చరణ్ సినిమాలో ఈసారైనా వీళ్లకు ఛాన్స్ ఉంటుందా?

సారా అర్జున్, అనీత్ పద్దా, సాత్విక వీరవల్లి లాంటి హీరోయిన్ల పేర్లు తెరపైకొస్తున్నాయి. మరి ఆ ఇద్దరు హీరోయిన్ల సంగతేంటి? వాళ్లే రషా తడానీ, అనుపమ పరమేశ్వరన్.

రామ్ చరణ్ కొత్త సినిమా చేసిన ప్రతిసారి హీరోయిన్ పై డిస్కషన్ ఉంటుంది. చర్చలో ఉన్న హీరోయిన్లు కాకుండా, అందర్నీ ఆశ్చర్యపరుస్తూ, మరో హీరోయిన్ తో సెట్స్ పైకి వెళ్లడం జరుగుతుంది. ఈసారి కూడా అదే వ్యవహారం నడుస్తోంది.

సుకుమార్ తో సినిమా కోసం హీరోయిన్ వేట మొదలైంది. సారా అర్జున్, అనీత్ పద్దా, సాత్విక వీరవల్లి లాంటి హీరోయిన్ల పేర్లు తెరపైకొస్తున్నాయి. మరి ఆ ఇద్దరు హీరోయిన్ల సంగతేంటి? వాళ్లే రషా తడానీ, అనుపమ పరమేశ్వరన్.

గతంలో చరణ్ సినిమా కోసం దాదాపు ఫైనల్ అయి అవకాశం పోగొట్టుకున్నారు వీళ్లిద్దరూ. వాళ్లకు మళ్లీ ఇప్పటివరకు అవకాశం రాలేదు. ఇప్పుడు కనీసం వీళ్ల పేర్లు చర్చకు కూడా రావడం లేదు.

రంగస్థలం టైమ్ లో అనుపమను దాదాపు ఫైనల్ చేశారు. ఆఖరి నిమిషంలో తప్పించి సమంతాను తీసుకున్నారు. అప్పట్లో అనుపమ చాలా బాధపడింది. సుకుమార్ కూడా స్పందించాడు. మరోసారి తప్పకుండా అవకాశం ఇస్తానన్నాడు.

చెప్పినట్టుగానే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఆమెకు గతంలో అవకాశమిచ్చాడు. కానీ చరణ్ సరసన అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడా సందర్భం రానే వచ్చింది. కానీ ఆశ్చర్యంగా అనుపమ పరమేశ్వరన్ పేరు అస్సలు వినిపించట్లేదు.

ఇక రషా తడానీది కూడా ఇలాంటి మేటరే. పెద్ది సినిమా కోసం ఆమె దాదాపు ఫైనల్ అన్నారు. ఆఖరి నిమిషంలో జాన్వి కపూర్ ను తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి చరణ్ సినిమా కోసం ఆడిషన్స్ నడుస్తున్నాయి. కానీ రవీనా టాండన్ కూతురు రషా తడానీ పేరు మాత్రం వినిపించట్లేదు.

పెద్ది అవకాశం మిస్సయిన తర్వాత శ్రీనివాస మంగాపురం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రషా. ఆ సినిమా హిట్టయితే, ఇప్పుడామెకు చరణ్ సినిమాలో ఛాన్స్ వచ్చి ఉండేదేమో. ఏదేమైనప్పటికీ, ప్రస్తుతానికి వీళ్ల పేర్లు మాత్రం వినిపించట్లేదు.

4 Replies to “చరణ్ సినిమాలో ఈసారైనా వీళ్లకు ఛాన్స్ ఉంటుందా?”

Comments are closed.