షాకింగ్.. రీ షూట్స్ కోసం సినిమా వాయిదా

అంతా బాగానే ఉంది.. షూటింగ్ కూడా అనుకున్నట్టుగానే జరిగింది. కానీ 70 శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత ఎడిట్ లో చూసుకుంటే, హీరోకు నచ్చలేదు.

అంతా బాగానే ఉంది.. షూటింగ్ కూడా అనుకున్నట్టుగానే జరిగింది. కానీ 70 శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత ఎడిట్ లో చూసుకుంటే, హీరోకు నచ్చలేదు.

అసలే భారీ డిజాస్టర్ తో ఉన్నాడు. మరో రిస్క్ చేయదలుచుకోలేదు. వెంటనే కీలకమైన పోర్షన్లు కొన్ని రీషూట్ చేయాల్సిందిగా ఆదేశించాడు. ఫలితంగా సినిమా ఈ ఏడాది రావట్లేదు. వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.

నిజానికి సినిమా మేకింగ్ ను హీరో దగ్గరుండి చూసుకుంటున్నాడని, అందరికంటే ముందొచ్చి ఆఖర్లో వెళ్తున్నాడని, అన్నీ తనే చూసుకుంటున్నాడని, ఆ సినిమా నిర్మాత గతంలోనే ప్రకటించాడు. కానీ అప్పుడు చాలా మందికి అర్థం కాలేదు.

ఎప్పుడైతే సినిమా వాయిదా అధికారికమైందో, అప్పుడు ఆ నిర్మాత ఇచ్చిన స్టేట్ మెంట్ మరోసారి వైరల్ అయింది. సినిమా రీషూట్ ప్రాసెస్ మొదలై కూడా దాదాపు నెల దాటింది.

ఓవైపు పాన్ ఇండియా దర్శకులతో సినిమాలు చేస్తూనే, మరోవైపు ప్రయోగాలు చేస్తున్నాడు ఆ హీరో. అలా ఇప్పటికే ఓ ఫ్లాప్ కొనితెచ్చుకున్నాడు. ఇప్పుడు మరో ఫ్లాప్ వచ్చేలా ఉందనే సంకేతాలు అతడికి స్పష్టంగా కనిపిస్తున్నాయి.

గతంలో కూడా తన పాన్ ఇండియా సినిమా టీజర్ రిలీజైన వెంటనే రిజల్ట్ ను అతడు ఊహించాడు. వెంటనే దర్శకుడ్ని ‘కమ్ టు మై రూమ్’ అని పిలిచాడు.

ఇప్పుడు మళ్లీ అలాంటి ఛాయలు అతడికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈసారి రూమ్ లోకి పిలిస్తే రావడానికి కూడా ఎవ్వరూ సిద్ధంగా లేరక్కడ.

అందుకే లేట్ అయినా, రీషూట్ చేసి, మరోసారి ఔట్ పుట్ చెక్ చేసుకొని థియేటర్లలోకి వద్దామని ఫిక్స్ అయ్యాడు హీరో.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ సినిమా వల్ల ఆ హీరోకు ఆర్థికంగా వచ్చేది చాలా తక్కువ. పాత బాకీల కింద ఇప్పటికే ఇద్దరు ప్రొడ్యూసర్లకు ఈ సినిమా హక్కులు కట్టబెట్టేశాడు. ఇప్పుడు అతడికి కావాల్సిందల్లా ఓ సక్సెస్ మాత్రమే, డబ్బు కాదు.

9 Replies to “షాకింగ్.. రీ షూట్స్ కోసం సినిమా వాయిదా”

      1. కం టు ది రూమ్ అని రాసాడు కదా !!! అంతా చెప్పేసి మనల్ని కనుక్కోమంటాడు మన GA

      2. కం టు ది రూమ్ అని రాసాడు కదా ! అంతా చెప్పేసి మనల్ని కనుక్కోమంటాడు GA

Comments are closed.