కొండా సురేఖ అతిని భ‌రించ‌లేం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు!

తెలంగాణ మంత్రి కొండా సురేఖ నోటి దురుసు ఆమెకు క‌ష్టన‌ష్టాలు తీసుకొస్తోంది. ఇటీవ‌ల ఆమెపై హీరో నాగార్జున‌, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌మ‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన సురేఖ‌పై ప‌రువు న‌ష్టం దావాలు…

తెలంగాణ మంత్రి కొండా సురేఖ నోటి దురుసు ఆమెకు క‌ష్టన‌ష్టాలు తీసుకొస్తోంది. ఇటీవ‌ల ఆమెపై హీరో నాగార్జున‌, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌మ‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన సురేఖ‌పై ప‌రువు న‌ష్టం దావాలు వేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అధిష్టానానికి సురేఖ‌పై ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన సురేఖ‌… రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో చోటు ద‌క్కించుకున్నారు. సురేఖ‌కు వాగ్దాటి ఎక్కువే. అయితే ఒక్కోసారి ఆమె నోటి దురుసు ప్ర‌ద‌ర్శిస్తార‌నే చెడ్డ పేరు కూడా లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా కొండా సురేఖ‌, ఆమె భ‌ర్త ముర‌ళి జోక్యం చేసుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి రావ‌డం గ‌మ‌నార్హం.

కొండా సురేఖ‌ను త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో జోక్యం చేసుకోకుండా అడ్డుకోవాల‌ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీకి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఇవాళ టీపీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్‌కుమార్ గౌడ్‌తో వాళ్లంతా భేటీ కానున్నారు. సురేఖ విష‌య‌మై తాడోపేడో తేల్చుకోడానికి వాళ్లంతా సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం. రెండు రోజుల క్రితం ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి, సురేఖ అనుచ‌రుల మ‌ధ్య ప్లెక్సీ విష‌య‌మై గొడ‌వ జ‌రిగింది.

సురేఖ అనుచ‌రుల్ని రేవూరి వ‌ర్గీయులు చావ‌బాదారు. దీంతో వ్య‌వ‌హారం పోలీస్‌స్టేష‌న్ వ‌ర‌కూ వెళ్లింది. దాడిలో సురేఖ వ‌ర్గీయుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. దీంతో కొండా సురేఖ తీవ్ర ఆవేశంలో ఉన్నారు. అయితే టీపీసీసీ అధ్య‌క్షుడి నుంచి సురేఖ‌, రేవూరికి ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఇద్ద‌రూ బ‌హిరంగంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయొద్ద‌ని ఆయ‌న సూచించారు. టీపీసీసీ అధ్య‌క్షుడితో స‌మావేశం కీల‌కంగా మార‌నుంది. ఏం జ‌రుగుతుందో చూడాలి.

7 Replies to “కొండా సురేఖ అతిని భ‌రించ‌లేం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు!”

  1. బారాసా ని బ్రోతల్ పార్టి అనటాన్ని నేను ఖండిస్తున్నా.. నిజానికి బారాసా బ్రోతల్ పార్టీ కాదు అది బ్రోకర్ పార్టీ .. బ్రోతల్ పార్టీ అంటేవై చీపి పార్టీ. దానికి సాక్ష్యాలు కోకోల్లలు.

Comments are closed.