Advertisement

Advertisement


Home > Movies - Movie News

పుష్ప 2 టీజర్.. కొంచెమే సంతృప్తి

పుష్ప 2 టీజర్.. కొంచెమే సంతృప్తి

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో మైత్రీ సంస్థ నిర్మిస్తున్న పుష్ప 2 సినిమా టీజర్ వచ్చింది. వన్ మినిట్ కు పైగా కట్ చేసిన టీజర్ ఇది. కానీ ఫ్యాన్స్ కు అంతగా సంతృప్తి ఇవ్వలేదనే చెప్పాలి.

సినిమాలో కీలకమైన జారత సీన్ ను టీజర్ గా కట్ చేసి వదిలారు. ఇప్పటికే తెలిసిన లేడీ గెటప్ లో అల్లు అర్జున్ ను మరోసారి వీడియో రూపంలో చూపించారు. అమ్మవారి మాదిరిగా గెటప్, స్టెప్స్, చిన్న యాక్షన్ బిట్ ను కలిపి టీజర్ గా వదిలారు.

పుష్ప అంటే తగ్గేదేలే అనే డైలాగు. అలాంటి మంచి క్యాచీ, పవర్ ఫుల్ డైలాగు ఒక్కటైనా టీజర్ లో వుంటుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ ఆ ఆశలు నెరవేరలేదు. టీజర్ లో ఒక్క డైలాగు కూడా వేయలేదు. అదే పెద్ద డిస్సపాయింట్ మెంట్. బిజిమ్ ఓ మాదిరిగా వుంది.

పుష్ప 2 టీజర్ చూపించిన జాతర దృశ్యాలు మాత్రం భారీగా వున్నాయి. కలర్ ఫుల్ గా వున్నాయి. పాన్ ఇండియా భారీ సినిమా కనుక ఆ మాత్రం వుంటాయి..వుండాలి. కానీ దానికి మరింత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేది. అప్పుడు ఆ రెస్పాన్స్ కు కాస్త దూరంలో ఆగిపోయింది టీజర్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?