పవన్ కల్యాణ్.. గేమ్ ఛేంజ్ చేస్తారా?

పవన్ రావడం ఖాయం. డేట్ తేలడమే తరువాయి. ఈ సినిమా ట్రయిలర్ ను బుధవారం రిలీజ్ చేయబోతున్నారు.

‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. ఓవైపు పాటలు రిలీజ్ అవుతున్నాయి. ట్రెండ్ అవుతున్నాయి. మరోవైపు గ్రౌండ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇంకోవైపు యూనిట్ లో సభ్యుల ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో హంగామా నడుస్తోంది. ఇలా అన్ని కోణాల నుంచి సినిమా ప్రమోషన్ ను పరుగులుపెట్టిస్తున్నాడు నిర్మాత దిల్ రాజు.

అయితే ఇంత ప్రచారం నడుస్తున్నప్పటికీ, ఒక చిన్న క్లారిటీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. అదే పవన్ కల్యాణ్ ఎంట్రీ. ‘గేమ్ ఛేంజర్’ ప్రచారానికి పవన్ వస్తారనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన సినిమా కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.

ఇలాంటి టైమ్ లో ‘గేమ్ ఛేంజర్’ ప్రచారానికి పవన్ వస్తారా రారా అనేది అందరి అనుమానం. పవన్ వస్తే ఈ సినిమాకు వచ్చే బజ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది. ఎట్టకేలకు దీనిపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. పవన్ కోసం తాము కూడా వెయిట్ చేస్తున్నట్టు వెల్లడించాడు. పవన్ కల్యాణ్ డేట్ ఇస్తే, జనవరి 4 లేదా 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఈవెంట్ నిర్వహిస్తామని చెబుతున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విజయవాడలో భారీ కటౌట్ ఏర్పాటుచేశారు. ఇక పవన్ కూడా డేట్ ఇస్తే, సినిమా ప్రచారం పీక్స్ కు చేరినట్టే. ఈ సినిమా ప్రచారానికి బాబాయ్ ను రప్పించేందుకు, రామ్ చరణ్ స్వయంగా ప్రయత్నిస్తున్నాడు. పవన్ రావడం ఖాయం. డేట్ తేలడమే తరువాయి. ఈ సినిమా ట్రయిలర్ ను బుధవారం రిలీజ్ చేయబోతున్నారు.

14 Replies to “పవన్ కల్యాణ్.. గేమ్ ఛేంజ్ చేస్తారా?”

  1. సినిమా కంటే పెద్ద విషయాలు ఉన్నాయి అన్నాడుగా మొన్నే. మరి ఈ ఈవెంట్ కి రాకుండా ముఖ్యమైన ఇష్యూస్ పైన శ్రద్ధ పెట్టొచ్చుగా. ఏమిటో ఆయన ఏం చేస్తే అదే కరెక్ట్ అనుకోవాలేమో.

    1. పార్టీ కోసం మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కి అండగా ఉంన్నారు …రావడం కరెక్ట్

Comments are closed.