ఓవైపు అనన్యా పాండేపై డేటింగ్ రూమర్స్ నడుస్తున్నాయి. అక్షయ్ కుమార్ కొడుకుతో ఆమె రిలేషన్ షిప్‌లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. దీనికి కారణం, తాజాగా ఇద్దరు కలిసి దిగిన ఫొటో వైరల్ అవ్వడమే.
ఓవైపు అది వైరల్ అవుతుండగానే, మరోవైపు తన వాచీతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది అనన్య పాండే. అక్షరాలా కోటీ 32 లక్షల రూపాయల ఖరీదైన వాచ్‌తో ఆమె దర్శనమిచ్చి, అందరికీ షాకిచ్చింది.
ఢిల్లీలో జరిగిన పీజెట్ ఐవరీ అవర్ ఈవెంట్‌లో షో స్టాపర్‌గా నిలిచింది అనన్య. గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన ప్రత్యేకమైన దుస్తుల్లో మెరిసింది. అదే టైమ్‌లో ఆ దుస్తులతో పాటు ఆమె ధరించిన వాచ్ అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది.
ఆమె మణికట్టుపై మెరిసిన ఆ అరుదైన వాచీ కేవలం టైమ్ చూడ్డానికి మాత్రమే కాదు.. హై జ్యువెలరీతో ఫ్యాషన్ సింబల్‌గా కూడా మారింది. స్విస్ హొరాలజీ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ వాచీని… 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో తయారు చేశారు.
అరుదైన బ్లాక్ ఓపల్ డయల్ ను దీనికి పెట్టారు. ఆ నల్లటి డయల్ చుట్టూ రత్నాలు పొదిగారు. ఇది వాచ్ అందాన్ని మరింత పెంచింది. ఆ రత్నాల్లో ఖరీదైన 20 కట్ డైమండ్స్ ఉన్నాయి. వాటి చుట్టూ మరో 22 ఒరిజినల్ నీలమణుల్ని పొదిగారు. అందుకే ఈ వాచీ అంత కాస్ట్‌లీ.

ధర బాగా ఎక్కువే, సరే వాచ్ వచ్చింది కదా, ఓకే
హీరోలు పెట్టుకుంటే ఆహా, ఓహో.. అదే హీరోయిన్స్ పెట్టుకుంటే మాత్రం ఏదో తప్పు చేసినట్టు చూస్తారు, shame..