జగన్ పై అంతంత రంకెలేశారు.. చివరికి తేల్చింది ఇదా?

జగన్ తన పరిశ్రమ కోసం పక్కాగా పట్టాభూములు మాత్రమే కొన్నట్టుగా ప్రభుత్వమే ధ్రువీకరించినట్లు అయింది.

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి- ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం బయటపడి కొన్ని నెలలుగా వార్తల్లో నలుగుతోంది. సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ లో తల్లికి గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చిన షేర్లు, అడ్డదారుల్లో వారు విక్రయిస్తున్నందువల్ల వాటిని తనకు తిరిగి ఇప్పించాలని కోరుతూ జగన్ ట్రిబ్యునల్ ఆశ్రయించినప్పటికీనుంచి వివాదం చాలా ముదిరింది.

సరస్వతీ పవర్ కు సంబంధించిన ఆనుపానులు, పాత వ్యవహారాలు అన్నీ వార్తల్లోకి వచ్చాయి. మొత్తానికి సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ కోసం మాచర్ల ప్రాంతంలో దాదాపు 1200 ఎకరాలకు పైగా భూములను సేకరించినట్టు కూడా వార్తల్లోకి వచ్చింది.

ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్కసారిగా రంగంలోకి దిగారు. ఈ భూముల కొనుగోళ్ల వ్యవహారం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్ లో సాగినది కావడంతో.. ఆ కొనుగోళ్ల నిండా అక్రమాలే ఉంటాయని ఆయన తలపోశారు. బెదిరించి ప్రలోభ పెట్టి అసైన్డ్ భూములను లాక్కుని ఉంటారని, ప్రభుత్వ భూములను అడ్డదారుల్లో సొంతం చేసుకుని ఉంటారని పవన్ కల్యాణ్ పాపం ఆశపడ్డారు.

అత్యుత్సాహానికి పోయి.. ఎగబడి ఆ ప్రాంత విజిట్ కు వెళ్లారు. సరస్వతీ భూముల గురించి పదేపదే మాట్లాడారు. రెవెన్యూ అధికారులను పురమాయించి ప్రత్యేకంగా సర్వేలు చేయించారు. అన్నీ పట్టాభూములే అని తేల్చినప్పటికీ.. పవన్ శాంతించలేదు. తన పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ప్రజలను రైతులను బెదిరించి భూములు లాక్కున్నారని వారికి న్యాయం చేస్తామని పవన్ చెప్పుకొచ్చారు.

అలాగే.. దాదాపు 400 ఎకరాల అటవీ భూములను అక్రమంగా రెవెన్యూ భూములుగా రికార్డులు మార్చేసి కాజేశారని తనకు రైతులు చెబుతున్నారని కూడా పవన్ కల్యాణ్ అప్పట్లో ఆరోపించారు. నిజానికి ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడు.. అటవీ భూములను రెవెన్యూ భూములుగా అడ్డదారిలో మార్చడం జరిగి ఉంటే.. దానికి సంబంధించి రికార్డులను శోధింపజేసి, ఎఫ్పుడు ఏం జరిగిందో సాధికారికంగా మాట్లాడకుండా.. రైతులు చెప్పారంటూ మాట్లాడ్డమే కామెడీగా మారింది.

అయితే ఇంతకాలం తర్వాత.. మొత్తం సరస్వతీ పవర్ కు చెందిన దాదాపు 1200 ఎకరాలకు పైబడిన భూముల్లో కేవలం 17 ఎకరాలు మాత్రం అసైన్డ్ భూములు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. వాటిని వెనక్కు తీసుకుంటున్నట్టుగా తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. మాచవరం మండలం వేమవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లిలో 3.89 ఎకరాలు అసైన్డ్ భూములను వెనక్కు తీసుకున్నారు.

ఈ ఉత్తర్వులతో జగన్ పేదల నుంచి కాజేశారని, అటవీ భూములు ఉన్నాయని చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని తేలిపోయినట్టే. జగన్ తన పరిశ్రమ కోసం పక్కాగా పట్టాభూములు మాత్రమే కొన్నట్టుగా ప్రభుత్వమే ధ్రువీకరించినట్లు అయింది.

8 Replies to “జగన్ పై అంతంత రంకెలేశారు.. చివరికి తేల్చింది ఇదా?”

  1. ఒక్క ఎకరం అస్సైండ్ భూమి తీసుకున్నా నేరమెరా అయ్య! 17 ఎకరాలు అంటె అది నెరమె!

    ఎదొ ఇంతెనా… అని చిన్నది చెసి చూపించ వద్దు!

    1. అమరావతి లొ TDP వాళ్ళు పెదల అస్సైండ్ బూములు కాజెసారు అని 33 వెల ఎకరాలు 5 ఎళ్ళ పాటు జల్లెడ పట్టి మరి చూసారు! ఎమి దొరకక ఇక మూసుకున్నరు!

      మరి ఇన్ని తెలిసిన అతి నిజాయితీ పరుడు 17 ఎకరాలు ఎలా కాజెసాడు?

  2. వందలకొద్దీ హత్యలు చేసిన వాడికి.. ఎదుటివాడి చెయ్యో కాలో తీసెయ్యడం అన్నది చాలా చిన్న నేరం… అలాగే ప్రభుత్వ ధనాన్ని భూముల రూపంలో వందలకు వందల ఎకరాలు, డబ్బు దారి మళ్లింపు రూపం లో వేలకు వేల కోట్లు రూపాయలు సంవత్సరాల తరబడి దోచుకున్న వాళ్ళకి ఇది చాలా చాలా చాలా చిన్న తప్పు చిన్న నేరం .. దీన్ని మీరు సమర్థించడం లో ఏమాత్రం తప్పు లేదు

  3. ఇడు*పుల పాయ లో ప్రభుత్వ స్థలాలు దొంగ*తనం చేస్ , ఆదొంగత*నం బయట పడేసరికి, మాకు తెలియక ఆ దొంగ*తనం చేసాము అని ఆ స్థలాలు తిరిగి ఇచ్చేసిన తేలు కుట్టిన ఆ దొం*గ ఎవరి గ్రేట్ ఆంద్ర?

Comments are closed.