ఏబీఎన్ నుంచి అల్లుడిని గెంటేసిన ఆర్కే!

సోష‌ల్ మీడియా అంతా ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్కే త‌న అల్లుడు కోగంటి భార్గ‌వ్‌ను గెంటేయ‌డం గురించి హోరెత్తుతోంది.

సోష‌ల్ మీడియా అంతా ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్కే త‌న అల్లుడు కోగంటి భార్గ‌వ్‌ను గెంటేయ‌డం గురించి హోరెత్తుతోంది.

ఆర్కే కుటుంబ గొడ‌వ‌ల తేనెతుట్టెను ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌, దాని అనుబంధంగా న‌డిచే ఏబీఎన్ చానెల్ క‌దిపాయ‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి చెల్లి ష‌ర్మిల‌కు గొడ‌వ‌లున్న సంగ‌తి తెలిసిందే. ష‌ర్మిల కుమార్తె అంజ‌లి పెళ్లిని య‌ల‌హంక‌లో తాను నివాసం ఉండే ప్రాంతంలో చేయించాల‌ని ష‌ర్మిల అనుకున్నారు.

అయితే భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా ఇంకో చోట వేదిక చూసుకోవాల‌ని ష‌ర్మిల‌కు జ‌గ‌న్ సూచించారు. దీన్ని రాజ‌కీయంగా వాడుకుని, త‌ద్వారా త‌న అన్న‌ను బ‌ద్నాం చేసే క్ర‌మంలో ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ మీడియా సంస్థ‌కు ష‌ర్మిల ఉప్పందించార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఎందుకంటే, గ‌తంలో కూడా త‌మ కుటుంబంలో జ‌రిగిన వివాదాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని స‌ద‌రు మీడియాధిప‌తికి అందించి, అందులో రాయించార‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

అదే పంథాను మ‌రోసారి త‌న కుమార్తె పెళ్లికి, య‌ల‌హంక‌లోని నివాసాన్ని ఇవ్వ‌డానికి జ‌గ‌న్ అంగీక‌రించ‌లేద‌ని, సొంత అన్న‌ను ఆయ‌నంటే గిట్ట‌ని మీడియాతో ఛీ కొట్టిస్తూ క‌థ‌నాలు రాయించిన‌ట్టు వైసీపీ ఆరోపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో భాను కోగంటి అనే వ్య‌క్తి ట్వీట్‌… తీవ్ర దుమారం రేపుతోంది. ఆ ట్వీట్ ఏంటంటే…

“మీడియాలో కొందరు తమ సొంత ఇంట్లో ఏం జరుగుతోందో వదిలేసి, ఇంకోళ్ల ఇళ్ల‌లో దూరి పరిశీలించడంలో బిజీగా ఉన్నారు” అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు సొంత ఇల్లు, అలాగే మీడియా, ఇత‌ర‌త్రా హ్యాష్‌ట్యాగ్‌ల‌ను జ‌త చేశారు.

ఇప్పుడీ ట్వీట్ పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారి తీయ‌డానికి ప్ర‌త్యేక కార‌ణం లేక‌పోలేదు. ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ మీడియాధిప‌తి వేమూరి రాధాకృష్ణకు స్వ‌యాన భాను కోగంటి అల్లుడు కావ‌డం వ‌ల్లే తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

త‌న ఇంట్లో జ‌రుగుతున్న‌ది వ‌దిలేసి, వైఎస్ జ‌గ‌న్ కుటుంబ విష‌యాల్లో త‌న మామ ఆర్కే త‌ల‌దూర్చార‌నేది భాను కోగంటి త‌న మామ‌కు ప‌రోక్షంగా ఎక్స్ వేదిక‌గా చుర‌క‌లు అంటించార‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదే సంద‌ర్భంలో కాస్త లోతుల్లోకి వెళ్లి, ఆర్కే కుటుంబంలో చోటు చేసుకున్న వివాదాల‌ను బ‌య‌ట పెడుతున్నారు.

అల్లుడిని ఏబీఎన్ చానెల్ నుంచి గెంటేసిన‌ట్టు నెటిజ‌న్లు ఆధారాల‌తో స‌హా వెల్ల‌డిస్తుండ‌డం విశేషం. విల‌క్ష‌ణ న‌టుడు మోహ‌న్‌బాబుతో ఒక ఇంటర్వ్యూలో స్వ‌యాన వేమూరి రాధాకృష్ణ త‌న కుమారుడు ఆదిత్య‌కు ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక‌ను, కుమార్తె అనూష‌కు ఏబీఎన్ చానెల్‌ను ఇచ్చిన‌ట్టు తేల్చి చెప్పారు.

అప్ప‌టి నుంచి ఆర్కే అల్లుడు నిత్యం ఏబీఎన్ చానెల్‌కు వెళుతూ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించేవారు. అలాగే ఆంధ్ర‌జ్యోతి వెబ్‌సైట్ వ్య‌వ‌హారాల్ని కూడా చూసేవార‌ని అక్క‌డి సిబ్బంది చెబుతున్నారు.

ఇటీవల విజ‌య ద‌శ‌మిని పుర‌స్క‌రించుకుని ఆంధ్ర‌జ్యోతి -ఏబీఎన్ నూత‌న భ‌వ‌నంలోకి కార్యాల‌యాన్ని మార్చారు. ఈ సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యుల‌తో తీసుకున్న ఫొటోను ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లో ప్ర‌చురించారు.

ఇందులో ఆర్కేతో కుమారుడు ఆదిత్య‌, కోడ‌లు శ్రుతికీర్తి, కుమార్తె అనూష ఇత‌ర కుటుంబ స‌భ్యులున్నారు. అల్లుడు మాత్రం మిస్ అయ్యారు. తాజాగా అల్లుడు ట్వీట్‌తో ఆర్కే కుటుంబంలోని గొడ‌వ సంగ‌తి బ‌య‌టికొచ్చింది.

