దేశంలో ఎన్నికల ప్రక్రియపై ఇప్పటికే అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఒకవైపు.. ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) తర్వాత ఓటరు జాబితాల్లో పేర్ల తొలగింపులు, అర్హులైన ఓటర్లకు అన్యాయం జరుగుతోందనే సందేహాలు మరోవైపు.
ఎన్నికల వ్యవస్థ పారదర్శకతపై చర్చ జరుగుతున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వస్తున్న ఆరోపణలు మరో కొత్త ఆందోళనను ముందుకు తెస్తున్నాయి.
ఈవీఎంలపై సందేహాలకు ఆధారాలతో సమాధానాలు చెప్పాలి. ఓటరు జాబితాలపై అభ్యంతరాలను పారదర్శకంగా పరిశీలించాలి. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోయాయని ఆరోపణలు వస్తే వాటిని సరిదిద్దాలి. ఇవన్నీ ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించడానికి అవసరమైన చర్యలు.
కానీ ఏపీలో స్థానిక ఎన్నికల సందర్భంగా నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు, నామినేషన్ కేంద్రాల వద్ద బలప్రయోగం జరుగుతోందనే విషయాన్ని చాటుతున్న వీడియోలు మరింత తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
అంతటితో సమస్య ఆగడం లేదు. కొన్ని చోట్ల రిటర్నింగ్ అధికారులు నామినేషన్ పత్రాలను స్వీకరించలేదని, మరికొన్ని చోట్ల రాజకీయ కారణాలతో ఉద్దేశపూర్వకంగా నామినేషన్లను తిరస్కరించారనే మాటా వినిపిస్తున్నాయి.
ఈ ఆరోపణలు నిజమని తేలితే, అది సాధారణ ఎన్నికల వివాదం కాదు. ఎన్నికల ప్రక్రియలోని కీలకమైన దశకే విఘాతం కలిగించినట్లవుతుంది.
నామినేషన్ వేయకుండా బలవంతంగా అడ్డుకోవడం ఒక రకం దౌర్జన్యం. నామినేషన్ సమర్పించడానికి వచ్చిన అభ్యర్థి పత్రాలను అధికారులే స్వీకరించకపోవడం మరో రకం సమస్య.
నిబంధనల ప్రకారం పరిశీలించి, సరైన కారణాలతో తిరస్కరించడం వేరు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి తిరస్కరించడం వేరు. ఈ తేడాను గుర్తించకపోతే ఎన్నికల ప్రక్రియకు అర్థమే ఉండదు.
ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కొందరు రాజకీయ నాయకులు ఇచ్చే అనుమతి కాదు. చట్టం కల్పించిన హక్కు. అభ్యర్థి ఏ పార్టీకి చెందినవాడన్నది పక్కనపెట్టి, నిబంధనల ప్రకారం నామినేషన్ స్వీకరించాలి.
లోపాలుంటే చట్టబద్ధమైన కారణాలు చూపాలి. కానీ అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవారికి ఒక నిబంధన, ప్రత్యర్థులకు మరో నిబంధన అమలైతే ప్రజాస్వామ్యం పరిహాసంగా మారుతుంది.
ఇక్కడ ఎన్నికల సంఘం బాధ్యత అత్యంత కీలకం. నామినేషన్లను అడ్డుకున్న ఘటనలు, పత్రాలను స్వీకరించని సందర్భాలు, అనుమానాస్పద తిరస్కరణలపై స్వతంత్రంగా విచారణ జరగాలి.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అభ్యర్థులకు చట్టబద్ధమైన పరిష్కారాలు అందుబాటులో ఉండేలా చూడాలి. అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు గురయ్యారనే ఆరోపణలుంటే వాటినీ నిష్పక్షపాతంగా పరిశీలించాలి.
ఈవీఎంలపై అనుమానాలు.. SIR తర్వాత ఓటరు జాబితాలపై సందేహాలు.. ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియపైనే ఆరోపణలు!
