తెల్లగా ఉండే హీరోయిన్లంటే సౌత్ మేకర్స్ కు ఇష్టం

హీరోయిన్ రాధికా ఆప్టే మరోసారి సౌత్ మేకర్స్ పై విమర్శలు చేసింది

హీరోయిన్ రాధికా ఆప్టే మరోసారి సౌత్ మేకర్స్ పై విమర్శలు చేసింది. దక్షిణాది మేకర్స్ కు తెల్లగా ఉండే హీరోయిన్లంటే ఇష్టమని, అందుకే వాళ్లు ఎక్కువగా ఉత్తరాది అమ్మాయిల్ని తమ సినిమాల్లో తీసుకుంటారని కామెంట్ చేసింది.

సౌత్ మేకర్స్ లో ఉన్న ఈ వివక్ష వల్ల తను ఎక్కువగా అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయానని కూడా మరో విమర్శ చేసింది రాధికా ఆప్టే.

యాక్టింగ్ టాలెంట్ తో సంబంధం లేకుండా ఉత్తరాది అమ్మాయిలని సౌత్ మేకర్స్ ఏరికోరి సెలక్ట్ చేయడానికి కారణం, అమ్మాయిల తెల్లటి స్కిన్ టోన్ కారణం అంటోంది.

దక్షిణాది అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉంటారని, వాళ్లలో యాక్టింగ్ టాలెంట్ కూడా ఉంటుందని, పైపెచ్చు మరో అమ్మాయితో డబ్బింగ్ చెప్పించాల్సిన అవసరం కూడా ఉండదని.. అయినప్పటికీ నార్త్ అమ్మాయిల స్కిన్ టోన్ వాళ్లకు ఉండదు కాబట్టి, అవకాశాలు రావని అంటోంది రాధిక. తను సౌత్ సినిమాలకు దూరమవ్వడానికి ఈ వివక్ష కూడా ఓ కారణం అంటోంది.

దక్షిణాది మేకర్స్ ఉత్తరాది తెల్ల అమ్మాయిలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తే.. బాలీవుడ్ మేకర్స్ విదేశీ భామల కోసం వెంపర్లాడుతుంటారని ఘాటు వ్యాఖ్యలు చేసింది రాధిక. బాలీవుడ్ జనాల్లో ఈ విదేశీ భామల వ్యామోహం ఇంకా తగ్గలేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

కలర్ బాగుందని, వేరే ప్రాంతాలకు చెందిన అమ్మాయిల్ని తీసుకొచ్చి, వరుసగా వాళ్లకే అవకాశాలివ్వడం సరైన పద్ధతి కాదంటోంది రాధిక ఆప్టే. స్థానికంగా ఉన్న అమ్మాయిలకు కూడా అవకాశాలివ్వాలని, అప్పుడే ఏ పరిశ్రమ అయినా వృద్ధి చెందుతుందని సలహాలిస్తోంది.

4 Replies to “తెల్లగా ఉండే హీరోయిన్లంటే సౌత్ మేకర్స్ కు ఇష్టం”

Comments are closed.