ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న విషయానికి భార్యాభర్తలు గొడవ పడడం సాధారణ విషయమైంది. ఆ గొడవ కాస్త విడాకులకు దారి తీస్తోంది. జీవితంలో సర్దుబాటు ఎంతో అవసరం. ఆవేశం అనర్థదాయకం. మరీ ముఖ్యంగా దాంపత్య జీవితంలో గౌరవం, ప్రేమ అనేవి ప్రధానం.
భార్యాభర్తల మధ్య విభిన్న అభిప్రాయాలు వుండకూడదనే నిబంధన లేదు. అయితే వేర్వేరు అభిప్రయాలున్నప్పటికీ, వాటిని గౌరవించడం ముఖ్యం. ఇది ప్రజాస్వామిక హక్కు. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది దంపతులకు వర్తిస్తుంది. ప్రధానంగా పురుషాధిక్య వ్యవస్థలో భర్త అభిప్రాయాలే భార్యకు వుండాలని కోరుకోవడం అవివేకం.
పెళ్లయి, పిల్లలు పుట్టాక … దశాబ్దం గడిచాక కుదర్లేదంటూ విడాకులు తీసుకుంటున్న వాళ్ల సంఖ్య పెరిగింది. సహజంగా భారతీయ జీవన విధానంలో ఒకటికి మించి పెళ్లిళ్లను సమాజం నైతికంగా హర్షించదు. చట్టప్రకారం విడాకులు తీసుకున్నారని, ఇంకో కారణమో చెబుతూ, తమ వ్యక్తిగత జీవితం, తమిష్టమని అంటుంటారు. ఒకరి జీవితంలోకి ఇంకొకరు తొంగి చూడడం నేరం. ఇందులో రెండో అభిప్రాయానికి చోటులేదు.
కానీ పిల్లల గురించి ఎవరూ మాట్లాడ్డం లేదు. దంపతులు విడిపోయి, ఒకటి కాకపోతే పది పెళ్లిళ్లు చేసుకున్నా ఎవరికీ నష్టం లేదు. కానీ తల్లి లేదా తండ్రిని ఎలా తీసుకొస్తారనేదే ప్రశ్న. తరచూ నాలుగైదేళ్లకో, పదేళ్లకో భర్త లేదా భార్యను మార్చేవాళ్లు, తమ పిల్లల కోణంలో నుంచి ఆలోచిస్తే, తప్పటడుగు వేయరు.
ఎంతసేపూ తమ ఇగోల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. పంతాలు, పట్టింపులకు పోతున్నారు. అంతిమంగా పిల్లలను తీవ్ర మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు. రెండో , మూడో పెళ్లి చేసుకున్నాక, జీవితంలోకి కొత్తగా వచ్చే తల్లి లేదా తండ్రి జన్మనిచ్చిన వాళ్ల మాదిరి ఆదరణ చూపే అవకాశం చాలా తక్కువ. సవతి ప్రేమ అని ఊరికే అనలేదు.
తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని పిల్లలు, పెరిగి పెద్దయ్యాక సమాజంపై తీవ్ర అక్కసు పెంచుకుంటుంటారు. పనతనంలో హృదయంపై అయిన గాయం, పెరిగి పెద్దదై హింసాత్మకంగా తయారు చేస్తుంది. సైకోలుగా తయారైన వారి నేపథ్యాన్ని బాగా పరిశీలిస్తే, జీవితంలో బాగా దెబ్బతిన్న చరిత్ర వుంటుంది.
తల్లిదండ్రులు చాలా సులువుగా తమ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదని, కలిసి జీవించలేమని, కానీ స్నేహితులుగా కొనసాగుతామని ప్రకటనలు ఇస్తుంటారు. భార్యాభర్తల మధ్య స్నేహ, ప్రేమ బంధమే తప్ప, అధికార బంధం వుండకూడదని సుప్రసిద్ధ రచయిత గుడిపాటి వెంకటచలం చాలా ఏళ్ల క్రితమే రాశారు. కానీ విడిపోయే సందర్భంలో ఇకపై స్నేహితులుగా కొనసాగుతామని చెప్పడం ఏంటో ఎవరికీ అర్థంకాదు.
అలాగని పెళ్లి చేసుకున్నాక, నరకం అనుభవిస్తూ కలిసే జీవించాలని చెప్పడం అవివేకం. పెళ్లి అనేది మానసిక అనుబంధం. భార్యాభర్తలు పరస్పరం ప్రేమతో గడపాల్సి వుంటుంది. ప్రేమ లేకుండా గడపడం సంసారం మాత్రం కాదు, దాన్ని మరోలా పిలవొచ్చు. దానికంటే విడిపోవడం మంచిది.
సహజంగా పిల్లలు పుట్టాక, వారే జీవితంగా తల్లిదండ్రులు గడుపుతుంటారు. పిల్లల సుఖసంతోషాల గురించి తల్లిదండ్రులు పరితపిస్తుంటారు. కానీ ఇటీవల కాలంలో తల్లిదండ్రుల్లో ఇంకా తమ సుఖన్వేషణే కనిపిస్తోంది. ఇలాంటి వాళ్ల కుటుంబాల్లో సంతోషం అనేది ఎప్పటికీ వుండదు. అసలు ఆనందం అనేది ఎక్కడో ఉండదు. పిల్లల్ని పెంచడంలో వుంటుంది. పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉన్న ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. దాన్ని ఆస్వాదించాల్సిందే.