ఒక్కో దశలో ఒక్కో ప్రశ్న తలెత్తుతున్నప్పుడు, ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మరింత పెరుగుతుంది. ఓటు వేసిన తర్వాత లెక్కింపు సక్రమంగా జరిగిందా అనే సందేహం ఒకటి. ఓటరు జాబితాలో పేరు ఉందా అనే సందేహం మరొకటి.
కానీ అసలు పోటీ చేసే అవకాశాన్నే అడ్డుకుంటే, అది ఎన్నికల ప్రజాస్వామ్యానికి మరో కొత్త పతనం. ఎన్నికల్లో ఎవరు గెలవాలో ప్రజలు నిర్ణయించాలి. రాజకీయ బలం కాదు. అధికార ఒత్తిళ్లు కాదు. అధికారుల పక్షపాతం అంతకంటే కాదు.
ఈవీఎంలపై అనుమానాలు, ఓటరు జాబితాలపై సందేహాలు చాలవన్నట్లు.. ఇప్పుడు నామినేషన్లకే అడ్డంకులా? ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగడం ముఖ్యం కాదు.. అవి నిజంగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగడం ముఖ్యం!

“జ’గే’న్ మోహనరెడ్డి” మెజెస్టిక్ లో మూటలు మోసి,కేవలం11నెలల్లో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర25ఎకరాల ప్యాలెస్ సంపాదించాడట.. అలా సంపాదించిన8000కోట్ల ప్యాలెస్ లో 11నేలమాళిగలు కట్టించి, అందులో “ప్రజలనుండీ దోచిన మూటలు దాచి” అత్తకి దానం చేశాడట.
పెళ్ళికి వచ్చిన అతిథులు అక్కడి “నేలమాళిగల గుట్టు రట్టు” చేస్తారనే భయంతో,చెల్లి వాటాలో జరగాల్సిన తన మేనకోడలి వివాహం, వాళ్ళ వాటాలో కూడా జరుపుకోవడానికి వీల్లేదని రక్షణ, గోప్యత అంటూ “లేనిహక్కు అధికారం”తో, చెల్లిని దౌర్జన్యంగా ప్యాలెస్ బైటికి గెంటేశాడట
“జ’గే’న్ మోహనరెడ్డి” మెజెస్టిక్ లో మూటలు మోసి,కేవలం11నెలల్లో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర25ఎకరాల ప్యాలెస్ సంపాదించాడట.. అలా సంపాదించిన8000కోట్ల ప్యాలెస్ లో 11నేలమాళిగలు కట్టించి, అందులో “ప్రజలనుండీ దోచిన మూటలు దాచి” అత్తకి దానం చేశాడట.
పెళ్ళికి వచ్చిన అతిథులు అక్కడి “నేలమాళిగల గుట్టు రట్టు” చేస్తారనే భయంతో,చెల్లి వాటాలో జరగాల్సిన తన మేనకోడలి వివాహం, వాళ్ళ వాటాలో కూడా జరుపుకోవడానికి వీల్లేదని రక్షణ, గోప్యత అంటూ “లేనిహక్కు అధికారం”తో, చెల్లిని దౌర్జన్యంగా ప్యాలెస్ బైటికి గెంటేశాడట
ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో అవకతవకలు మీద కోర్ట్ కి వెళ్ళారు కదా.. అలాగే ఈవీఎం ల మీద కూడా కోర్ట్ కి వెళ్ళచ్చు కదా?
కర్మ ఎవ్వరిని వదలదు
దేవదేవుడు అన్నీ చూస్తున్నాడు, తప్పు అందరిని దేవదేవుడు సర్వనాశనం చేస్తాడు
జనాలను మోసం చేయవచ్చు దేవున్ని మోసం చేయలేరు
నిజం నిప్పులాంటిది, తప్పు చేసిన అందరిని కాలుస్తుంది,ఇది దేవదేవుని సంకల్పం
దేవదేవుడు అన్నీ చూస్తున్నాడు, తప్పు చేసిన అందరిని, దేవదేవుడు సర్వనాశనం చేస్తాడు