బాబుది ‘సేల్ వైజాగ్’.. జగన్‌ది ‘సేవ్ వైజాగ్’!

జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ జనాల్లోకి దూసుకెళ్లే నినాదాన్ని అందుకుంది. చంద్రబాబుది సేల్ వైజాగ్ విధానమని, వైఎస్ జగన్‌ది సేవ్ వైజాగ్ నినాదమని ఆ పార్టీ అంటోంది.

జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ జనాల్లోకి దూసుకెళ్లే నినాదాన్ని అందుకుంది. చంద్రబాబుది సేల్ వైజాగ్ విధానమని, వైఎస్ జగన్‌ది సేవ్ వైజాగ్ నినాదమని ఆ పార్టీ అంటోంది.

విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో నమ్మకానికి, అమ్మకానికి మధ్య పోరాటం సాగుతోందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు.

విశాఖ భూములు, పర్యావరణం, ప్రజల హక్కులు, నగర భవిష్యత్తును కాపాడటమే వైసీపీ లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో “సేవ్ వైజాగ్” నినాదం ఇచ్చిందని ఆయన చెప్పారు.

చంద్రబాబుది “సేల్ వైజాగ్” విధానమని, అందుకే విశాఖలో కొండలను సైతం ఉంచకుండా గుండు కొట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకుండా వేలాది ఎకరాలను కార్పొరేట్లకు విశాఖలో కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎకరం 99 పైసలకే విలువైన భూములిచ్చే విధానంతో విశాఖను సేల్ వైజాగ్‌గా మార్చేశారని ఆయన ఎత్తిపొడిచారు.

గతంలో ఎన్నడూ చూడని విధంగా విశాఖ వాసులు ఈసారి తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని అన్నారు. విశాఖ వంటి నగరం ఈ రోజున మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు విమర్శించారు.

భోగాపురం విమానాశ్రయ పనులు, పోలవరం కాలువల ద్వారా అనకాపల్లికి వచ్చిన నీటి విషయంలో కూడా గతంలో వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని చంద్రబాబు తన ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.

గతంలో రుషికొండ పేరుతో పర్యావరణంపై మాట్లాడినవారు ఇప్పుడు విశాఖలో కొండలను తవ్వేస్తున్నారని అన్నారు. కేవలం ఫొటోషూట్ల పేరుతో ప్రచారం చేసుకోవడం తప్ప విశాఖ ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి ఏది చేశారని కూటమి ప్రభుత్వ పెద్దలను వైసీపీ నేతలు ప్రశ్నించారు.

తాగునీటి సమస్యలతో పాటు కొండలను పిండి చేస్తున్న పరిస్థితులు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలను వైసీపీ జీవీఎంసీ ఎన్నికల అజెండాగా చేసుకుని జనంలోకి వెళ్తోంది. పెరుగుతున్న నిత్యావసర ధరల నియంత్రణలోనూ ప్రభుత్వం విఫలమైందని ప్రచారం చేస్తోంది.

5 Replies to “బాబుది ‘సేల్ వైజాగ్’.. జగన్‌ది ‘సేవ్ వైజాగ్’!”

  1. వైజాగ్ ప్లేస్‌లో “state” అని ఉంటే ఇంకా apt‌ గా suit అయ్యి ఉండేది. అందినకాడికి దోచుకోవడం, అందనివన్నీ అమ్ముకోవడం—ఇదేగా ఆయన చేస్తున్న పని.

  2. హైదరాబాద్ మొత్తం కొండలే కదా…. మొత్తం పిండి చేశారు కదా….?

    వైజాగ్ అయినా అంతే… అనుమతులు లేకుండా చేస్తే తప్పే.. అది వైసీపీ అయినా కూటమి అయినా..

    ముందు ప్రజలు మనం చెప్పేది నమ్మాలి అప్పుడే ఓట్లు వేస్తారు 

    వైజాగ్ కి నీటి ప్రాబ్లెమ్ వుంది.. హైదరాబాద్ లో లేదా? బెంగుళూరు లో లేదా? వర్షాలు లేకపోతే ఎవరు మాత్రం ఏమి చేయగలరు?

    ధరలు గురించి మాట్లాడడం హాస్యాస్పదం.. ప్రపంచం మొత్తం పెరిగాయి.. ఒక్క వైజాగ్ లోనే కాదు 

    మహమేత వేల ఎకరాలు దారాదత్తం చేసిన విషయం మర్చిపోయారా?

Comments are closed.