా ఖచ్చు పెట్టాక గెలవకపోతె?

    అందుకే ఏకగ్రీవాలు చేసుకుంటున్నారు… 

Comments are closed.