చెన్నై నగరాన్ని మరోసారి భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. గడిచిన 24 గంటలుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నిన్న సాయంత్రం నుంచి కాస్త తెరిపి ఇచ్చినప్పటికీ, ఈరోజు మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు మరోసారి జలమయమయ్యాయి. ఈసారి వరద రజనీకాంత్ ఇంటిని కూడా తాకింది.
చెన్నైలోని ఖరీదైన పోయెస్ గార్డెన్ లో రజనీకాంత్ ఉంటున్నారు. ఈ ప్రాంతంలోకి కూడా వరద వచ్చింది. రజనీకాంత్ ఇంటి గేటును దాటి లోపలకు నీరు వచ్చింది. ఈ ప్రాంతానికి వెళ్లే మార్గాలన్నీ జలమయమయ్యాయి. ప్రస్తుతం రజనీకాంత్ ఇంట్లోనే ఉన్నారు.
కొన్ని రోజుల కిందట ఆయన అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈనెల ప్రారంభంలో ఆయనకు వైద్యలు సర్జరీ నిర్వహించి, స్టెంట్ అమర్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకు డిశ్చార్జ్ అయిన రజనీకాంత్, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇదే ప్రాంతంలో రజనీకాంత్ తో పాటు చాలామంది ప్రముఖుల నివాసాలు ఉన్నాయి. తాజాగా హీరో ధనుష్ కూడా 150 కోట్ల రూపాయలు పెట్టి, ఈ ఏరియాలో ఓ బంగ్లాను కొనుగోలు చేశాడు.
ప్రస్తుతం చెన్నైలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. స్కూల్స్, కాలేజీలకు శెలవులిచ్చారు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించారు. ఈరోజు, రేపు వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.
nenu inka nirmathalu cue kattaremo anukunna ne vetaka@r@pu heding tho
AP high court should give notice to TN government
Call boy jobs available 9989793850
Call boy works 9989793850