ఆలుమగలు అర్థం చేసుకోవడానికి ఎంత టైమ్ కావాలి. కొంతమంది ఇట్టే కలిసిపోతారు. మరికొన్ని జంటలు పిల్లలు పుట్టిన తర్వాత మరింత అన్యోన్యంగా మారుతారు. మరికొందరు ఓ ఐదేళ్లకు సెట్ అవుతారు. మరి దశాబ్దాలు కాపురం చేసిన తర్వాత కూడా విడిపోతే వాళ్లను ఏమనాలి? అప్పటివరకు అన్యోన్యంగా ఉన్న వాళ్ల మధ్య పూడ్చలేని అగాధం ఎందుకు ఏర్పడుతోంది? ఇన్నేళ్లలో వాళ్లు ఒకర్నొకరు అర్థం చేసుకున్నది ఇదేనా?
కొన్ని జంటల్ని చూస్తే ఇదే సందేహం కలుగుతోంది. సెలబ్రిటీలుగా ఉంటూ నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన జంటలే విడిపోతున్నాయి. అదేదో మూడు నాలుగేళ్లకు విడిపోయారంటే అనుకోవచ్చు. ఏళ్లకుఏళ్లు కాపురం చేసి, పిల్లలు పుట్టి పెరిగి పెద్దయిన తర్వాత, విడాకులు తీసుకుంటున్నారు. ఎవరి వ్యక్తిగత కారణాలు వాళ్లకుంటాయి కానీ ఇలా ఏళ్లుగా కాపురం చేసి విడిపోవడం బాధాకరం.
పవన్ కల్యాణ్, అనా లెజినోవా విడిపోవడంతో ఈ చర్చ మరోసారి మొదలైంది. వీళ్లు కొత్తగా పెళ్లి చేసుకున్న జంట కాదు. దశాబ్దానికి పైగా వైవాహిక బంధంలో ఉన్నారు. వీళ్ల కాపురానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
2013లో అనాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు పవన్ కల్యాణ్. ఈ జంటకు పొలెనా అంజనా పవనోవా, మార్క్ శంకర్ పననోవిచ్ అనే ఇద్దరు పిల్లలున్నారు. 13 ఏళ్ల కాపురం తర్వాత వీళ్లు విడిపోవడం బాధాకరం.
ఇలా దశాబ్దానికి పైగా వైవాహిక బంధంలో ఉండి విడిపోయిన సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. ఈమధ్య కాలంలో అలా వార్తల్లో నలిగిన వ్యక్తి ఏఆర్ రెహ్మాన్. దాదాపు 30 ఏళ్ల పాటు సైరాబానుతో వైవాహిక బంధంలో ఉండి విడిపోయారు రెహ్మాన్. విడాకులు తీసుకునే సమయానికి వీళ్ల పిల్లలు మేజర్లు.
అంతకంటే ముందు జయం రవి కూడా ఇదే పని చేశాడు. ఆర్తితో 18 ఏళ్లు కాపురం చేశాడు జయం రవి. చూడముచ్చటైన జంట అనే ఇమేజ్ కూడా తెచ్చుకున్నారు. అలా 18 ఏళ్లు భార్యాభర్తలుగా ఉన్న వీళ్లిద్దరూ ఒక్కసారిగా విడిపోయారు. విడిపోయిన తర్వాత వివాదాల సంగతి సరేసరి.
హీరో ధనుష్ కూడా ఐశ్వర్యతో 18 ఏళ్లు కాపురం చేసి తెగతెంపులు చేసుకున్నాడు. అటు మ్యూజిక్ డైరక్టర్ జీవీ ప్రకాశ్ కూడా సైంధవితో తన 11 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టాడు.
పెళ్లయిన 19 ఏళ్ల తర్వాత మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్ విడాకులు తీసుకుంటే.. 14 ఏళ్లు కాపురం చేసిన తర్వాత సుసేన్‌కు విడాకులిచ్చాడు హృతిక్. ఈ జాబితాలోకి పవన్ కల్యాణ్ చేరడం బాధాకరం.

తిరుపతిలో తన సనాతనం సచీలత నిరూపణకుగుండు కొట్టించిఅన్నాకు అన్నప్రసాదం తినిపించిన భక్తుడికి ఇలా జరగడం నిజంగా బాధాకరం. ఆ వెంకటేశుడికి స్వచ్చమైన నెయ్యి లడ్డూ దొరకలేదని ఎన్నో నిద్రలేని రాత్రులు మెట్లు కడిగిన పుణ్యం ఇలా చుట్టుకోవడం ప్రారబ్ధం.. 🙁
https://www.thehindu.com/news/national/andhra-pradesh/pawan-kalyans-wife-performs-head-tonsuring-at-tirumala/article69448499.ece
https://shorturl.at/KTbDI
https://shorturl.at/KTbDI
that means they want new beauties….🤣🤣🤣
Aamair khan?
Mari Ameer khan gurinchi rayadaaniki chetulu raaledaa
Hrithik – one time divorce
Dhanush – one time divorce
AR Rahman – one time divorce
Jayam Ravi – one time divorce
GV Prakash – one time divorce … అందులో తప్పు లేదు. ఇక్కడ తోడుగా పని చేసిన వాళ్ళను అనుభవించి , పెళ్లి చేసుకుని , పిల్లలను కని , వదిలెయ్యడం.
సనాతన దర్మం” ని కాపాడుతున్నాను అని చెప్పడం.
అత్తారింటికి దారేది ?