తమ్ముళ్లకు మంచు లక్ష్మి పరోక్ష ప్రవచనం?

ఈ ప్రపంచంలో ఏదీ నీకు సొంతం కానప్పుడు, ఏదో కోల్పోతామనే భయం నీకెందుకు?

ఓవైపు మంచు సోదరులు, మంచు మోహన్ బాబు ఓ రేంజ్ లో యుద్ధం చేస్తున్నారు. ఆస్తుల కోసం గొడవ పడుతున్నారు. గడిచిన 4 రోజులుగా ప్రతి రోజూ మంచుమంటలే హాట్ టాపిక్.

అయితే ఇంత జరుగుతున్నా మంచు లక్ష్మి మాత్రం ఈ వివాదంలో కలుగజేసుకోలేదు. ఒక్క స్టేట్ మెంట్ ఇవ్వలేదు. మీడియా కంటికి కనిపించలేదు. వివాదం మొదలైన ప్రారంభంలో ఒకసారి ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చి, మంచు మనోజ్ ను పరామర్శించి తిరిగి ముంబయి వెళ్లిపోయారు.

ఓవైపు సోషల్ మీడియాలో జనం మంచు లక్ష్మిని ప్రశ్నిస్తున్నప్పటికీ ఆమె చలించలేదు. ఈరోజు ఉదయం మాత్రం ఉన్నట్టుండి ఓ కొటేషన్ పెట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకు ఈ కొటేషన్ ఎందుకు పెట్టాలనిపించిందో…!

“ఈ ప్రపంచంలో ఏదీ నీకు సొంతం కానప్పుడు, ఏదో కోల్పోతామనే భయం నీకెందుకు?” అనేది లక్ష్మి కొటేషన్. నిజానికి ఇది మంచి కొటేషన్. వేరే ఎవరైనా దీన్ని పోస్ట్ చేస్తే పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు కానీ, ఇలాంటి సున్నితమైన సమయంలో మంచు లక్ష్మి ఎకౌంట్ నుంచి ఇది పడటంతో అందర్లో ఆసక్తి పెరిగింది.

తన సోదరులు మంచు మనోజ్, మంచు విష్ణును ఉద్దేశించి ఆమె ఈ పోస్ట్ పెట్టి ఉంటారని కొందరు అంటుంటే.. ఏకంగా తన తండ్రికే లక్ష్మి ఈ ప్రవచనాన్ని అంకితం చేసి ఉంటారని మరికొందరు అంటున్నారు. మొత్తానికి జరుగుతున్న వివాదంపై ఒక్కసారి కూడా స్పందించనప్పటికీ, ఈ ఒక్క కొటేషన్ తో ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు.

4 Replies to “తమ్ముళ్లకు మంచు లక్ష్మి పరోక్ష ప్రవచనం?”

  1. చెంచు లచ్చక్క గారు ఇలా ప్రవచనాలు చెప్పే బదులు తెలివిగా లాక్కున్న తన ఆస్తి వాటా తమ్ముడికి ఇవ్వొచ్చుగా ప్రేమతో

      1. నేనెదో సరదాగా పెట్టాను సార్, అయునా మీ అంత గొప్ప మేధస్సు లౌకికవాదం నాకు లేదులెండి సార్

Comments are closed.