అంతెంతుకు, ప్రతిరోజూ పిల్లల్ని స్కూల్ లేదా కాలేజీకి తీసుకెళ్లి, తిరిగి ఇంటికి తెచ్చే సందర్భంలో మాట్లాడుతూ గడపడం ఒక అద్భుత అనుభవం. దాన్ని ఆస్వాదించేవారికి తప్ప, విన్న వారికి ఆనందం ఎలా వుంటుందో తెలియదు. పిల్లల స్నేహితులంతా తల్లిదండ్రులతో ఆనందంతో గడుపుతూ వుంటే, తల్లి లేదా తండ్రి లేని పసి మనసులు ఎంతగా వేదన చెందుతాయో, అనుభవించే వారికే తెలుస్తుంది. పిల్లల పెంపకం అంటే వారికి ఆర్థిక వనరుల్ని సమకూర్చడం మాత్రమేకాదు. డబ్బుతో కొనలేని ప్రేమ, స్నేహాన్ని ఉగ్గుపాలతో అందించడం.
ప్రధానంగా మనసుకు సంబంధించినవి అందించకుండా, కేవలం డబ్బుతో బాధ్యత తీరిపోయినట్టు ఎవరైనా భావిస్తే, అంతకంటే మూర్ఖత్వం మరొకటి వుండదు. పిల్లలకు ఏ వయసులో ఏం కావాలో అందించే వారే నిజమైన తల్లిదండ్రులు. ఇగోలకి వెళుతూ, పసిహృదయాలను గాయపరచడం అంటే, సమాజానికి చేటు చేస్తున్నట్టే. ఈ విషయంలో విడాకుల గురించి ఆలోచించే తల్లిదండ్రులు ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా వుంది

ఏముంది లండన్ లో బిజినెస్ పెట్టిస్తే సరి ఇక్కడ 3am కాల్స్ కి ఇబ్బంది లేకుండా, నా మాట కాదు, గాలి మాట అంతకన్నా కాదు, సాక్షాత్తు సీబీఐ చెప్పింది!! మనం అద్దాల మేడ లో ఉంటూ పక్కనోడి మీద రాళ్లు వెయ్యకూడదు కదా!!
లోకేష్ బాబు గురించి అలా మాట్లాడకూడదు….
నీ ఇంట్లో ఆడాళ్లతో నువ్వు అదే చేస్తున్నావా లఫాంగ్…..
బిన్లాడెన్ కథ చదివితే తన నాలుగో భార్య ఇద్దరు పిల్లలు లో ఒకరు మొట్టమొదటగా సీల్స్ చూసి మూడో అంతస్తులో రెండో పడకగదిలో రెండో భార్య మరియు మొదటి భార్య ఐదో పాపతో ఉండగా చెప్పటానికి పరిగెత్తాడు అన్న వెంటనే నేను మళ్లీ పుస్తకం మొదటి చాప్టర్ నుంచి రిలేషన్స్ క్షణ్ణంగా చదవడం మొదలు పెట్టాను. మళ్లీ ఎక్కడో కన్ఫ్యూషన్ మళ్లీ మొదలు. ఈ అరబ్బు లలోనే ఇంత గందరగోళం అందుకే ఆంధ్రలో ఆ కన్ఫ్యూషన్ ఉండదు కొంచెం పేరు తెచ్చుకున్నవారకు అనుకున్న. కాశీ మజిలీ కథల్లా ఇక్కడ కూడా మొదలయ్యింది.. సనాతనమో సన్నాసితనమో ఆ వెంకటేశుడే చూడాలి..
భార్య భర్తలు విడిపోతే ఎంత నష్టం జరుగుతుందో… తల్లి కొడుకు విడిపోయి కే.సులు వేసుకుని ఏమి సందేశం ఇస్తున్నారు?
పాపం పవన్ కళ్యాణ్ గారి మనస్సు ఎంత బద్దలై ముక్కలు చేసి గాయపరిచింది … ఈ లెజి no వా
ee rojullo pasi hrudayalu rojukokarni breakup cheppesukuntunnaru babu. Nuvven bhadha padakae.
A.P. ni dochestunna bolli Naidu chesede dopidi inka malli rajamundry tappadu pakka
nijam chepparu jagan sharmila gari ni chusinapudu rajashekar ry garu entha ga edchi vuntaro
అక్కడ పరస్పరం అన్నారు…. ఏమో ఆమెనే డైవర్స్ అడిగి ఉండొచ్చు….
అరె ఓ సాంబ. నువ్వు రాసుకో .
Arey arikatla, Deniki pawan pic enduku
రుక్మిణి కోట… ready
మూడు ముక్కలాట
ఇష్టం లేకుండా కాపురం చేసుకోవడం కన్నా వీడిపోవడమే బెటర్.
మూడు ముక్కలాట
ఎలా ఉంది అంటే.. ఆయనేమో పెళ్ళాటలు, పెటకులాటలు అనే ఆట ఆడుతూ నలుగురు పిల్లలను కన్నాడు. వాళ్లను గాలికి వదిలేశాడు…మీరేమో ఆ ఆటను చప్పట్లు కొడుతూ చూడండి….సంసారం నిలబెట్టుకోవడం చేయకనప్పుడు పెళ్ళి చేసుకోకుండా ఉండాలి అంతేకానీ… అతనేదో గొప్పపని చేసినట్లు సానుభూతిబొక్కటి.
లేతమనసులు
అది సరే కానీ, రాజకీయ నాయకులు కక్ష హత్యలు చేసినప్పుడు వాళ్ల ఇళ్లల్లో పసి పిల్లలు ఉండరా?
– ఎర్రికట్ల