బాబు మాదిరి కాదు లోకేష్!

లోకేష్ కు కిరీటం అందించడం అన్నది చాలా స్మూత్ గా లాంచింగ్ జరిగే రోజు ఎంతో దూరంలో లేదనే అనుకోవాలి.

జనరేషన్ గ్యాప్ అనేది ఎప్పుడూ వుంటుంది. నిన్నటి తరం కాస్త క్షమించడం, సర్లే, ఏదో తప్పు చేసాడు.. సర్దుకున్నాడు కదా, అని దగ్గరకు తీయడం అన్నది కామన్. పట్టు విడుపు అనేది వుంటుంది. కానీ ఈ జనరేషన్ అలా కాదు. అటో.. ఇటో.. అంతే తప్ప ఇష్టం వచ్చినట్లు డ్యాన్స్ అడతాం అంటే కుదరదు. చూసుకుందాం.. నీ పెతాపమో.. నా పెతాపమో అనే తరహా. పైగా ముతకవాసన అస్సలు కిట్టదు. తమ అలోచనలు పంచుకుని, తమ వేగం అందుకుని, తమతో నడవగలిగే వారు మాత్రమే కావాలి.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇదే జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ పుట్టిన తరువాత సుమారు రెండు మూడేళ్ల నుంచి చంద్రబాబు హవానే సాగుతూ వస్తోంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో. కానీ ఇప్పుడు మాత్రం పార్టీ మొత్తం లోకేష్ చేతుల్లోకి వెళ్లింది. 2014 నుంచే కొద్ది కొద్దిగా పరిస్థితి మారుతూ వస్తోంది 2019 నుంచి ఇంకా పెరిగింది. చంద్రబాబు జైలుకు వెళ్లి వచ్చేసరికి తరువాత పగ్గాలు పూర్తిగా లోకేష్ తీసుకున్నారు. ఎన్నికలు, టికెట్ లు, పదవులు అన్నీ పూర్తిగా ఇప్పుడు లోకేష్ నిర్ణయానుసారం జరుగుతున్నాయి.

టికెట్ ల కేటాయింపు దగ్గరే ఇది బయటపడింది. వీలయినంత వరకు సీనియర్లను పక్కకు తప్పించారు. బలమైన సీనియర్లు వున్న చోట వారసులను బయటకు తెచ్చారు. గతంలో మంత్రుల హవా కొంతయినా కనిపించేది. ఇప్పుడు మంత్రుల మాటే ఎక్కడా పెద్దగా లేదు. అగ్రెసివ్ గా వుంటారు అనే వారిని మెల్లగా పక్కన పెడుతున్నారు. విధేయులు అనేవారికి మాత్రమే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గతంలో జగన్ వైపు వెళ్లి, మళ్లీ ఇటు వస్తాం అనే వారికి ఎక్కువగా నో ఎంట్రీ బోర్డ్ కనిపిస్తోంది. జగన్ టైమ్ లో అటు వున్న మీడియా పెద్దలు, మళ్లీ ఇటు వద్దాం అని అనుకుంటే కనీసం అపాయింట్ మెంట్ కూడా దక్కడం లేదు. లోకేష్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు ఇలాంటి విషయాల్లో. పైకి సున్నితంగా కనిపిస్తూనే నిర్ణయాల విషయంలో కఠినంగా వుంటున్నారు.

అదే సమయంలో నేషనల్ ఎక్స్ పోజర్ కూడా సంపాదించే పనిలో వున్నారు. కీలకమైన సెమినార్లు, మీటింగ్ లు అన్నింటికీ లోకేష్ నే అటెండ్ అవుతున్నారు. చంద్రబాబు ఎక్కువగా స్టేట్ లో అధికారుల సమీక్షలకే పరిమితం అవుతున్నారు. పవన్ కు అస్సలు ఈ ధ్యాసే పట్టదు. అది వేరే సంగతి. మొత్తం మీద లోకేష్ ఇప్పుడు ఫ్యూచర్ లీడర్ అఫ్ ఏపీగా ప్రొజెక్ట్ అవుతున్నారు. తనను తాను తయారు చేసుకుంటున్నారు. అదే సమయంలో మాట్లాడే మాటల్లో ఎక్కడా అటిట్యూడ్ అన్నది కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. తండ్రి గురించి ప్రస్తావిస్తూనే, తనను కూడా ప్రొజెక్ట్ చేసుకోవడం మెచ్చుకోదగ్గ ప్లానింగ్ అని చెప్పాలి.

మొత్తం మీద ఇప్పుడు లోకేష్ టైమ్ నడుస్తోంది, ఇక మిగిలింది కిరీట ధారణ మాత్రమే. దానికి చంద్రబాబు ప్లానింగ్ వుండనే వుంటుంది. ఎందుకంటే ఇప్పటికే కార్యకర్తలు, పార్టీ అభిమానులు దాదాపుగా లోకేష్ నే తమ లీడర్ గా భావిస్తున్నారు. అందువల్ల అక్కడ సమస్య లేదు. పవన్ కళ్యాణ్ కు ఏం జరుగుతోందో, జరుగుతుందో తెలియకుండా వుండదు. లోకేష్ కు కిరీటం అందించడం అన్నది చాలా స్మూత్ గా లాంచింగ్ జరిగే రోజు ఎంతో దూరంలో లేదనే అనుకోవాలి. ప్రస్తుతానికి అయితే కిరీటం లేకున్నా లోకేష్ నే అన్ని విధాలా నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నారన్నది వాస్తవం.

20 Replies to “బాబు మాదిరి కాదు లోకేష్!”

  1. నువ్వు ఇలాంటి పచ్చినిజాలు పచ్చి పచ్చి గా చెప్పేస్తే మీ జలకం గాడు వాడి వంది మాగదులు డైపర్లు ఏసుకొంటారేమో…. అసలే ఇంట్లో పని మొత్తం అవీబావే చూసుకొంటున్నాడంట… పాపం పొట్టోనికి bottigaa😝ఆ యావే లేకుండా పోయిందంట…

    1. చేతకానీ దద్దమ్మ కంటే అందరూ ఎంతోకొంత బెటర్, ప్యాకేజీ అంటావా అది నువ్వు చూసి ఉంటే చెప్పు సాక్షం చూపించి మా కళ్ళు తెరిపించు అంతే కానీ డైమండ్ రాణి వాగినట్టు నోటికొచ్చింది వాగొద్దు

  2. పప్పు ని రెండు రకాలు గ్ వండ వచ్చు ఒక్కటి కుక్కర్లో మోధిగే పప్పు నిప్పుల్లో ఊడికే పప్పు.. ఊడికే పప్పు తో గ్యాస్ ప్రాబ్లం రాదు.

    మోధిగే పప్పుతో గ్యాస్ సమస్య వస్తుంది ..పప్పు పప్పు అని వాడిని నిప్పు ని చేస్తే పప్పు ని ఉడక బెట్టుకుని తింటున్నాడు కాబట్టీ గ్యాస్ లేదు

    మనం మాత్రమే మోధిగే పప్పు ని తిని తిని గ్యాస్ తో అల్లాడుతు అందరిని అల్లల్లాడిస్తున్నాం..కంపూ కంపూ చేసుకున్నాం

Comments are closed.