పగబడితే ఇక అంతే.. అంతు చూడ్డమే..!

తాజాగా 2027 మార్చి 31 వరకు సస్పెన్షన్ పొడిగించారు. ఈలోగా.. ఆయన మీద ఉన్న క్రిమినల్ నేరారోపణలపై విచారణ ముగిస్తే.. సస్పెన్షన్ తొలగుతుంది.

ఒకసారి తాను పగబడితే అంతు చూసే వరకు వదిలేది లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో మారు నిరూపించుకుంటున్నారా? సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ విషయంలో.. ఆయన రిటైరు అయ్యే తేదీ వరకు సస్పెన్షన్ ను పొడిగించడం ద్వారా.. చంద్రబాబునాయుడు పగ సాధిస్తున్నారు.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఐపీఎస్ సంజయ్ మీద రకరకాల అవినీతి కేసులను బనాయించి ఆయనను సస్పెండ్ చేశారు. ‘ఆ కేసుల విచారణ ఇప్పటివరకు తేలలేదు’ అనే సాకు చూపించి.. ఆయనను 2024 డిసెంబరు 3 న సస్పెండ్ చేశారు. అప్పటినుంచి గడువు ముగిసిన వెంటనే మళ్లీ సస్నెన్షన్ ఉత్తర్వులు ఇస్తూ పొడిగిస్తున్నారు.

తాజాగా 2027 మార్చి 31 వరకు సస్పెన్షన్ పొడిగించారు. ఈలోగా.. ఆయన మీద ఉన్న క్రిమినల్ నేరారోపణలపై విచారణ ముగిస్తే.. సస్పెన్షన్ తొలగుతుంది. ఆ తేదీ.. ఆయన పదవీవిరమణ తేదీనే కావడం గమనార్హం.

ఈలోగా కేసులు ఎటూ తేలవు గనుక.. అడిషనల్ డీజీపీ హోదాలో ఉన్న ఎన్ సంజయ్ మళ్లీ యూనిఫాంలోకి వచ్చే అవకాశమే లేకుండా.. చంద్రబాబు సర్కారు కక్ష తీర్చుకుంటున్నదని ప్రజలు భావిస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పరిపాలన సాగుతున్న రోజుల్లో చంద్రబాబునాయుడును అరెస్టు చేసినప్పుడు ఐపీఎస్ సంజయ్ కీలకంగా వ్యవహరించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కుంభకోణానికి పాల్పడినందుకు గాను.. చంద్రబాబు మీద నమోదైన కేసుల్లో అరెస్టు చేయాల్సి వస్తే.. సంజయ్ వాటిని పర్యవేక్షించారు.

అరెస్టు సంగతి ఆయన విధుల్లో భాగంగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిగేదే అనుకున్నప్పటికీ.. ఆ తర్వాత ఆయన పోషించిన పాత్ర మాత్రం వివాదాస్పదంగా మారింది.

చంద్రబాబు మీద అవినీతికేసు విచారణ జరుగుతున్న సమయంలోనే.. ఐపీఎస్ సంజయ్ ఢిల్లీ, హైదరాబాదు.. ఇలా వేర్వేరు చోట్ల ప్రెస్ మీట్లు పెట్టి.. చంద్రబాబు పాల్పడిన అవినీతికి సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నందునే అరెస్టు చేశాం అని వెల్లడించారు. మొత్తానికి తెలుగుదేశం ఆయనను టార్గెట్ చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే.. యాక్షన్ ప్లాన్ తో రెడీ అయ్యారు.

సీఐడీ డీజీగా సంజయ్ పనిచేసిన రోజుల్లో ఎస్సీ ఎస్టీ బాధితుల హక్కుల చట్టంపై అవగాహన కల్పించే శిక్షణల కోసం కేటాయించిన నిధులను సొంతానికి వాడుకున్నారనేది ఆయన మీద ఒక కేసు.

అలాగే.. అగ్నిమాపక శాఖ డీజీ గా పనిచేసిన రోజుల్లో కూడా నిధుల దుర్వినియోగం చేశారని కేసులు పెట్టారు. ఆ క్రిమినల్ కేసుల విచారణ తేలేవరకు సస్పెన్షన్ విధిస్తూ వస్తున్నారు. కానీ ఆ విచారణ పర్వం మాత్రం ఎప్పటికీ పూర్తయ్యేలా కనిపించడం లేదు.

ఇంకా కొందరు సాక్షులను విచారించాల్సి ఉన్నదని, ఈ సమయంలో సంజయ్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తే ఆయన సాక్షులను ప్రభావితం చేయగలరని నెపం చూపుతూ సస్పెన్షన్ కు మళ్లీ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన రిటైర్ అయ్యే రోజునే గడువుగా నిర్ణయించి సస్పెండ్ చేయడం విశేషం.

7 Replies to “పగబడితే ఇక అంతే.. అంతు చూడ్డమే..!”

  1. దుర్మార్గాలు చేసే అధికారులకు ఇలాంటి సన్మానాలు చేయడం తప్పనిసరి. సిగ్గు ఎగ్గు లేకుండా దొంగ కేసులు పెట్టీ, రోజుకో ప్రెస్మీట్ పెట్టీ అధికారాన్ని అమ్మేసుకుంటే ఇలాంటి శిక్షలు తప్పవు. వీళ్లు చేసిన పాపాలు పాపం వీళ్ళ పిల్లలు అనుభవించాలి. కర్మ ఫలితం… ఎవరూ ఏమీ చెయ్యలేరు

  2. దుర్మార్గాలు చేసే అధికారులకు ఇలాంటి సన్మానాలు చేయడం తప్పనిసరి. సి గ్గు ఎగ్గు లేకుండా దొం గ  కే సు లు పెట్టీ, రోజుకో ప్రెస్మీట్ పెట్టీ అధికారాన్ని అమ్మేసుకుంటే ఇలాంటి శిక్షలు తప్పవు. వీళ్లు చేసిన పాపాలు పాపం వీళ్ళ పిల్లలు అనుభవించాలి. కర్మ ఫలితం.. ఎవరూ ఏమీ చెయ్యలేరు

  3. దు ర్మా ర్గా లు చేసే అధికారులకు ఇలాంటి సన్మానాలు చేయడం తప్పనిసరి. సి గ్గు ఎ గ్గు లేకుండా దొం గ కే సు లు పెట్టీ, రోజుకో ప్రెస్మీట్ పెట్టీ అధికారాన్ని అమ్మేసుకుంటే ఇలాంటి శిక్షలు తప్పవు. వీళ్లు చేసిన పాపాలు పాపం వీళ్ళ పిల్లలు అనుభవించాలి. కర్మ ఫలితం..ఎవరూ ఏమీ చెయ్యలేరు

  4. మరి అన్న కూడా ABV అంతు చూడాలి అనుకున్నాడు…కానీ ABV తగ్గకుండా పోరాటం చేసి పదవి తెచ్చుకొని తన సత్తా నిరూపించారు.అంటే మన దగ్గర సరుకు ఉంటే ఎవరు.అంతం చెయ్యలేరు

  5. అరెస్టు…. గత ప్రభుత్వ ఆదేశాల మేరకే జరిగింది….. అంటే…….ఈయన IAS రూల్స్ రెగ్యులేషన్ ఫాలో అవ్వలెదన్నమాట?

Comments are closed.