“భీమదేవరపల్లి బ్రాంచి” సినిమా తో కాస్త గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రమేశ్ చెప్పాల. అ సినిమా తరువాత చేస్తున్న సినిమా లగ్గం. ఈ సినిమా విడుదల దగ్గరకు వస్తున్న నేపథ్యంలో రమేష్ చెప్పాల మీడియాతో మాట్లాడారు. భీమదేవరపల్లి బ్రాంచి సినిమా తరువాత ఈ ఎలాంటి కథ చెయ్యాలి అనే విషయంలో చాలా ఆలోచించానని అయన తెలిపారు. ఆ ఆలోచనల్లోనుండి పుట్టిన కథే లగ్గం. తెలంగాణ కల్చర్లో లగ్గం అనేది ఎన్నో ఎమోషన్స్ తో ముడిపడి ఉంటుంది. తెలంగాణ లగ్గానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆ ఎమోషన్స్ ని కల్చర్ ని కలిపి తెరమీదకు తీసుకురావాలి అనుకున్నాను. చిన్నతనం నుండి నా చుట్టూ చూసిన ఎన్నో క్యారెక్టర్లనీ ఈ కథలో రాసుకున్నా. మొదట లగ్గం అని టైటిల్ అనుకున్నప్పుడు టైటిల్ చెప్పగానే చాలా మంది కనెక్ట్ అయ్యారు అని రమేష్ వివరించారు.
లగ్గం ఒక ప్రవాస భారతీయులు సాఫ్టువేర్ ఇంజనీర్ లు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది, అంతే కాదు, ఒక రైతు చూడాల్సిన సినిమా , పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చూడాల్సిన సినిమా , అలాగే ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి చూడాల్సిన సినిమా అన్నారు. లగ్గం ఐడియా అనుకున్నప్పుడు ఈ సినిమానీ ఒక ట్రూత్ తో ఎండ్ చెయ్యాలి అనుకున్నాను, అదే చేసాను. క్లైమాక్స్ ఈ సినిమాని మరో మెట్టు ఎక్కిస్తుందనే నమ్ముతున్నా అన్నారు.
‘ఈ లగ్గం అరిటాకులో విందుభోజనంలా ఉండబోతుంది’. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది. అందరూ తప్పకుండా వచ్చి మమ్మల్ని దీవించండి అన్నారు దర్శకుడు రమేష్.
లగ్గం చిత్రానికి సుబిషి ఎంటర్టైన్మెంట్స్ వేణుగోపాల్ రెడ్డి నిర్మాత. సాయి రోనక్, ప్రజ్ఞ నగ్ర, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, తదితరులు నటించారు. సంగీతం మణిశర్మ.