పుష్ప 2 జీఎస్టీ రీఫండ్ 35 కోట్లు

ఒక్క తెలుగు నాటనే 35 కోట్ల మేరకు జీఎస్టీలు బయ్యర్లకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది.

పుష్ప 2 అతి భారీగా వసూళ్లు సాధించిన పాన్ ఇండియా సినిమా. రెండు వేల కోట్ల వసూళ్లు. బాగానే ఉంది. మరి ఇంతకీ నిర్మాతల పరిస్థితి ఏమిటి? ఒక్క తెలుగు నాటనే 35 కోట్ల మేరకు జీఎస్టీలు బయ్యర్లకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. టాలీవుడ్ బిజినెస్ సంప్రదాయాల ప్రకారం అమ్మిన రేటు మేరకు వసూళ్లు రాకపోతే నిర్మాతలు జీఎస్టీని బయ్యర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన రేటు అంతే అంటే 20 కోట్లకు అమ్మితే 20 కోట్లు మాత్రమే చేసినా జీఎస్టీని నిర్మాతే భరించాలి. ఇరవై కోట్లకు అమ్మితే 22 కోట్లు చేస్తేనే జీఎస్టీని బయ్యర్ భరిస్తారు. ఇదో పద్ధతి.

ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 35 కోట్ల మేరకు నిర్మాతనే జీఎస్టీ చెక్కులు బయ్యర్లకు పంపాల్సిన పరిస్థితి ఉంది. ఒక్క సీడెడ్ మినహా మరెక్కడా ఇంకా బ్రేక్ ఈవెన్ మార్క్‌కు చేరలేదు పుష్ప 2. అందువల్ల జీఎస్టీలు నిర్మాత భరించాల్సిందే. అంటే నిర్మాతకు వచ్చే లాభాల్లో ఈ మేరకు తగ్గిపోతుందన్నమాట.

రేట్లు-షోలు లేకపోయి ఉంటే

అదనపు రేట్లు, అదనపు షోలు, స్పెషల్ ప్రీమియర్ల రేట్లు ఇవన్నీ కలిస్తేనే పుష్ప 2 ఈ భారీ నెంబర్లు నమోదు చేసింది. సినిమాను భారీ రేట్లకు అమ్మారు. భారీ రేట్లు రప్పించడం కోసం స్పెషల్ ప్రీమియర్ల రేట్లు ₹800 నుంచి ₹1200 వసూలు చేశారు. రెండు వారాల పాటు అదనపు రేట్లు వసూలు చేశారు. ఇన్ని చేసినా సీడెడ్ మినహా మరెక్కడా బ్రేక్ ఈవెన్ కాలేదు. అదే కనుక అదనపు రేట్లు, షోలు రాకపోయి ఉంటే తమిళనాడు, కేరళల మాదిరిగా తీసుకున్న వాటిలో కొంత వెనక్కు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది.

2 Replies to “పుష్ప 2 జీఎస్టీ రీఫండ్ 35 కోట్లు”

Comments are closed.