ఈ నెల 9న ఆమోద బ్రాడ్‌కాస్టింగ్ బోర్డులో మార్పుల్ని చేశారు. ఇంత‌కాలం మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన వేమూరి రాధాకృష్ణ చైర్మ‌న్‌గా మారారు. అలాగే కుమారుడు ఆదిత్య మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా, కుమార్తె వేమూరి అనూష‌ను జాయింట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా నియమించారు.

ఇంత‌కాలం డైరెక్ట‌ర్ హోదాలో ఉన్న అల్లుడు భాను కోగంటిని త‌ప్పించారు. అల్లుడి స్థానంలో కోడ‌లు శ్రుతికీర్తి డైరెక్ట‌ర్ అయ్యారు.

దీంతో ఏబీఎన్ నుంచి అల్లుడు భాను కోగంటిని గెంటేశారంటూ సోష‌ల్ మీడియా అంతా హోరెత్తుతోంది. ఇత‌రుల కొంప‌ల్లోని వివాదాల గురించి రాసేట‌ప్పుడు, త‌న ఇంట్లో వ్య‌వ‌హారాల్ని చూసుకోవాలంటూ నెటిజ‌న్లు హిత‌వు చెబుతున్నారు. మ‌రీ ముఖ్యంగా ఇలాంటి హిత‌వు అల్లుడి నుంచే ప‌రోక్షంగా మామ ఆర్కేకు రావ‌డంతో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

14 Replies to “ఏబీఎన్ నుంచి అల్లుడిని గెంటేసిన ఆర్కే!”

  1. తెలుసు… ఆ ల్యాండ్ చిరంజీవి దగ్గర 2023 లో కొన్నారు .. 3000 గజాలు 75 కోట్లకి .. చిరంజీవికి అవసరం లేకపోయినా ఒక హాస్పిటల్ చైర్మన్ రికమండేషన్‌తో మొహమాటంతో అమ్మాల్సి వచ్చిందని టాక్…

  2. తెలుసు… ఆ ల్యాం డ్ చిర0జీవి దగ్గర 2023 లో కొన్నారు .. 3000 గజాలు 75 కోట్లకి .. చిర0జీవికి అవసరం లేకపో యినా,  మొహమా టంతో  ఒక హాస్పిటల్ చైర్మ న్ రికమండే షన్‌తో అమ్మాల్సి వచ్చిం దని టా క్…

  3. తెలుసు… ఆ ల్యాండ్ చిరంజీవి దగ్గర 2023 లో కొన్నారు .. 3000 గజాలు 75 కోట్లకి .. చిరంజీవికి అవసరం లేకపోయినా,  మొహమాటంతో  అమ్మాల్సి వచ్చిందని టాక్.

  4. ప్యాలెస్ లో పడుకుని సంబురాలు చేసుకుంటున్న జెగ్గులూ &సజ్జలు.. ఇంకో రూమ్ లో వాళ్ళిద్దరూ కూడా

  5. పాపం, అల్లుడ్ని తెచ్చుకున్నాను అనుకున్నాడు గానీ, తనకే మొగుడ్ని తెచ్చుకున్నాను అనుకోలేదు.

      1. అదేంటి, PK గాడికి already ఇద్దరు మొగుళ్లు ఉన్నారు కదా? ఒకడు ముసలి మొగుడు, ఇంకొకడు పిల్ల బచ్చా మొగుడు.

        1. PK నాలుగో పెళ్ళాం మన జగేన్ మోహన లంగా కదా.. pk power కి తట్టుకోలేక  బెంగళూరు బంకర్ లో దాక్కుని సరిగ్గా కాపురం చెయ్యడం లేదు.. లేకుంటే ఈపాటికే జగేన్ మోహనకి 11నెలల గర్భం వచ్చేది

  6. యలహంకలోని ప్యాలెస్‌లో షర్మిల భాగం సైతం పూర్తిగా హస్తగతం చేసుకునే రహస్య ప్రణాళిక నడుస్తోందని షర్మిల ముఖ్య అనుచరులు సంచలన విషయాలను బయటపెడుతున్నారు. ప్రస్తుతం భారతి తల్లి పేరుతో ఉన్న ఈ8000కోట్ల భారీ ప్యాలెస్ ఆస్తిని, చాపకింద నీరులా జగన్ కుమార్తెలు హర్ష, వర్ష పేర్ల మీదకు శాశ్వతంగా బదిలీ చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు టాక్

  7. కుట్రలో భాగంగానే మేనకోడలు అంజలి వివాహాన్ని యలహంక ప్రాంగణంలో జరగకుండా జగన్ అన్ని రకాలుగా అడ్డుపడుతున్నారటా. అక్కడ గనుక ఈ వివాహ వేడుక అట్టహాసంగా జరిగితే.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది బంధువులు, వీఐపీలు, అతిథులు తరలివస్తారని, దాంతో ఆ ప్యాలెస్ షర్మిల వాటాగా సమాజంలో బలమైన అధికారిక గుర్తింపును పొందుతుందని జగన్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఒక్కసారి సమాజం దృష్టిలో అది షర్మిల నివాసంగా స్థిరపడితే, భవిష్యత్తులో ఆ ప్యాలెస్‌ను సైలెంట్‌గా తమ కుటుంబం పేరిట రాయించుకుని కాజేయడం అసాధ్యమవుతుందన్న దురుద్దేశంతోనే ఈ గోప్యత&సెక్యూరిటీ డ్రామాను తెరపైకి తెచ్చారని ష

Comments are closed.