వైసీపీకి ఒక్కటే లోటు ?

జీవీఎంసీ ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్ధులతో వివిధ వార్డులలో వైసీపీ అభ్యర్ధులు ధీటుగానే పోటీ పడుతున్నారు.

జీవీఎంసీ ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్ధులతో వివిధ వార్డులలో వైసీపీ అభ్యర్ధులు ధీటుగానే పోటీ పడుతున్నారు.

డిపాజిట్లు మీకు రావు అని కూటమి నేతలు ఎద్దేవా చేసినా చాలా చోట్ల గట్టి పోటీ ఇస్తున్నారు. మరి కొన్ని చోట్ల గెలుపు అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

అయితే వైసీపీ అభ్యర్ధులకు అన్నీ ఉన్నా అదొక్కటే లోటు అన్నట్లుగా పరిస్థితి ఉందని అంటున్నారు. ఆ లోటే అర్ధ బలం అని చెబుతున్నారు. కూటమి అభ్యర్ధులకు అధికార అండ ఉంది. ఆర్ధికంగా కూడా సహకారం ఉంది అని అంటున్నారు. అందుకే వారు దూసుకుని పోతున్నారు.

అయితే వైసీపీ అభ్యర్ధులకు ఇంధనం కొరత పట్టి పీడిస్తోంది అని అంటున్నారు. మొత్తం 120 వార్డులలో పలు చోట్ల వైసీపీకి సంబంధించి గెలుపు గుర్రాలు ఉన్నాయని అంటున్నారు. వారికి కనుక ఇతోధిక సాయం అందిస్తే సత్తా చాటుతారు అని అంటున్నారు.

ఈ విషయంలో వైసీపీ పెద్దల వైపు వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు అని తెలుస్తోంది. రానున్న మూడు రోజులు అత్యంత కీలకంగా భావిస్తున్నారు. నవంబర్ 1న పోలింగ్ ఉంది.

అందువల్ల ఈ కీలకమైన సమయంలో కనుక అండ దండ పార్టీ పెద్దల నుంచి అందితే వైసీపీ కష్టానికి అధినాయకత్వం ఆకాంక్షలకు తగిన విధంగా తమ రాజకీయ ప్రదర్శన ఉంటుందని వీరు అంటున్నారు.

అయితే జీవీఎంసీలో వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్నది పార్టీ పెద్దలు కూడా ఆరా తీస్తున్నారని భోగట్టా. అలా గెలిచే వీలున్న వారికి తమ వంతుగా సహకారం అందించేందుకు నేతలు కొందరు సిద్ధం అవుతున్నారని ప్రచారం సాగుతోంది.

అదే కనుక జరిగితే జీవీఎంసీలో వైసీపీ తన బలాన్ని బాగానే చూపించనుంది అని అంటున్నారు. కూటమి పొత్తులలో ఏర్పడిన విభేదాలు అసంతృప్తులు ఇవన్నీ కూడా తమకు కలసి వస్తాయని వైసీపీ అభ్యర్ధులు ధీమాగా ఉన్నారు.

7 Replies to “వైసీపీకి ఒక్కటే లోటు ?”

  1. తాయిలాలు ఇస్తే గాని మన పార్టీ కి ఓట్లు పడవా జీఏ.

    ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అన్నది నిజం కాదన్న మాట.

  2. అంతగా అర్ధబలం లేదనుకునే బదులు లిక్కర్ స్కామ్ డబ్బులు తియ్యొచ్చుగా బయటికి..

  3. మనం డబ్బు పంచితే గెలుస్తాం అంటున్నావ్ మరి కూటమి పాలన మీద వ్యతిరేకత  & మనోడికి జనాదరణ ఉత్తా గ్యాసేనా?

  4. నా దగ్గర సొంత ఫోనే లేక నేను ఏడుస్తుంటే, నన్ను ఫండ్ అడుగుతారెంట్రా పిచ్చి వెధవల్లారా 

  5. బాబు దగ్గర అమరావతిని అభివృద్ధి చేస్తానంటూ అప్పు తెచ్చిన వేల కోట్లు పడి మూలుగుతున్నాయి. ఇంకేముంది? అందరికీ కావలసినంత ఇచ్చి, అధికార బలం దుర్వినియోగం చేసి, విన్న వాళ్లకు డబ్బులు పంచి, వినని వాళ్ల మీద దౌర్జన్యాలు చేసి, తమ rowdy gang తో rigging లు చేసి, easy గానే గెలుస్తారు.

Comments are closed.