దేశం వెలుపల ఉన్న వారికే తాము పుట్టి పెరిగిన ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువగా వుంటుంది.
జీవనోపాధి, చదువు, ఇతరత్రా కారణాలతో ప్రపంచంలోని వేర్వేరు దేశాల్లో మనవాళ్లు ఉంటున్నారు. వాళ్లంతా నిత్యం తమ ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న సామాజిక, రాజకీయ పరిణామాలపై ఎన్ఆర్ఐల నిశిత పరిశీలన వుంటుంది.
ఖండాంతరాల వెలుపల మనుషులున్నా, మనసంతా పుట్టిన గడ్డపైనే. ఎన్ఆర్ఐల్లో స్పష్టమైన రాజకీయ విభజన చూడొచ్చు. ఎన్ఆర్ఐల కోసం టీడీపీ, వైసీపీ, జనసేన….ఇలా వివిధ పార్టీలు ప్రత్యేక విభాగాల్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆయా రాజకీయ పార్టీల కన్వీనర్లు, కోఆర్డినేటర్లు, ప్రతినిధులు… వివిధ హోదాల్లో వుంటున్నారు.
టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం చాలా బలంగా వుంది. వీళ్లతో టీడీపీ పెద్దలు చంద్రబాబు, నారా లోకేశ్ తరచూ ఆన్‌లైన్‌లో కలుస్తుంటారు. ఏపీలో పార్టీ అవసరాల కోసం ఆర్థికంగా, హార్టికంగా తమ వంతు సహాయ సహకారాలు అందించడంలో టీడీపీ ఎన్ఆర్ఐలు ముందున్నారు.
వైసీపీ విషయానికి వస్తే, చాలా భిన్నమైన కథ. వైసీపీ ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కోఆర్డినేటర్‌గా ఆలూరు సాంబశివారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈయన పలు దేశాల్లో పర్యటించి పార్టీ అభిమానులందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు నిత్యం ప్రయత్నిస్తున్నారు. ఎన్ఆర్ఐలు ఎవరైనా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినప్పుడు వైఎస్ జగన్‌తో కలుపుతున్నారు.
వైసీపీపై ఎన్ఆర్ఐలు మొదటి నుంచి అభిమానం చూపుతున్నారు. కానీ నిలుపుకోవడంలో వైసీపీనే ఫెయిల్ అయ్యింది. 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి ఎన్ఆర్ఐలు తీవ్రంగా శ్రమించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్ఆర్ఐలను పూర్తిగా విస్మరించారు. ఇక్కడే టీడీపీ, వైసీపీకి మధ్య తేడాను గుర్తించొచ్చు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిరోజూ వంద మంది ఎన్ఆర్ఐలకు తిరుమల దర్శనభాగ్యం కల్పిస్తోంది. దీన్ని ఎంతో గౌరవంగా టీడీపీ ఎన్ఆర్ఐలు భావిస్తున్నారు.
మళ్లీమళ్లీ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలన్న పట్టుదలతో వాళ్లంతా పని చేయడానికి ఇలాంటి చిన్నచిన్న ఆదరణలే పనికొస్తాయి. ఈ సూక్ష్మాన్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుసుకోలేకపోయింది.
అందుకే 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ఎన్ఆర్ఐలు పెద్దగా మనసు పెట్టి పని చేయలేదు. అలాగని వాళ్లంతా టీడీపీ వైపు మొగ్గు చూపలేదు. అలా మౌనంగా కొంతకాలం వుంటూ వచ్చారు.
ఇటీవల మళ్లీ ఎన్ఆర్ఐలు యాక్టీవ్ అవుతున్నారు. అయితే వైసీపీ ఎన్ఆర్‌లపై ఇండియాలో కేసులు పెట్టి, వారు స్వస్థలాలకు వెళ్లిన వెంటనే వేధిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
ఈ విషయంలో వైసీపీ లీగల్ టీమ్ తగినంత బలంగా లేకపోవడంతో ఎన్ఆర్ఐలు మరింత చురుగ్గా, దూకుడుగా పని చేయడానికి భయపడుతున్నారు.
ఇదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎన్ఆర్ఐలు దూకుడు ప్రదర్శించారు. అప్పుడు ఒకట్రెండు కేసులు ఎన్ఆర్ఐలపై కేసులున్నా, అత్యంత బలీయంగా ఉన్న టీడీపీ లీగల్ టీమ్ ఇబ్బందులు లేకుండా చూసేది. అందుకే టీడీపీ ఎన్ఆర్ఐలు పార్టీ గెలుపు కోసం అద్భుతంగా పని చేశారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిత్యం ఎన్ఆర్ఐలతో చంద్రబాబు, లోకేశ్ మాట్లాడేవారు. అది మరింత బలాన్ని ఇచ్చేది.
ఇప్పుడు వైసీపీ అధికారంలో లేకపోయినా, ఎన్ఆర్ఐలతో వైఎస్ జగన్ మాట్లాడ్డం లేదన్న చిన్న అసంతృప్తి వారిలో వుంది. ఈ విషయంలో వైఎస్ జగన్ తగిన చర్యలు తీసుకోవాలి.
కేవలం ఎన్ఆర్ఐలకు పదవులు ఇవ్వడంతో సరిపెట్టకుండా, నిర్ణయాల్లో వారిని భాగస్వామ్యం చేయాలి. అలాగే న్యాయపరమైన సహాయసహకారాల్ని అందించడంలో వైసీపీ తగిన చర్యలు తీసుకుంటే, పార్టీ కోసం పనిచేసేవాళ్లు సిద్ధంగా ఉన్నారు.
వాళ్లందరినీ కలుపుకెళ్లడం వైసీపీ విజ్ఞతపై ఆధారపడి వుంటుంది. ఎందుకంటే, జగన్ సీఎం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ జగన్‌కు మాత్రం తామే దగ్గరగా వుండాలని, మరెవరూ దరిదాపుల్లో వుండకూడదని కోరుకునే నాయకులే వైసీపీలో ఎక్కువ. ఇప్పుడదే ఆ పార్టీకి అతిపెద్ద సమస్య. దాన్ని అధిగమించడంపైనే, పార్టీ బలోపేతం అనేది ఆధారపడి వుంది.

టీడీపీ కి వైసీపీ పోలిక.. నక్క కి నాగ లోకానికి ఉన్నంత వుంది…
టీడీపీ కి 40 ఏళ్ళ చరిత్ర వుంది… ఎంతో మంది నమ్మకస్తులు అయిన వాళ్ళు వున్నారు.. పార్టీ కూడా అన్నివిధాలా అందుబాటులో ఉంటుంది..
ఇంక అన్నియ… ఏరు దాటేదాకా.. పడవ మల్లన్న.. తర్వాత బోడి మల్లన్న టైప్
100%
200%
వెధవండి వాడు!!
NRAs (Non-Resident Andrates) పైన కూడా ద్రుష్టి పెట్టండి.
చంద్రగిరిలో ఊరు పేరు లేని నాయకులు టీడీపీ కి రిజైన్ చెయ్యగానే మన సైట్లో అది పెద్ద న్యూస్.
తణుకులో బలగం ఫ్యామిలీ మీ పార్టీ వీడి టీడీపీలో
జాయిన్ అయ్యారు. అది రాయము మనం.
ఒక పద్ధతి ప్రకారం జాకీలు వేసి లేపడానికి అన్నీ పాజిటివ్ గా రాయడం. ఏదో జరిగిపోతుంది అన్న వచ్చేస్తాడు అని భ్రమలు కల్పించడం వారేవా GA….
First of all which NRI without thoka supports ycp? If anyone supports they are educate f…
ఎన్నారైలు, జాగ్రత్త ఉండండి😁
To eat them all, it’s not sufficient after eating everything from the local.
What ever a psycho never gets a new chance.
వైచీపీ కి అందరి మీద దృష్టి ఉంటుంది, వైచీపీ మీదే ఎవరి దృష్టి ఉండదు, అదే ఫన్నీ థింగ్ ఇక్కడ!!